హెబ్రీయులకు వ్రాసిన పత్రిక నుండి ముఖ్య వచనములు

పాలస్తీనాలోని అధికమైన యూదులు క్రైస్తవ విశ్వాసమునకు వచ్చిన పిదప క్రైస్తవులకు ఆ రోజులలో అధికముగా వచ్చిన ఉపద్రవము నుండి తప్పించుకొను నిమిత్తము యూదమతమునకు తిరిగి వెళ్ళుటకైన అభిప్రాయమును విలువరచిరి. ఈ విధముగా దిగజారిపోక ముందుకు సాగుటకును, పూర్ణజ్నామును పొందుటకయును ఈ గ్రంథ రచయిత వారికి బోధించెను. యూద మతముకన్నను క్రీస్తు ఎంతో నిజమైన వాడను సత్యమే అతడు చెప్పునట్టి బోధ యొక్క అంతర్భావము. క్రీస్తు ఆరాధనకు పాత్రుడైనందున దూతలకన్నను ప్రభావము గలవాడు. సమస్తమును సృజించినవాడగుటచే మోషే కన్నను శ్రేష్టుడు. అహరోను యొక్క యాజకత్వము కన్నను క్రీస్తు యొక్క యాజకత్వము శ్రేష్ఠమైనది. ఎందుకనగా క్రీస్తు నిత్యమైన ఒకే బలిని చెల్లించెను. ఆయన మిక్కిలి మహిమకరమైన ఒక నిబంధనకు మధ్యవర్తియైనందున ధర్మశాస్త్రము కన్నను శ్రేష్టమైనవాడు. క్లుప్తముగా చెప్పవలయునంటే యూదమతములో వారికేర్పడిన నష్టము కంటెను అనేకరెట్లు క్రీస్తు మూలముగా ఈ విశ్వాసుల ద్వారా పొందగలము. క్రీస్తులో ముందుకు సాగునపుడు శోధింపబడిన ఒక విశ్వాసమును, ఆత్మీయబోధనలు సత్క్రియలకైన పట్టుదల వారికి ప్రతిఫలములగుచున్నవి. ఇదే హెబ్రీ పత్రిక యొక్క వాదము.

Verses Related from the Bible:
 • Hebrews 1
 • 3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును,ఆయన తత్వముయొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతలకంటె ఎంత శ్రేష్ఠమైన నామము పొందెనో వారికంటె అంత శ్రేష్ఠుడై, ఉన్నత లోక
 • 4. మందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుం డెను.
 • Hebrews 1
 • 10. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి
 • 11. ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును
 • 12. ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.
 • 13. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనినిగూర్చియైనయెప్పుడైనను చెప్పెనా?
 • 14. వీరందరు రక్షణయను స్వాస్థ్యము పొందబోవువారికి పరి చారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా?
 • Hebrews 4
 • 12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.
 • 13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
 • Hebrews 6
 • 19. ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది.
 • Hebrews 4
 • 16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.
 • Hebrews 9
 • 27. మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.
 • Hebrews 11
 • 1. విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది.
 • Hebrews 11
 • 6. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.
 • Hebrews 12
 • 1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున
 • 2. మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు.
 • Hebrews 13
 • 5. ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.
 • Hebrews 10
 • 19. సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,

Related Bible Plans | Show All Plans

ప్రకటన గ్రంథం నుండి ముఖ్య వచనములు

Character - స్వభావం, లక్షణము

Encouraging - ధైర్యపరచుట - ప్రోత్సాహపరచుట

Confidence - నమ్మిక

Assurance in the life of faith - విశ్వాస జీవితంలో నిశ్చయత

Reassurance - స్థిరపరచుట

Faith-విశ్వాసము

Grace - కృప

Benefits of Afflictions - బాధల యొక్క ప్రయోజనాలు

Assurance - నిశ్చయత

Prayer - ప్రార్థన

God and Heart - దేవుడు మరియు హృదయము

Hope And Faith - విశ్వాసములో నిరీక్షణ

Tests - పరీక్షలు

Self Examination - స్వీయ పరీక్ష