Inspirations
 • Day 304 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్ధన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింపశక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మయొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా ఆయన దేవుని చిత్తప్రకారము పరిశుద్ద...

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 303 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • ఓపికతో పరుగెత్తుదము (హెబ్రీ 12:1-2).

  ఓపికగా పరుగెత్తడం చాలా కష్టమైన పని. అసలు పరుగెత్తడం అంటేనే ఓపిక లేకపోవడాన్ని సూచిస్తున్నది. ఒక గమ్యాన్ని చేరాలన్న ఆతృతతోనే పరుగెత్తడం అనేది జరుగుతుంది. ఓపిక అనగానే మనకు ఒకచోట నిలకడగా కూర్చోవడం కళ్ళల్లో మెదులుతుంది. మంచం పట్టినవాళ్ళ దగ్గర కూర్చుని ఉండే...

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 302 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును (మలాకీ 3:3).

  పరిశుద్దులను మరింత పవిత్రులనుగా చెయ్యాలని చూస్తుండే మన తండ్రికి పరిశుద్ధపరిచే అగ్నిజ్వాలల విలువ తెలుసు. ఎక్కువ విలువగల లోహం గురించి కంసాలి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాడు. దానిని అగ్నిలో కాలుస్తాడు. అప్పుడే కరిగిన లోహం దానిలో ...

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 301 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • అయినను దేవుడు కరుణాసంపన్నుడైయుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించేను . . . క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను (ఎఫెసీ 2:4-7).

  క్రీస్తుతోకూడా పరలోకంలోనే మన అసలైన స్థానం....

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 300 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • నీ అలలన్నియు నీ తరంగములన్నియు నా మీదుగా పొర్లి పారియున్నవి (కీర్తనలు 42:7).

  మనమీదుగా పారేవి దేవుని తరంగాలే
  నురగతో చినుకులతో కళ్ళు విప్పాయి
  మృదువుగా పదిలంగా పరుచుకున్నాయి
  క్షేమంగా మనలను ఇంటికి చేర్చాయి.

  మనమీదుగా పారేవి దేవుని తరంగాలే
  వాటిమీద నడిచాడు యేసు
  ప్రార...

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 299 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగ్యాల కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను (మత్తయి 14:23).

  మనిషిగా యేసుక్రీస్తు ఏకాంతానికి ఉన్న ప్రాముఖ్యతను గ్రహించాడు. తనంతట తాను ఒంటరిగా ఉండేవాడు. మనుషులతో సహవాసం మనలను మననుండి బయటకు ఈడ్చి అలసిపోయేలా చేస్తుంది. యేసుక్రీస్త...

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 298 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును (యోహాను 16:24).

  అమెరికా సివిల్ వార్ లో ఒక బ్యాంకు అధికారికి ఏకైక కుమారుడైన ఒకతను యూనియన్ సైన్యంలో చేరాడు. తండ్రి అతణ్ణి చేరడానికి అనుమతి ఇచ్చినప్పటికీ ఆ నిర్ణయం తీసుకోవడం అతనికి చాలా బాధాకరమైనది.

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 297 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను (యెషయా 41:15).

  అయిదు డాలర్లు విలువ చేసే ఉక్కుముక్కను గుర్రపు నాడాలుగా చేస్తే అది 10 డాలర్ల ధర పలుకుతుంది. దాన్ని పదునైన సూదులుగా చేస్తే 350 డాలర్లు అవుతుంది. చిన్న కత్తి బ్లేడులుగా చేస్తే 32,000 డాలర్ల విలువ చే...

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 296 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • ఆయన చేసిన శుభవాగ్దానములో ఒక మాటైన తప్పిపోయినది కాదు (1 రాజులు 8:56).

  జీవితపు భారమైన కదలికలో దేవుని నుండి వచ్చిన ప్రతి నిరాకరణ వెనుక ఏదో ఒక కారణం ఉన్నదని ఒకరోజున మనం తెలుసుకుంటాం. ఏదో విధంగా మన అవసరానికి తగినట్టుగా ఆయన సమకూరుస్తాడు. చాలాసార్లు మనుషులు తమ ప్రార్థనలకు జవాబు రాలేదని దిగులుపడ...

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 295 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను (నిర్గమ 3:1,2).

  ఎప్పటిలాగానే కాయకష్టం చేసుకునే వేళ దర్శనం వచ్చింది. ఇలాటి సమయాల్లోనే దర్శనమివ్వడం దేవుని...

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 294 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • భూమిమీద మన గుడారమైన యీ నీవాసము శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము (2 కొరింథీ 5:1).

  నేను చాలా సంవత్సరాలుగా అద్దెకు ఉన్న ఇంటి యజమాని ఇంటికి మరమ్మత్తులు ఇక సాధ్యం కావనీ, నేను ఇల్లు ఖాళీ చెయ్యవలసి ఉంటుందనీ చెప్పాడు.
  ...

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 293 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును (ఫిలిప్పి 4:7).

  సముద్ర ఉపరితలం అంతా తుపానులతో, కెరటాలతో అల్లకల్లోలమైపోతూ ఉంటే దానీ లోపలి పొరలు మాత్రం ఎప్పుడూ చెక్కుచెదరవు. సముద్రపు లోతుల్ని తోడి అక్కడ పేరుకున్న జంతువుల, మొక్కల అవశేషాలు ప...

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 292 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను (సంఖ్యా 10:33).

  దేవుడు మనకు కొన్ని అభిప్రాయాలను ఇస్తూ ఉంటాడు. అవి దేవుడు ఇచ్చినవే. అయితే వాటి గురించి అనుమానం లేకుండా వాటిని స్థిరపరచడంకోసం కొన్ని సూచనలను ఇస్తాడు.

  యిర్మీయా కథ ఎంత బాగుంటుంది! అనాతోతు పొలం కొనాలని అతనికి అభిప్రాయం కలిగిం...

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 291 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు... తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.
  (ఆది 15:13,14).

  దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాలలో ఆలస్యం, శ్రమలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అబ్రాహాము జీవితకాలమంతా ఆ ఆశీర్వాదం ఆలస్యం అయింది. దేవుని ప్రమాణం నిరర్...

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 290 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక; దానివలన నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడియున్నాము (గలతీ 6:14).

  వారు కేవలం తమ కొరకే జీవిస్తున్నారు. స్వార్థం వాళ్ళను చెరపట్టి ఉంది. అయితే వారి ప్రార్థనలను దేవుడు సఫలం చెయ్యడం మొదలు పెట్టాడు. తమకు ...

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 289 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి . . . మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము (హెబ్రీ 12:1,2).

  పాపాలు కాని భారాలు కొన్ని ఉంటాయి. కాని అవి క్రైస్తవ జీవితంలో పురోభివృద్ధికి అడ్డుబండలౌతూ ఉంటాయి. కృంగిన మనస్సు ఇలాంటి భారాల్లో ముఖ్యమైనది. బరువైన హృదయం మన పరిశుద...

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 288 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • వాళ్ళు పగలగొట్టబడడం వల్ల శుద్ధులౌతారు (యోబు 41:25 - స్వేచ్ఛానువాదం).

  పగిలిన వస్తువుల్ని, మనుషుల్ని దేవుడు తన సంకల్పసిద్దికి ఎక్కువగా వాడుకుంటూ ఉంటాడు. ఆయన స్వీకరించే బలులు ఏమిటంటే విరిగి నలిగిన హృదయాలే. పేనూయేలు దగ్గర యాకోబు మానవశక్తి అంతా విచ్ఛిన్నమైనందువల్లనే దేవుడు అతణ్ణి ఆత్మ వస్త్రా...

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 287 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను.దూత పేతురు ప్రక్కను తట్టి - త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతులనుండి ఊడిపడెను (అపొ.కా. 12:7).

  "అయితే మధ్య రాత్రివేళ పౌలును సీలయు దేవుని ప్రార్ధించుచు కీర్తనలు పాడుచు నుండిరి; ఖయిదీలు వినుచుండిరి. అప...

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 286 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • దేనినిగూర్చియు చింతపడకుడి (ఫిలిప్పీ 4:6).

  ఆందోళన అనేది విశ్వాసిలో కనిపించకూడదు. మన కష్టాలు, బాధలు అనేక రకాలుగా మనమీదకు రావచ్చు. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన ఉండకూడదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన తండ్రి మనకున్నాడు. తన ఏకైక కుమారుణ్ణి ప్రేమించినట్టే మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్ట...

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •  
 • Day 285 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
 • అతనిని పట్టుకొని.. చెరసాలలో వేయించెను.. యెహోవా యోసేపునకు తోడైయుండి . . .. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను (ఆదీ39: 20-23).

  మనం దేవుణ్ణి సేవించేటప్పుడు ఆయన మనలను చెరసాలకు పంపించి, మనతోబాటు ఆయన కూడా వస్తే ఆ చెరసాల అంత ధన్యకరమైన స్థలం మరొకటి లేదు. యోసేపుకు ఈ విషయం బాగా అర్ధమై...

 • Mrs. Charles Cowman - Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు
 •