ప్రోత్సాహం


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 5
  • Reference: Sajeeva Vahini - Daily Motivation

ప్రోత్సాహం

Audio: https://youtu.be/3JS8-i3AxD4

కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. 1 థెస్సలొనీకయులకు 5:11

మనం పని చేసే చోట ప్రోత్సాహకరమైన మాటలు చాల అవసరం. పనిచేసేవారు చురుకుగా పనిచేయాలనే ప్రతి కంపెనీలలో కూడా మానవ వనరుల శాఖను ఏర్పరచి ఇటువంటి ప్రోత్సాహకరమైన కార్యక్రమాలను జరిగిస్తూ ఉంటారు. కంపనీల లాభాలు కూడా సహపనివారిని ప్రశంసించడం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. అసమ్మతి లేదా అభిప్రాయబేధాలను, పని చేసే వారినుండి తొలగించేది, వారు చేసిన పనికి సరైన ప్రోత్సాహం దొరకకపోవడమే. ఇటువంటి నిర్వహణను గూర్చి ఏవిధంగా అమలు చేయాలో, కంపనీలను ఉన్నత స్థాయికి ఏవిధంగా తీసుకెళ్లాలో, నిపుణులైన యాజమాన్యం వారు, వారి వారి అనుభవాలను , వ్యూహాలను సరైనరీతులో నిర్వర్తించడంలో ఉంటుంది.

ఒక సంస్థను క్రమంగా నిర్వర్తించడంలోని అనుభవాలను, సరైన రీతిలో నిర్వహించినట్టు మన సంఘాల్లో కూడా అట్టి క్రమాన్ని అమలు చేసినప్పుడే అభివృద్ధిని చూడగలం. సంబంధాల ఫలితాల రూపకల్పనలో మాటల విలువను అపో.పోలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. దమస్కు మార్గంలో క్రీస్తును కలవకముందు, తన మాటలు, చేతలు... యేసు ప్రభువు అనుచరులను భయపెట్టేవిగా ఉన్నాయి. అయెతే థెస్సలోనికయులకు పత్రికను వ్రాసే సమయానికి, దేవుడు తన హృదయంలో చేసిన కార్యాన్ని బట్టి అతడొక గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చేవాడుగా తయారయ్యాడు. ఇప్పుడు, తన సొంత జీవితంలోని అనుభవాలనుండే ఒకరినొకరు ప్రోత్సాహించుకొండని వివరిస్తూ ఉన్నాడు.

ముఖస్తుతి చేయడం గూర్చి జాగ్రత్త పడుతూనే, అతడు ఇతరులు చేసిన దానిని గురించి క్రీస్తు ఆత్మను ఎలా ప్రతిబింబించాలో చూపించాడు. ఈ ప్రోత్సాహం అన్నది ఎక్కడి నుండి వస్తుందో ... ఆనాడు థెస్సలోనికయలోని వారికి, నేడు మనకును జ్ఞాపకము చేస్తున్నాడు. సంఘ నిర్వాహకులు తమ జతపనివారిని ప్రోత్సాహించినప్పుడే కదా ఐక్యతలో బలపడి, బలమైన సంఘంగా కట్టుకోగలుగుతారు.

మనకొరకు చనిపొయేటంతగా ప్రేమించిన దేవునికి మనలను మనము అప్పజేప్పుకోవడమన్నది, ఆదరించడానికి, క్షమించడానికి మరియు  స్ఫూర్తినివ్వడానికి యెకనినొకడు ఆదరించి, యెకనినొకడు క్షేమాభివృద్ది కలుగజేయడానికి సహాయపడుతుంది. నేనంటాను,  కష్టం ఎదురైన వాడికి ధైర్యం ఎంత అవసరమో, ప్రయత్నం చేసేవాడికి ప్రోత్సాహం కూడా అంతే అవసరం. ఒకరిలో ఒకరు అత్యుత్తమమైనదానిని బయటకి తీసికోనివచ్చులాగున పనిచేయ్యడముకంటే మించినది వీరే ఏముంటుంది? దేవుని ఓర్పు మరియు మంచితనాన్ని రుచి చూడడానికి దోహదపడగల ఒకే ఒక మార్గం ఒకరినొకరు ప్రోత్సాహించుకోవడమే. ఈ అనుభవాలు మన సంఘాలను సరిచేసికోనుటకు సహాయపడును గాక.  

చదవండి - 1 థెస్సలొనీకయులకు 5