బైబిలు త్రిత్వము గురించి ఏమి భోధిస్తుంది?


  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-Trinity-Bible.html

క్రైస్తవ అంశమైన త్రిత్వములో అతి కష్టమైనది దాన్ని సమగ్రవంతంగా వివరించలేకపోవటమే. “త్రిత్వము” అనే అంశం అర్థం చేసుకోడానికి చాల కష్టం. దేవుడు అపరిమితముగా ఉన్నతమైనవాడు గొప్పవాడు, కాబట్టి ఆయనను పరిపూర్ణముగా అవగాహన చేసుకోగలం అని అనికూడ అనుకోవద్దు. క్రీస్తు దేవుడని, తండ్రి దేవుడని పరిశుధ్దాత్ముడు దేవుడని బైబిలు భోధిస్తుంది. దేవుడు ఒక్కడే అనికూడా భోధిస్తుంది. త్రిత్వ దేవునిలో వ్యక్తులమధ్య సంభాందాన్నికి ఋజువులున్నప్పటికి మానవ మనస్సుకు అది గ్రహింపశక్యముకానిది. ఏదిఏమైనప్పటికి దీనిని బట్టి “త్రిత్వము” వాస్తవము కాదని, బైబిలు భోధనకాదని అనలేము.

ఒక్కదేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో వుండుటయే త్రిత్వము. దీని అర్థం ముగ్గురుదేవుళ్ళున్నారని ప్రతి పాదించటంకాదు. త్రిత్వము అన్న పదం లేఖనములో లేదన్న విషయము ఈ అంశం అధ్యయనం చేసేటప్పుడు మనస్సులోనుంచుకోవాలి. త్రియేకదేవుని వివరించటానికి ఉపయోగించినపదమిది. ముగ్గురు ఒకేసారి ఉనికిలో వున్నవారు. నిత్యులైన వ్యక్తులు దైవత్వమైయున్నారు. వాస్తవము ఏంటంటే త్రిత్వము అనే అంశానికి సంబంధించిన వివరాలు లేఖనాలలో వున్నాయి. త్రిత్వము గురించి బైబిలు భోధిస్తున్న కొన్ని విషయాలు.

1). దేవుడు అద్వితీయుడు- ఏకమై యున్నావాడు (ద్వితియోపదేశకాండం 6:4; 1 కొరింథి 8:4; గలతీయులకు 3:20; 1 తిమోతి 2:5).

2). త్రిత్వములో ముగ్గురు వ్యక్తులున్నారు (ఆదికాండము 1:1, 26; 3:22; 11:7; యెషయా 6:8, 48:16, 61:1; మత్తయి 3:16-17, 28:19; 2 కొరింథీయులకు 13:14). ఆదికాండము 1:1 లో ఎలోహీమ్ అన్న హీబ్రూ పదము దేవుడు బహుళ పదమునకు వుపయోగించింది. ఆదికాండము లో 1:26, 3:22, 11:7 మరియయెషయా లో 6:8, బహుళ సర్వ నామము మన వుపయోగించారు. ఎలోహీం సర్వ నామము, ఈ రెండు బహుళ పదాలు. ఇవి ఖచ్చితముగా భాషలో ఒకటికంటె ఎక్కువమందిని సూచిస్తుంది. ఈ వాదన త్రిత్వాన్నికి ఋజువు కాదు గాని దేవునిలోని బహుళత్వాన్ని మాత్రం ఖచ్చితంగా సూచిస్తుంది. దేవుడు హీబ్రులో ఎలోహీం, ఖచ్చితంగా త్రిత్వాన్నికి చోటిస్తుంది.

యెషయా 48: కుమారుడు తండ్రి గురించి, పరిశుధ్దాత్ముని గురించి మాట్లాడాడు. యెషయ 61: 1 వచనమును లూకా 4:14-19 ను పోల్చినట్లయితే కుమారుడే మాట్లాడినట్లు గనించగలము. యేసుక్రీస్తు బాప్తీస్మము గురించి వివరించే భాగం మత్తయి 3:16-17. ఈ భాగంలో కుమారుడైన దేవుని మీద పరిశుధ్దాత్ముడైన దేవుడు దిగరావటం, కుమారుడైన దేవునియందు తండ్రియైన ధేవుడు ఆనందిస్తున్నాడని చెప్పటం గమనించగలం. మత్తయి 28:11; 1 కొరింథీ 12:14 లో త్రిత్వములో ముగ్గురు వ్యక్తులున్నారనటానికి చక్కని ఉదాహరణ.

3). త్రిత్వములోని సభ్యులను వేరువేరుగా చూపించేటటువంటి వాక్యాభాగాలున్నాయి. పాతనిబంధనలో ప్రభువును యెహోవా కు వేరువేరుగా చూపించారు (ఆదికాండం 19:24; హోషేయా 1:4). ప్రభువు కుమారుని కనెను (కీర్తన 2:7, 12; సామెతలు 30:2-4). ఆత్మను యెహోవాను (సంఖ్యాకాండము 27:18) ప్రభువైన దేవుడ్ని (కీర్తన 51:10-12)వేరువేరుగా చూపించారు. తండ్రిదేవుడు, కుమారుడైన దేవుడు వేరువేరుగా నున్నది(కీర్తన 45:6-7; హెబ్రీయులకు 1:8-9). క్రొత్తనిబంధనలో తండ్రినుండి ఆదరణకర్తను, పరిశుధ్దాత్ముని పంపిస్తానని (యోహాను 14:16-17) యేసయ్య చెప్పాడు. దీనిని బట్టి యేసయ్య తాను తండ్రికాడని, పరిశుధ్దాత్ముడు కాడని స్పష్టంచేస్తున్నాడు. సువార్త పాఠ్యభాగలలో యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడిన సంధర్భాలన్ని గమనించాలి. యేసయ్య తనతో తానే మాట్లాడుకొంటున్నడా? లేదు. త్రిత్వములోని మరొక వ్యక్తియైన తండ్రితో మాట్లాడుతున్నాడా?

4). త్రిత్వములోనున్న ప్రతీ వ్యక్తి దేవుడు (యోహాను 6:27; రోమా 1:7; 1పేతురు 1:2). కుమారుడైన దేవుడు (యోహాను 1:1, 14; రోమా 9:5; కొలస్సీయులకు 2:9; హెబ్రీయులకు 1:8; 1 యోహాను 5:20). పరిశుధ్దాత్ముడైన దేవుడు (అపోస్తలుల కార్యములు 5:3-4; 1 కొరింథీయులకు 3:16).

5). త్రిత్వములో ఒకరిమీద మరొకరు ఆధారపడియుంటారు. లేఖనములు చూపించుచున్నట్లుగా పరిశుధ్ధాత్ముడు తండ్రికి, కుమారునికి మరియు కుమారుడు తండ్రికి విధేయులు. ఇది అంతర్గత సంభంధమే కాని త్రిత్వములో ఏ ఒక్క వ్యక్తికి దైవత్వమును లేదనకూడదు. పరిమిత మనస్సు కలిగిన మనము అనంతుడైన దేవునిని ఈ విషయములో అవగాహన చేసుకొనుట అసాధ్యము. కుమారుని విషయములో పరిశుధ్ధాత్ముని విషయములో ఈ లేఖన భాగాలలో లూకా 22:42, యోహాను 5:36, యోహాను 20:21, మరియు 1 యోహాను 4:14. పరిశుధ్ధాత్ముని గురించి యోహాను 14:16, 14:26, 15:26, 16:7, మరియు ప్రత్యేకముగా యోహాను 16:13-14 గమనించండి.

6). త్రిత్వములోని సభ్యులకు వేరువేరు భాధ్యతలున్నాయి. తండ్రి అంతిమ విశ్వాసమునకు అంతిమ కారకుడు, లేక ఆధారము((1 కొరింథీయులకు 8:6; ప్రకటన 4:11); దైవిక ప్రత్యక్షత (ప్రకటన 1:1); రక్షణ (యోహాను 3:16-17); మరియయేసుక్రీస్తు మానవ చర్యలు(యోహాను 5:17, 14:10). తండ్రి ఈ విషయములన్నిటిలో చొరవ తీసుకుంటాడు.

పరిశుధ్ధాత్ము తండ్రి ప్రతినిధిగా ఈ కార్యములను నిర్వర్తిస్తున్నాడు. విశ్వాన్ని సృష్టించడం, కొనసాగించటం (ఆదికాండము 1:2; యోబు 26:13; కీర్తన 104:30); దైవిక ప్రత్యక్షత (యోహాను 16:12-15; ఎఫెసీయులకు 3:5; 2 పేతురు 1:21); రక్షణ (యోహాను3:6; తీతుకు 3:5; 1 పేతురు 1:2); మరియయేసుక్రీస్తు క్రియలు(యెషయా 61:1; అపోస్తలుల కార్యములు 10:38). తండ్రి పరిశుధ్ధాత్ముని శక్తి ద్వారా ఈ కార్యములన్ని తలపెడ్తాడు.

త్రిత్వాన్ని అర్థం చేసుకోవటానికి పలువిధములైన ఉపమానములను ప్రయత్నించటమైనది. అయితే అందులో ఏ ఒక్కటి కూడా పరిపూర్ణముగా సరితూగేదికాదు. గుడ్డును ఉదాహరణ తీసుకోవటం సరిపోదు. ఎందుకంటె పసుపు, తెల్లసొన, డొల్ల, గుడ్డులోని భాగాలే గాని అవి పరిపూర్ణంగా గుడ్డు కాదు. ఏపిల్ కాయ కూడా అదే విధంగా సరియైన ఉదాహరణ కాదు. ఎందుకంటె తోలు, గుజ్జు, విత్తనము భాగాలేగాని కాయ కాదు కాబట్టి. తండ్రి కుమార పరిశుధ్ధాత్ములు దేవునిలోని భాగాలు కాదు. ప్రతి ఒక్కరూ దైవమై యున్నారు. నీటిని ఉదాహరణగా తీసుకోవటం కొంతవరకు సబబే గాని అది కూడా సమగ్రవంతంగా త్రిత్వాన్ని వివరించలేదు. ఎందుకంటె ద్రవ పదార్థములోనునున్న నీరు, ఘన పదార్థములోనునున్న ఐస్, వాయు పదార్థములోనునున్న ఆవిరి నీటి యొక్క రూపము మాత్రమే. కాబట్టి ఈ ఉపమానములు త్రిత్వము గురించి కొంత అవగాహన అనుగ్రహించినప్పటికి పరిపూర్ణంగా సమగ్రమైనవి కాదు. అనంతమైన దేవున్ని, పరిథిలు కలిగిన ఏ ఉపమానము కూడా వివరించలేదు.

బైబిలు సిధ్ధాంతమైన త్రిత్వము క్రైస్తవ సంఘ చరిత్ర అంతట విభేధాలుకు కారణమైనదే. దేవుని వాక్యములో త్రిత్వము గురించి కేంద్రిత అంశములు స్పష్టముగా కనపరచబడినప్పటికి, కొన్ని విషయాలు అంత ప్రస్పుటముగా వివరించలేదు. తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు, మరియు పరిశుధ్ధాత్ముడైన దేవుడు, కాని దేవుడు ఒక్కడే. ఇదే బైబిలు సిధ్ధాంతమైన త్రిత్వము. దీనికి మించి ఇతర విషయాలు ప్రశ్నార్థకమైనవి. అంతా ప్రాముఖ్యమైనవి కూడా కాదు. పరిమిత మానవమనస్సులతో త్రిత్వాన్ని పరిపూర్ణంగా వివరించటానికి ప్రయత్నించుటకు బదులు దేవుని గొప్ప లక్షాణాలు అనంతమైన మరియు ఉన్నతమైన స్వభావాన్ని కేంద్రీకరిస్తూ ఆయనకు పరిచర్యచేయాలి ఆహా, దేవుని బుద్ది ఙ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగినవాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడెవడు? (రోమా11:33-34).

rigevidon reddit rigevidon tabletki rigevidon quantity