యేసు శుక్రవారమున సిలువవేయబడినారా?


  • Author: Christian Tracts
  • Category: Articles
  • Reference: http://www.gotquestions.org/Telugu/Telugu-three-days.html

యేసయ్య ఏ రోజున సిలువవేశారు అనేది బైబిలు స్పష్టముగా ప్రస్తావించుటలేదు. అతి ఎక్కువగా ప్రాతినిధ్యం వహించిన రెండు దృక్పధాలు. ఒకటి శుక్రవారమని మరొకటి బుధవారమని. మరికొంతమంది ఈ రెండింటిని శుక్ర, బుధవారమును సమ్మేళనము చేసి మరొకరు గురువారమని కూడా ఆలోచించటం జరుగుతుంది.

మత్తయి 12:40 యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో వుండును అని యేసు చెప్పెను. శుక్రవారము సిలువవేయబడ్డాడు అని వాదించేవారు ఆయన మూడు దినములు సమాధిలో నుండటం సబబని, సాధ్యమని నమ్ముతారు. మొదటి శతాబ్ధపు యూదామనస్సునకు ఒక దినములోని భాగమును కూడా పూర్తి దినంగా లెక్కిస్తారు. యేసు సమాధిలో శుక్రవారమున కొంతభాగము, పూర్తి శనివారము, ఆదివారమున కొంతభాగము నున్నారు. కాబాట్టి మూడు దినాలు సమాధిలోనున్నట్లు గుర్తించవచ్చు. యేసుక్రీస్తు శుక్రవారమే సిలువవేయబడ్డాడు అన్న వాదనకు ప్రాముఖ్యమైన ఆధారమే మార్కు 15:42 విశ్రాంతిదినమునకు పూర్వదినము. అది సాధారణమైనటువంటి విశ్రాంతిదినము సబ్బాతు అయినయెడల శనివారమై యుండాలి. అప్పుడు సిలువవేయటం అనేది శుక్రవారమే జరిగియుండాలి. శుక్రవారమే అని విచారించేవారు మత్తయి 16:21 మరియలూకా 9:22 భోధిస్తున్నట్లుగా యేసు తాను మూడవదినమున తిరిగిలేస్తాననాడు. కాబట్టి మూడు పూర్తి పగలు, రాత్రులు సమాధిలో నుండాల్సిన అవసరంలేదు. అయితే మరికొన్ని అనువాదములు మూడవదినమున అని ఈ వచనాలకు వాడినప్పటికి అందరు సబబు అని అంగీకరించరు. మరియమార్కు 8:31 లో క్రీస్తు మూడు దినాల తర్వాత లేపబడును అని వున్నది.

గురువారము అని వాదించేటటువంటివారు క్రీస్తు సమాధి చేయబడటానికి ఆదివారము తెల్లవారు ఝామున మధ్యన అనేక సంఘటనలు వున్నాయి(కొంతమంది 20 అని లెక్కపెడతారు). కాబట్టి అది శుక్రవారము కాకపోవచ్చని అంటారు. మరొక సమస్య ఏమనగా శుక్రవారమునకు, ఆదివారమునకు మధ్యన పూర్తి దినము శనివారము అనగా యూదుల సబ్బాతు అవ్వటం. కాబట్టి వేరు ఒకటిగాని, రెండుగాని పూర్తిదినాలుండినయెడల ఈ సమస్తాన్ని తుడిచి పెట్టొచ్చు. గురువారం అని వాదించేవారు ఈ హేతువును చూపిస్తారు.- ఒక స్నేహితుడ్ని శుక్రవారం సాయత్రంనుండి చూడనట్లయితే ఆ వ్యక్తిని గురువారం ఉదయం చూచినట్లయితే గత మూడు రోజులుగా నిన్ను చూడటంలేదు అని అనడం సబబే. కాని అది కేవలం 60 గంటలు మాత్రమే (2.5దినాలు). ఒకవేళ గురువారం సిలువవేయబడినట్లయితే మూడు రోజులు అనటానికి ఈ ఉదాహరణ వుపయోగిస్తారు.

బుధవారం అని అభిప్రాయపడేవాళ్ళు ఆ వారంలో రెండు సబ్బాతులున్నాయని పేర్కోంటారు. మొదటి సబ్బాతు తర్వాత (సిలువ వేసిన సాయంత్రంనుండి ఆరంభమైంది[మార్కు 15:42; లూకా 23:52-54]), స్త్రీలు సుగంధ ద్రవ్యములు కొన్నారు. - వారు సబ్బాతు తర్వాత ఆ పనిచేసారని గుర్తించుకోవాలి (మార్కు 16:1). బుధవారమని అభిప్రాయపడేవారు ఈ సబ్బాతుని పస్కాదినము అని అంటారు(లేవికాండం 16:29-31, 23:24-32, 39 ప్రకారము అతి పవిత్రమైనటువంటి దినము వారములో ఏడవదినం అవ్వాల్సిన అవసరంలేదు). ఆ వారంలో రెండో సబ్బాతు ఏడవదినమున వచ్చింది. లూకా 23:56 లో పేర్కోన్నట్లు స్త్రీలు మొదటి సబ్బాతు తర్వాత సుగంధద్రవ్యములు కొన్నారు. అవి సిధ్దంచేసిన తర్వాత సబ్బాతు దినమున విశ్రమించారు. సబ్బాతు తర్వాత సుగంధద్రవ్యములుకొని, సబ్బాతు తర్వాత అది సిద్డపరచటం అనేది రెండు సబ్బాతులు లేకపోతే సాధ్యమయ్యేది కాదు అనేదే వాదన. రెండు సబ్బాతులున్నావని అనే దృక్పధములో క్రీస్తు గురువారం సిలువవేయబడినట్లయితే (అనగా పవిత్రమైన సబ్బాతు దినమున (పస్కా) గురువారం సాయంత్రం ఆరంభమయ్యి శుక్రవారం సాయత్రంతో అంతమయి ఉండేది. శుక్రవారం సాయంత్రం వారాంతర సబ్బాతు ఆరంభమవుతుంది. మొదటి సబ్బాతు తర్వాత(పస్కా) స్త్రీలును ద్రవ్యములుకొనినట్లయితే అదే శనివారం సబ్బాతుని అయితే అ సబ్బాతు దినాన్ని వారు ఉల్లఘించారు.

కాబట్టి బుధవారమే సిలువవేయబడ్డాడు అనే వివరణ యిచ్చేవారు ఒకేఒక ఉల్లఘించని బైబిలు వచనము స్త్రీలును సుగంధ ద్రవ్యములు తీసుకు రావటం మత్తయి 12:40 ని యధాతధంగా తీసుకోవటం. ఆ సబ్బాతు అతి పవిత్రమైన దినము అనగా గురువారము మరియు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు కొనటానికి శుక్రవారము వెళ్ళి తిరిగి వచ్చి అదేదినాన్న సిద్దపరచి శనివారం అనగా యధావిధంగావుండే సబ్బాతు దినాన్ని విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత ఆదివారం సుగంధ ద్రవ్యాలు సమాధి దగ్గరకు తీసుకు వచ్చారు. యేసయ్యా బుధవారం సూర్యస్తసమయంలో సమాధి చేయబడ్డారు. అనగా యూదాకాలమాన ప్రకారం గురువారం ఆరంభమైంది. యూదాకాలమానాన్ని తీసుకున్నట్లయితే మూడు పగలు మూడు రాత్రులు, గురువారం రాత్రి (మొదటి రాత్రి), గురువారం పగలు (మొదటి పగలు), శుక్రవారం రాత్రి(రెండవ రాత్రి) శుక్రవారం పగలు (రెండవ పగలు), మరియు శనివారం రాత్రి (మూడవ రాత్రి) శనివారం పగలు (మూడవ పగలు) అని గుర్తించగలం. ఆయన ఎప్పుడు తిరిగి లేచాడో తెలియదు కాని ఆదివారం సూర్యోదయానికి ముందు అని మాత్రం ఖచ్చితముగా చెప్పగలం ( యోహాను 20:1 ఇంకా చీకటి ఉండగనే మగ్ధలేనే మరియ వచ్చెను).కాబట్టి శనివారం సూర్యాస్తసమయం తర్వాత యూదుల వారానికి తొలి దినాన్నా ఆయన లేచియుండాలి.

లూకా 24:13 బుధవారం అని వాదించేవారు ఒక విషయములో సమస్యను ఎదుర్కొంటారు. అదేమనగా ఎమ్మాయి గ్రామము గుండా అయనతో నడచినటువంటి శిష్యులు ఆయన పునరుత్ధానమైన అదేదిన్నాన్న జరిగియుండాలి. యేసయ్యను గుర్తుపట్టనటువంటి శిష్యులు యేసయ్య సిలువ గురుంచి చెప్పారు (లూకా 24:21). ఆ సంధర్భములో ( లూకా 24:21)ఇదిగాక ఈసంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను. అయితే బుధవారం నుండి ఆదివారంవరకు నాలుగు దినములు. దీనికి ఇవ్వగలిగేటటువంటి ఒక భాష్యం ఏదనగా బహుశావారు బుధవారం సాయత్రం క్రీస్తు సమాధి చేయబడ్డాడని అంటే యూదుల ప్రకారము గురువారము అంటే గురువారంనుండి ఆదివారంవారానికి మూడు దినాలు.

ఈ మహా ప్రణాళికలో క్రీస్తు ఏ దినమున సిలువ వేయబడ్డాడు అనేది అంతా ప్రాముఖ్యముకాదు. ఒకవేళ అదే ప్రాముఖ్యమైనట్లయితే దేవుని వాక్యములో వారము, దినము బహుస్పష్టముగా వివరించబడియుండేది. ఆయన మరణించి భౌతికంగా మృతులలో నుండి తిరిగి లేచాడనేది అతి ప్రాముఖ్యము.దీనితో సమానమైనటువంటి ప్రాధాన్యతకలిగింది. ఆ ప్రక్రియ కారణము- పాపుల శిక్షను ఆయన మరణముద్వారా తనమీద వేసుకున్నాడు, యోహాను 3:16 మరియు 3:36 ప్రకారము ఎవరైతే ఆయనయందు విశ్వాసముంచుతారో వారు నిత్య జీవము కలిగియుంటారు. బుధవారమా, గురువారమా లేక శుక్రవారమా ఆయన మరణించిన దీనికి సమానమైనటువంటి ప్రాధాన్యత వుంది.