సాన్నిహిత్యముతో కూడిన తలంపులు


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

సాన్నిహిత్యముతో కూడిన తలంపులు :

కీర్తనలు 16:11 - నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు".

మనమందరము ఆనందం మాసములోకి ప్రవేశించిన సందర్భంగా ఒకసారి మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో సరిచూసుకుందాము.   దేవునితో మనకున్న సాన్నిహిత్యాన్ని పునరుద్ధరించుకోవలసిన సమయమిదే.  అపవాది మనం దేవునితో కలిగియున్న సన్నిధిని ఏదోవిధంగా నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.  ఆయన తనతో మనకున్న సన్నిధిని సురక్షితంగా, సుస్థిరంగా ఉండి

బలపరచడానికి ప్రణాళికను కలిగియున్నాడు.  ఆయన సన్నిధిలో జీవమున్నది, మార్గమున్నది, సంపూర్ణ సంతోషము ఉన్నది.  ఆయన హృదయద్వారమునొద్ద నిలుచుని మనలను పిలుచుచున్నాడు.  మనం ఆయనను ఆహ్వానిస్తే మనకు ఆ సంపూర్ణ సంతోషము దొరుకుతుంది.  గనుక ఈ ఆనందమాసములో నిన్ను నువ్వు సరిచేసుకొని సిద్ధపడుము.

ప్రార్థనా మనవి:

పరలోక తండ్రి!!! నీ అద్వితీయ కుమారుని నా రక్షణకొరకు పంపినందుకు నీకు వందనములు.  ఈ ఆనందమా సొమ్ములో నన్ను నేను సరిచేసుకొని నిత్యం నీతో సన్నిధిని కలిగియుండుటకు సహాయం చేయుమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.


Intimate Thoughts:  

Psalms 16:11 - “ In Your presence is fullness of joy.” As we enter into Christmas season and festivities begin, it's time to check how is your spiritual life. It is the time to restore intimacy with God back into your life. The enemy's plan is to kill, steal, and destroy intimacy in all relationships, beginning with the most important one: your relationship with God. It is God's plan to restore intimacy with you, making you strong, steady, secure, and sure. His pathway of intimacy is life-breathing, life-giving. In His presence, you will be filled to the fullness of joy, and all provisions needed for your intimacy journey will be provided. Invite Jesus daily into all your relationships and situations. His presence will give you peace, joy, hope, and so much more. Christmas is not about Santa, trees and gifts but whether Jesus , the author of Christmas lives within you. This Season take time to correct yourself.

Talk to The King:   Father, thank You for sending Your only Son for my sake. Help me be intimate with You and spend time in Your presence as I find the meaning of real Christmas. In Jesus name, Amen.