ప్రేమకలిగిన తలంపులు

  • Author: Unleashed for Christ
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

ప్రేమకలిగిన తలంపులు :

హెబ్రీయులకు 10:17 - "వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకము చేసికొనను.

ఇది చాలా బలమైన వాక్యము.  దేవుడు నిజముగా మన పాపములను మరచిపోతాడా? కాదు.  కానీ ఆయన వాటిని జ్ఞాపకం చేసికొనను అని అంటున్నాడు.   ఆయన మనపై కలిగిన ప్రేమవలన మనలను శిక్షించుటకు ఇష్టపడక మనయందు ఎడతెగని వాత్సల్యమును చూపువాడైయున్నాడు.  ఆయన ప్రేమ మన దోషములను తుడిచివేయుచున్నది.  పాపము చేసి మనమాయనను గాయపరచినా ఆయన మనయందు కృప చూపుచున్నాడు.  దీనిని బట్టి దేవుడు మనలను నిస్వార్థంగా ప్రేమించుచున్నాడో ఈ వాక్యము వివరించుచున్నది.  గనుక ఆ ప్రేమను బట్టి ఆయనను ఆరాధించి కొనియాడెదము.

ప్రార్థనా మనవి:

ప్రియమైన తండ్రి!!! నన్ను ప్రేమించిన రీతిని బట్టి నీకు వందనములు.   నేనెన్ని పాపములు చేసినా వాటిని క్షమించి నాయందు దయ చూపుచున్న దేవా... ఆ నీ కృపను పొందు యోగ్యతను దయచేయుమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.


Loving Thoughts:  

Hebrews 10:17 -  “Their sins and their lawless deeds I will remember no more.” That is a very strong verse. Somewhere re-reading the verse may make us feel that God is forgetful but is He?? NO!! God, who says he will remember our sins no more is not some forgetful old man who accidentally misplaced them. NO!! God simply chooses not to hold our sins against us in any way.  His love covers all our sons and Hence He deliberately erases them out of His Love. He lovingly forgets all the times we have hurt Him immensely with our sins and hugs us close when we repent and go back to Him. That is the size of God's love. Though the verse entirely speaks of sin, it is implying God's selfless Love. Worship His love today and share His love to others.

Talk to The King:   

Father, thank you for the love You have loved me with. Thank You for never remembering what I did but showing me Your love. Thank you for Your forgiveness and love. In Jesus name, Amen.