పునరుద్ధరించు తలంపులు

  • Author: Unleashed for Christ
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

పునరుద్ధరించు తలంపులు :

కీర్తనలు 23:3 - "నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు".

మనము కలిగియున్న శ్రమలకు మనకున్న కోరికలే కారణం.  నష్టాలు మనకు చాలా విధాలుగా కలుగవచ్చు. మరణం, విడాకులు మొదలైనవి.  ఉద్యోగాన్ని కోల్పోవడం, పదోన్నతిని కోల్పోవడం, అనారోగ్యం, నమ్మకాన్ని కోల్పోవడం, కోరికలు నెరవేరకపోవడం ఇలా చాలా రకాలుగా నష్టాలు మనకు ఎదురవచ్చు.   కోపం, క్రోధము, చింత మొదలైనవాటిని అధిగమిస్తేనే మనము సంతోషముగా ఉండగలము.  దేవుని మాటలే మనలను స్వస్థపరుస్తాయి.  దేవుడు మనయెడల కరుణను, కృపను చూపి మన ఆత్మకు సేదదీర్చి నిన్ను తన దక్షిణ హస్తముతో పైకి లేవనెత్తుతానని వాగ్దానము చేయుచున్నాడు. అవగాహన చేసుకోవడానికి కష్టమైనప్పటికీ ఆయన కష్టాలను తీర్చి ఆనందాన్ని కలుగజేస్తాడు. ఆయన నీ అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు.  నిన్ను ఎన్నడూ ఎడబాయని దేవుడు.

ప్రార్థనా మనవి:

ప్రియమైన తండ్రి!!! నన్నెన్నడూ ఒంటరితనంలో చేయి విడువని దేవా నీకు స్తోత్రము.  నా ఆత్మకు సేదదీర్చుచున్నందుకు నీకు వందనములు. నా ప్రతీ పరిస్థితిలో నీయందు ఓదార్పును పొందుటకు నాకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమేన్.


Restoring Thoughts:  

Psalms 23:3 -   “He restores my soul.” Grief comes into all of our lives, but is often not acknowledged because our daily lives are driven by so many demands. Losses come in many different ways; some you know well like death and divorce. But there are other losses: loss of jobs, promotions, health, childhood, trust, friendships; as well as singleness, being childless, unfulfilled desires, and so many others. Often, letting go of regret, anger, and guilt-filled thoughts and/or images is necessary so that you might hold on to joyful memories and God's healing words of hope to you. God promises to show mercy and comfort, restore your soul, strengthen, help, and hold you up with His strong, loving right arm of grace. As difficult as it might be to comprehend, God says He will bring joy alongside your sadness. This is needed so that sadness does not overtake you in your deep loss. God will not leave you on your own or alone in your loss. Remember, there is no formula or timetable.

Talk to The King:   

Father, thank you for never leaving my arm even in loneliness. Thank you for restoring my soul. Help me find comfort in you in every situation. In Jesus name, Amen.