మీ దీపములు వెలుగుచుండనియ్యుడి లూకా 12 :35

  • Author: Bro. Samuel Kamal Kumar
  • Category: Messages
  • Reference: Jesus Coming Soon Ministries

 క్రీస్తునందు ప్రియా పాఠకులారా   క్యాండీల్ లైటింగ్ సర్వీస్ను ఈనాడు అనేక సంఘంలో క్రిస్మస్ ముందు జరిపించుకుంటారు. ఈ కూడికలో తెల్లని బట్టలు ధరించి ఓ సద్భక్తులారా అని పాట పాడుతూ సంఘ కాపరి వెలిగించి పెద్దలకు ఆ తర్వాత సంఘం లో ఉండే వారందరితో   క్రొవొత్తులు వెలిగించి సంతోషముగా ఆనందంగా చూపరులకు ఎంతో కాంతివంతంగా కనబడే ఈ క్రొవొత్తులను చూస్తాము. తిరిగి ఇంటికి వెళ్లిపోయాక ఇవి ఆరిపోతాయి. ఆ తర్వాత ఈ క్రొవోత్తి ఇంట్లో ఎక్కడో ఒక మూల పడిఉంటుంది. ఆకస్మికంగా ఎప్పుడైనా కరెంటు పోతే ఎంత వెదకినా  అది దొరకదు. మరలా ఎప్పుడో కరెంటు ఉన్నప్పుడే దొరుకుతుంది. ఎంత ఘోరమైన దుస్థితి ఈ క్యాండిల్ ది. ఇది ప్రకృతి పరమైన వెలుగునిచ్చేది.
       
దేవుని బిడ్డలారా! దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగైనట్లు చూడగలుగుతాము. ఆ వెలుగే క్రీస్తు ప్రభువుగా యోహాను సువార్త 1: 9 లో చూడగలుగుతాము. నిజమైన వెలుగు ఉండెను అనగా నిజముకాని వెలుగు కూడా ఉంది  అని అర్థం.అది ప్రకృతి సంబంధమైనది మరియు అపవాదికి చెందినది. అందుకే పౌలు అంటాడు ఇది ఆశ్చర్యం కాదు, వెలుగు దూత  వేషం వేసుకుని సైతాను అని 2 కొరంథీ11: 14 లో చూస్తాము. ఈ లోకంలో ఉండే అనేక రకములైన వెలుగులు మనకు కనిపిస్తూఉంటాయి. అవన్నీ అపవాదికి చెందినవి గనుక మనము జాగరూకులై ఉండాలి. ముఖ్య అంశం లోని కి వెళ్దాము. యేసు ఈ లోకమునకు వెలుగు గావచ్చెను. ఎంత దీవెనకరం. ఎన్ని రకాల అస్థిరమైన, కృత్రిమమైన వెలుగులు ఉన్న స్థిరమైన వెలుగుగా అందరిలో నిజమైన వెలుగును నింపిన దేవుడు మన ప్రభువు.

యేసు రాక ముఖ్య ఉద్దేశము:
            లోకం చీకటితో నింపబడి ఉంది మనుషులలో పాపము, అవినీతి, అక్రమం, నైతిక విలువలను కోల్పోయి ప్రవర్తించడం మనం చూస్తున్నాం. దీనివల్ల మరింత చీకటితో కఠిన గాడాంధకారంలో నింపబడి ఉంది. ఇలాంటి చీకటిని పారద్రోలడానికి యేసు అరుదెంచాడు. ప్రియ చదువరీ! నీలో ఉండే చీకటిని   తొలగించావా? లేక ఇంకా పాపం అనే గాడాంధకారంతో నింపబడ్డావా? ఒక్కసారి ఆలోచించు. పండుగ సంబరంగా జరగాలంటే మొదట నీలోని చీకటి పారద్రోలబడాలి. యేసు ఈ లోకంలో వెలుగుగా ఉద్భవించి చీకటి తో నింపబడిన మన జీవితంలో  వెలుగును నింపడానికి మనలను ఆదరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు పంపబడ్డాడు. కనుక ఎవరైతే ఆయన రక్తం చేత కడుగబడ్డారో వారందరూ ఆయన ఆత్మచేత నింపబడిన వారు. ఎంత ధన్యకరం. ఎంత గొప్ప ఆధిక్యత !దేవుని ఆత్మను కలిగిన మనమంతా ఆ ఆత్మ మనలో నిరంతరం ఉండుట మాత్రమే గాక ఆ దీపం ఆరిపోకుండా చూచుకోవాలి. అందుకే వైద్యుడైన లూకాఅన్న మాటలు జాగ్రత్తగా ఆలోచిద్దాం. మీ దీపంలు అని ప్రస్తావించాడు. దాని యెక్క అర్థం దేవుడు మనలో ఉన్న ఆత్మ ఎప్పుడు వెలుగుతూ ఉండాలని కోరీయున్నాడు.  మనలో ఉండే దేవుని ఆత్మ  వెలుగుతూ ఉండాలంటే నీవు వెలిగించే క్రోవొత్తి కంటే కూడా ప్రార్థన, వాక్యము, పరిశుద్ధత నిత్యము కలిగి ఉంటే నీలో ఉండే ఆత్మ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అయితే ఈ నాడు మనం మనలో దేవుడు పెట్టిన ఆత్మ కంటే కూడా మన శరీరాన్ని ఎక్కువగా ప్రేమిస్తాం. యోహాను 6 :57 లో భక్తుడు ఇలా అంటాడు. శరీరము నిష్ప్రయోజనం అనగా అది ప్రయోజనం లేనిది పనికిరానిది. మరి ప్రయోజనం అయినది ఏది? అని ఆలోచిస్తే ఆత్మ అది ఎల్లప్పుడూ నివసించేది. ప్రియ చదువరీ ! నీ శరీరమును ప్రేమిస్తే అది నిన్ను పరిశుద్ధునిగా తీర్చిదిద్దాదు, పరలోకంలో అడుగు పెట్టనివ్వదు. గనుక మనము స్వవిమర్శ చేసుకొని దేవుడు మనలో పెట్టిన ఆత్మ ఎప్పుడు వెలుగుతూ ఉండాలని కోరుతున్నాడు. కావున నీ ఇంటిలో  నీ కుటుంబమంతా నిరంతరము వెలగాలని ఆయన ఆశయైయున్నది. ప్రకృతి సంబంధమైన వెలుగు ఎప్పుడో ఒకసారి ఆరిపోతుంది. కావున నీవు సిద్ధపడి క్యాండిల్ వెలిగించి రోజున  క్యాండిల్ లైటింగ్ సర్వీస్ జరిపించు రోజున నీవు మొదట వెలిగించబడాలి. మరి సిద్ధపడ్డావా? సిద్ధంగా లేనట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము మార్పు చెంది వెలిగించబడు. మత్తయి 5 :16 ప్రకారం మనం జీవించాలి మరి నీ స్థితి ఏ విధంగా ఉంది? ఈరోజే నిర్ణయించుకో.  తీర్మానించుకొ  ప్రభువు రాకడ సమీపంగా ఉన్నది గనుక మీ వెలుగు నిరంతరము ప్రకాశింపనియ్యుడి.

దేవుడు మిమ్మును దీవించి  ఆశీర్వదించునుగాక!!


© సజీవ వాహిని - Sajeeva Vahini 2009-2019. info@sajeevavahini.com

Sajeeva Vahini

,

Chennai

Tamilnadu

600091 India
+91-8867-8888-99

Note: Please email any information for any suspected content/audio subject to piracy/copyright act on this website can be considered. Which can help us to improve better.