విశ్వాస సహితమైన తలంపులు


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

విశ్వాస సహితమైన తలంపులు :

రోమా 10:17 - "కాగా వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తునుగూర్చిన మాటవలన కలుగును".

కిందకి పడిపోవుచున్న ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నందుకు మనము నిరాశను, వేదనలను, అనుమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవునియందలి విశ్వాసము వలననే మనకు వాటినుంచి ఉపశమనం కలుగుతుంది. దేవుని వాక్యమును ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకోగలిగినప్పుడే మనము దృఢముగా అవ్వగలము. దేవుని యెడల మనము కలిగియున్న గురిని చెదరగొట్టేందుకు ఏదోక శోధన మనకు ఎదురవుతుంది. దేవుని వాక్యమును శ్రద్ధతో విని ధ్యానించినప్పుడు మనకు విశ్వాసము కలుగుతుంది. గనుక ఆయన సన్నిధిలో సమయము గడుపుటను మరువవద్దు.

ప్రార్థనా మనవి:

పరలోక తండ్రి!! నా హృదయమును నీవైపు నడిపించుము. నేను శ్రమలలో ఉన్నప్పుడు నీ వాక్యముతో నన్ను బలపరిచి నన్ను పైకి లేవనెత్తుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.

Faithful Thoughts: Romans 10:17 - “So then faith comes by hearing, and hearing by the word of God.” Because we live in this fallen world, we will experience discouragement, struggles, and doubt. Our comfort and healing come from knowing the God of the Bible. When we know and understand God’s Word and His great love for us, we will be strengthened. There are always ‘noises’ around us competing for our time and attention. Our faith is only increased when we hear the hope and power in the Word of God. So never fail to spend time in the presence of God with His Word.

Talk to The King: Father God, move my heart to seek You and Your Word as my sole source of strength. When I am discouraged, doubtful, and troubled, direct me to Your Word so that I may be lifted.  Lord, remind me that my comfort and healing begin with You.  In Jesus’ name. Amen.