Day 80 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక (మత్తయి 9:29)

ప్రార్థనలో పరిపక్వం కావడం అంటే పరిపూర్ణమైన విశ్వాసంలో పాదం మోపేంత వరకు సాగిపోవడమే. ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే మన ప్రార్థన దేవుని చేరింది, అంగీకరించబడింది అన్న అభయాన్ని పొందాలి. మనం ప్రార్ధిస్తున్నది మనకు అనుగ్రహింపబడే సమయం ఇంకా రాకముందే దానిని పొంది కృతకృత్యుల మైనట్టు భావన కలగాలి. అడిగినదానిని నిస్సందేహంగా పొందామన్న గట్టి నమ్మిక స్థిరపడాలి.

ఈ ప్రపంచం అనిశ్చితమూ చంచలమూ అయినది. దైవ వాక్కుకి అయితే మార్పు లేదు. నిలకడగా ఆయన మాటల మీద మనము దృష్టి నిలిపితే అని మనపట్ల నిజం కావడానికి ప్రపంచంలోని ఏ శక్తీ అడ్డుపడలేదు. దీన్ని మనసులో పెట్టుకుందాం. ఏ ఇతరమైన సాక్ష్యాధారాలు లేకుండానే ఆయన మాటలు నమ్మడానికి మనల్ని ప్రేరేపిస్తాడు దేవుడు. ఆ తరువాతే మన నమ్మిక చొప్పున మనకు ఇస్తాడు.

ఈ వరం ఇచ్చానంటూ
వచ్చిందాయన అమోఘ వాక్కు (హెబ్రీ 13:5)
మాటకి నిలిచే మా మంచి దేవుడు
ఇచ్చాడు మాట చొప్పున నాకు (2 కొరింథీ 1:20)

పెంతెకోస్తు కాలంలో ప్రార్థన బ్యాంకు చెక్కు లాంటిది. దాన్ని బ్యాంకులో ఇచ్చి దర్జాగా డబ్బు తీసుకోవచ్చు.

"దేవుడు ...... పలుకగా ఆ ప్రకారమాయెను" (ఆది 1:9).