వరమంటి తలంపులు - Gifted Thoughts

  • Author: Unleashed for Christ
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

వరమంటి తలంపులు:
రోమా 12:6-7 - "మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వేర్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక... పని జరిగింపవలెను".
తమ వివేకమును, సమయమును మన కొఱకు వినియోగించు మనుష్యులు మనకు అవసరము. ముఖ్యంగా మన ఆత్మీయజీవితానికి ఎంతో అవసరం. దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి అలాగే తోటివారిని విశ్వాసులను బలపరచడానికి కొన్ని ఆత్మీయ వరములను మనకు అనుగ్రహించాడు. ఆ వరములేంటో తెలుసుకోవలసిన అవసరం మనకు ఉంది. దేవుడు కొంతమందికి బోధించు వరమును, కొందరికి ప్రవచించు వరమును, కొందరికి దర్శనం వరమును, కొందరికి పాటలతో స్తుతించే వరమును అనుగ్రహించాడు. వాటినన్నిటినీ ప్రభువు యొక్క మహిమార్థమై ఉపయోగించాలి. దేవుని మనలను ఒక కార్యము కొఱకు ఎంచుకొన్నప్పుడు మనము ఘనముగా చేయాలి. మనము ఒకరు కలిగిన వరములను బట్టి అతిశయపడక మనము కలిగియున్న వరములను బట్టి ఆయనను స్తుతించి మహిమపరిచుదాం.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి! నీవు నాకు అనుగ్రహించిన వరములను బట్టి నీకు వందనములు. ఇతరులు కలిగియున్న వరములను బట్టి అసూయపడక మేము కలిగియున్న వాటితో నిన్ను మహిమపరిచేందుకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

Gifted Thoughts:
Romans 12:6 - “Having then gifts differing according to the grace that is given to us, let us use them.” We all need people in our lives who will invest their wisdom and time to help us. In fact, as we learn from other spiritual mentors, God equips us to use our gifts and talents to disciple others. First of all, you have to know what your gifts are. Not all of us are called to lead, teach or pastor. All gifts work together for the body of Christ. We can become the greatest cheerleaders for others when we honor their gifts. Some of you may have the gifts of leadership, administration and wisdom, while others have gifts of pastoring, teaching and evangelizing. We should always do our best in what God calls us to do. It is important that we do not ever let our hearts become bitter or jealous toward another’s calling or gifting.
Talk to The King: Father God, I thank You for the gifts You have filled me with. Help me use them for Your glory alone. Let me never be jealous of other""s gifts. In Jesus name, I pray, Amen.