శక్తినిచ్చే తలంపులు - Empowering Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

శక్తినిచ్చే తలంపులు:
ఎఫెసీయులకు 5:14 - "నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించును".

దేవుడు నిన్ను ఒక కార్యము కొఱకు పిలిచినప్పుడు నిన్ను ఎవరో అడ్డగించి భయపెడుతున్నారని అనిపించిందా? దేవుడు నిన్ను మేల్కొలిపి నీ ఆత్మను ఉత్తేజపరచాలని ఆశపడుచున్నాడు. దేవుని కృపవలనే నీవు నీ శక్తికి మించి కార్యములు చేయగలుగుతున్నావు. నీవు ఒక అసాధారణమైన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుకొనుచున్నాడు. అందుకొఱకు నీవు నీయందు ఉన్న పరిశుద్ధాత్ముని ప్రేరేపణను గ్రహించాలి. నీ చుట్టూ నీవు ఏర్పరచుకున్న భయాలను విడిచి భయపడకుండా దేవుడు నిన్ను నడిపిస్తున్న వైపు నీ అడుగులేయుము. ఆయన నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయనుద్దేశించియున్నాడు. అందుకోసం సిద్ధంగా ఉండుము.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!! నా యెడల నీకున్న తలంపులు బహు విస్తారములు గనుక నీకు స్తోత్రములు. మత్తుడనైయున్న నన్ను నీ వాక్యము చేత మేల్కొలిపి నీ చిత్తమును నెరవేర్చుట కొఱకు నన్ను నడిపించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.

Empowering Thoughts:
Ephesians 5:14 - “Awake, you who sleep, Arise from the dead, And Christ will give you light.” Do you ever feel intimidated by someone or something that God is calling you to do? God wants you to wake up and experience a shift inside your spirit. Because of God’s grace, He has given you the ability to go beyond your ability. Not only that, God has empowered you to serve God acceptably. God wants you to live an extraordinary life, but that means you need to respond whenever you are moved by the Spirit. To overcome intimidation, it means that you stand to your feet regardless of what anyone thinks and get out of the box that you have created for yourself. Don’t allow intimidation to keep you from doing what God wants you do or keep you from going where God wants you to go. God wants to do something great in your life, but you must be in a position to get ready. 

Talk to The King:
Father, I thank You for Your purposes in my life. Help me awaken my inner self as I empower my mind to take hold of new things prepared for me. In Jesus name, I pray, Amen.