మార్పుచెందు తలంపులు - Changing Thoughts

  • Author: Unleashed for Christ
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

మార్పుచెందు తలంపులు:
సామెతలు 3:6 - "నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును".

మనము దేవుని అనుసరించి నడుచుకోవాలని ననిర్ణయించుకున్నప్పుడు మనమెంతో పరివర్తన చెందవలసియున్నది మారుమనస్సు పొందవలసియుంది. దేవుని ఆధిక్యత మనలను సరైన విధంగా మారుస్తుంది స్వేచ్ఛతో కూడిన జీవితాన్ని ఆయన మనకు ఇవ్వదలచుచున్నాడు కానీ బంధించాలని కాదు. మనము అనుభవించే శ్రమలు మనలను ఎంతో ధృడంగా మారుస్తాయి. అవి మన వ్యక్తిత్వాన్ని మన ఆత్మీయజీవితాన్ని బలపరచడానికి ఉద్దేశించబడినవి. శ్రమలు మన జీవితాలలో ఎంతో ముఖ్యం భూమికను పోషిస్తాయి. అనుదినం ఉండే చింతలను అసహనాన్ని ఎలా సహించాలో మనకు నేర్పి మనలను బలముగా, నిజాయితీగా తీర్చిదిద్దుతాయి.

ప్రార్థనా మనవి:
పరలోకమందున్న తండ్రి!!! నన్ను బలపరచి నా జీవితాన్ని ఫలింపజేసినందుకు నీకు వందనములు. నీయందు నిజమైన స్వేచ్ఛను పొందడానికి సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.

Changing Thoughts: Proverbs 3:6- “In all your ways acknowledge Him, And He shall direct your paths.” God’s Word is clear that when we choose to follow Him, we should expect to be changed—not a little, but entirely transformed. God’s kind of change doesn’t make our lives perfect—but it does make them expansive. He offers us lives of freedom and space rather than confinement and striving. The struggles we face are not just real, they are also good. They are the very substances God uses to form our character and move us toward freedom. They are the trenches where we work out the important stuff of life—where we learn how to overcome everyday frustrations, messy relationships, and our lack of joy and purpose—to become people of honesty, depth, and strength.

Talk to The King: Father God, thank You for the way You change me from my frightful self to strong self. Help me find right kind of freedom in You. In Jesus name, I pray, Amen.