నూతనమైన తలంపులు - New Thoughts

  • Author: Unleashed for Christ
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

నూతనమైన తలంపులు:
ప్రకటన 21:5 - "ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను".

మనలో చాలామంది మరి ముఖ్యంగా స్త్రీలైనవారు కొత్త కొత్తవన్నీ కొనడానికి ఆసక్తి కలిగియుంటారు. ఇది తప్పు కాదు గానీ అది మనలో ఉండే సహజమైన లక్షణం. ఇందుమూలంగానే దేవుడు ఒక రోజున సమస్తమూ నూతనముగా చేస్తానని ప్రకటన గ్రంథములో వ్రాయించెను. క్రొత్తదనాన్ని కోరుకోవడం తప్పు కాదు కానీ ఇది మనలను దేవునిని ఆరాధించడం నుంచి, సహవాసం నుంచి, సంఘమునుంచి, నీతినుండి దూరపరస్తుంది. అది మనలను ఆర్థికంగా మరియు ఆత్మీయంగా కూడా నష్టపరుస్తుంది. కొంతమంది గొప్ప దైవజనులు ఏమని సెలవిచ్చారంటే ఈ ప్రపంచంలో ఏదియూ మనలను తృప్తిపరచదని
మనం ఎప్పుడు గ్రహిస్తామో అప్పుడే ఒక సరికొత్త ప్రపంచాన్ని నిర్మించగలము.

ప్రార్థనా మనవి:
పరలోకమందున్న తండ్రి!!! నా ఆత్మను శాశ్వతమైన నీ రాజ్యమునకు సిద్ధపరచుచున్నందుకు నీకు వందనములు. నూతనమైన ఇహలోక విషయములపై మనసుని నిలుపక నీయందే దృష్టియుంచుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి ఆమేన్.

New Thoughts:
Revelation 21:5- “Behold, I make all things new.” Most of us especially women are very interested in shopping new things . The desire for new things is not entirely wrong but is incorporated into our DNA. It’s one of the reasons God’s promise in the book of Revelation that one day He will make “everything new” is so tempting. Craving newness isn’t wrong. It’s when this desire begins to deter us from the deeper ends God designed us for—worship, community, fellowship, virtue—that it becomes a net negative on both our bank account and our soul. Some great man of God said: “If we find ourselves with a desire that nothing in this world can satisfy, the most probable explanation is that we were made for another world.” Prepare yourself for that new world.

Talk to The King:
Father God, I thank You for, YOU prepare my soul for a new kingdom, an eternal one. Though my body craves for new things always, help me to never deter from Your set course in my life. In Jesus name, Amen.