రూపాంతరము చెందు తలంపులు - Transformed Thoughts

  • Author: Unleashed for Christ
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

రూపాంతరము చెందు తలంపులు:
రోమా 5:3-4 - "శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయును".

మనము టి.విలో వచ్చే ప్రాయోజిత కార్యక్రమాలకు ఇట్టే అతుక్కుపోతాము. కానీ వాటిని చూచి వినోదించినంత ఇదిగా మనలను పరిశుద్ధ గ్రంథమును చదువుటకు ఆసక్తి చూపించము. అందుకే మన జీవితాల్లో కొన్నింటికి ముగింపు ఉండదు. కొన్ని అనుబంధాలు తృప్తినివ్వవు. కానీ జీవితమంటే ఏంటో మనము క్రీస్తులోనికి వచ్చినపుడే చెందినప్పుడే తెలుస్తుంది. మనము పరలోకరాజ్యానికి చేరుకోవాలంటే క్రీస్తే మార్గము. మనము ఆయనలోనికి వచ్చినప్పుడు మన ఆత్మ ఫలిస్తుంది. కానీ క్రీస్తుని అను‌రించడమంటే మనలను అబ్బురపరిచే ఒక ముప్పై నిముషాల నిడివి ఉన్న కార్యక్రమం కాదు అది ఒక నిరంతర ప్రక్రియ. ఆయనయందు నిరీక్షణ కలిగి ఎంతో సహనముతో శ్రమలను ఎదుర్కొని గెలవాలి. అదే నిజమైన రూపాంతరము.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి!!! నీ వాక్కును మాకు బయలుపరచి నీ నీతిమార్గములను మాకు తెలియజేసినందుకు నీకు వందనములు. ఈ వాక్యముతో నిన్ను బలపరచుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.


Transformed Thoughts:
Romans 5:3-4 “ Tribulation produces perseverance; and perseverance, character; and character, hope.” Many a times we get awed by reality shows in televisions. Granted, the Bible doesn’t package up like a good reality show does. So many endings are left unwritten. So many relationships are left un-mended. Yet in the midst of all of it is life—real life—the way we actually know it. To follow Jesus is a full-life conversion to a new “place.” When we step into Christ’s Kingdom, we are transferring our hearts to a new place spiritually. Rather than uprooting and replanting our bodies, we are uprooting and replanting our spirits. We become transformed. But remember, following Jesus is not going to be like a fifty-minute show that neatly ends in a “wow.” The struggle is real, and it’s not going away. However, what is happening in you, through you, and around you—that transformation —is also real. And it’s amazing.

Talk to The King:
Father God, thank You for giving us the Holy Bible and teaching us Your virtues in a systematic way. Help me be transformed by this Word and be an example to many. In Jesus name, Amen.