స్వతంత్రపరచు తలంపులు - Freeing Thoughts


  • Author: Unleashed for Christ
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 7
  • Reference: Sajeeva Vahini

స్వతంత్రపరచు తలంపులు:
గలతీయులకు 5:1 - "ఈ స్వాతంత్యము అనుగ్రహించి, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసియున్నాడు".
ఈరోజుల్లో సమాచారం లభించడం చాలా సులువైపోయింది. జిపియస్, సామాజిక మాధ్యమాలు, అంతర్జాలం ఇవన్నీ మిశ్రమమైన దీవెనలా ఉన్నాయి. మనము మన స్నేహితులను కాకుండా మొబైల్ ఫోన్లను చూస్తున్నాం. సమయమంతా దానికే ధారబోసి వృథా చేస్తున్నాం. కొంతమంది బానిసలై పొతున్నారు. ఇందుకొఱకే దేవుడు మనలను సమస్త బంధకాలనుండి విడిపించుటకు సిలువమీద బలియాగమై యున్నాడు. ఆయన వాక్యముయందు నమ్మికయుంచి వాక్యానుసారంగా నడుచుకొంటే అపవాదిపై జయము కలుగును.

ప్రార్థనా మనవి:
పరలోకమందున్న తండ్రి!! క్రీస్తునందు నీవు నాకు అనుగ్రహించిన స్వాతంత్య్రమును బట్టి నీకు వందనములు. ఆ స్వాతంత్ర్యమును కోల్పోకుండా నన్ను నడిపించమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమేన్.

Freeing Thoughts:
Galatians 5:1- “We have freedom now, because Christ made us free.” Today we have every Access to information. GPS. Prime shipping. Social media addiction. The digital age is a mixed blessing. We look at our phones instead of our friends; we are into late-night web surfing; we live for the instant gratification of likes and followers. Most of us have become nocturnal too. But is this why God has set us free. If Christ died to make us free, then we must not let anything make us its slave. Having control over all such latest technology fads is highly important. We need to examine ourselves and place self checks in our lives and let not these things influence us to become slaves. Free yourself. Do not go back to bondage of the worldly laws set by and governed by satan.

Talk to The King:
Thank You Father for the freedom You have given me in Christ. Help me not lose that freedom to the worldly bondages. Instead help me check myself. In Jesus name, I pray, Amen.