మొదటి తలంపులు - First Thoughts

  • Author: Unleashed for Christ
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

మొదటి తలంపులు:
మలాకీ 3:10 - "పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి".
జీవితంలో మనం నేర్చుకొనే పాఠాలలో కష్టమైన పాఠం మన కష్టార్జీతం ప్రభుని సొంతం. ప్రతీ రూపాయి, ప్రతీ పైసా, ప్రతీ అణా ఆయనకే సొంతం. నోటుమీద ఎవరు ఉన్నా అన్నీ దేవునివే. మనము మన జీవితాలు మన కష్టార్జితం ఇవన్నీ ప్రభువుకే చెందును. గనుక ఆయనకు పదదియవవంతు చెల్లించుటయందు నీ చేయిని వెనుకకు తీయకుము. నీ అర్పణను మనఃపూర్వకముగా ఆయనకు అర్పించుము. మనకు అన్నీ దయచేయు దేవునికి చెల్లించుటయందు ఆనందించెదము. గనుక నీ సంపాదన యందు మొదట ఆయనకు ఇవ్వవలసిన అర్పణను ప్రత్యేకపరచి దానిని ప్రభువుకు చెల్లించుము. దేవుని మహిమపరచుము.

ప్రార్థనా మనవి:
పరలోక తండ్రి! ప్రభువా నీకు నా రాబడిలో పదియవవంతు చెల్లించుటయందు నా చేతిని వెనుకకు తీయక ఉండునట్లు నన్ను నడిపించుము. నా ప్రతీ పరిస్థితిలో నీవు నడిపించుచున్నావని నమ్మి నిన్ను స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని కలిగించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.

First Thoughts:
Malachi 3:10 - “Bring all the tithes into the storehouse.” One of the hardest lessons you and I need to learn is that our money belongs to God. Every rupee. Every paisa. Every credit card. Every cheque. No matter whose face they put on the new notes, that belongs to God, too. Sometimes it’s actually easier to acknowledge that our lives are God’s and that our bodies are God’s than to acknowledge that our money is God’s. Tithing is about deciding which of the following two things we allow to reign in our hearts and our families: trust or worry. Do we trust that God has our best interests at heart? If so, you will not cringe when you give God your tithe. Remember to first remove your tithe from your incomes before you use that for anything else. That ensures you are giving your first part to God.

Talk to The King:
Father God, help me never cringe when I give You my tithe. Lord I trust that You will take care of me in every circumstance. In Jesus name, Amen.