Day 143 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)


  • Author: Mrs. Charles Cowman
  • Category: Inspirations
  • Reference: Streams in the Desert - ఎడారిలో సెలయేర్లు

వారు ఎటుతోచక యుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను (కీర్తన 107: 27,28).

ఎన్ని తాళం చెవులతో ప్రయత్నించినా తలుపు తెరుచుకోకపోతుంటే నిరాశ పడకండి. తాళంచెవుల గుత్తిలోని ఆఖరితాళం సరైన తాళమేమో.

ఎటు తోచక ఓ మూలనూ మ్లానవదనంతో నిలబడి ముందేం జరగనున్నదోనని చేతులు నలుపుకుంటూ లోకమంతా పగవారై ఉంటే ఒంటరితనంలో గుబులుగుబులుగా దిగులు పడుతున్నావా క్రైస్తవ విశ్వాసి ఎటు తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే దైవ శక్తి కనిపించే మహిమ వేదిక.

ఎటు తోచన ఓ మూలను దుర్భరమైన బాధ కాలుస్తుంటే ఇక సహించలేనంటూ మనస్సు మూలుగుతుంటే నిలబడిపోయావా ఎడతెరిపి లేని శ్రమ క్రుంగదీస్తుంటే కళ్ళు చీకట్లుకమ్మి ఒళ్ళు మొద్దుబారితే ఎటు తోచక నువ్ నిలిచిపోయిన ఆ మూలే క్రీస్తు ప్రేమ ప్రకాశించే మహిమా వేదిక

ఎటు తోచక ఓ మూలను మొదలుపెట్టిన పని నిరర్థకమైపోతే పూర్తి కాకుండా ఆగిపోతే మనసు తనువు భారంతో క్రుంగిపోతే పనిపూర్తి చెయ్యడానికి శక్తి కరువైతే చేతుల్లో బలంలేక వణికితే ఎటు తోచక నువ్ నిలిచిపోయిన ఆ మూలే నీ భారాన్ని మోసేవాడు నిలిచియున్నాడు.

ఎటు తోచక ఓ మూలను నిలబడ్డావా సంతోషించు ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే శక్తి నిన్నెన్నడూ విడనాడని దైవశక్తి నీ అడుగుల్ని వెలుగులోకి నిస్సందేహంగా నడిపించే పరమ శక్తి ఎదురుచూస్తున్నది నిన్ను ఆదుకోవడానికి ఎటు తోచక నువ్ నిలిచిపోయిన ఆ మూలే సమర్ధుడైన దేవుడు నీకు తెలుస్తాడు.