సమాప్తమైనది

  • Author: Monica Hans
  • Category: Messages
  • Reference: Sajeeva Vahini Apr - May 2011 Vol 1 - Issue 4

యోహాను 19:30లో యేసు ఆ చిరక పుచ్చుకొని -సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇది యేసు పలికిన మాటలన్నిటిలో చిన్న మాట . మాట చిన్నదైనప్పటికి భావము ఎంతో గొప్పది. ఈ మాటను యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకొను అలవాటు కలిగిన యోహానుగారు మాత్రమే గ్రహించారు. ఎందుకనగా మిగతా సువార్తలలో ఈ మాట ఒక ‘శబ్దము’ గాను ఒక ‘కేక’ గాను వ్రాయటం జరిగింది. మత్తయి 27:50 యేసు మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. మార్కు 15:37 అంతట యేసు గొప్ప కేకవేసి ప్రాణము విడిచెను. లూక 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి ........... ప్రాణము విడిచెను. ఈ ‘సమాప్తము’ అను మాటలో మనము రెండు భావాలు గమనించగలం.

It’s Finished: It’s an expression of Satisfaction It’s an expression of Relaxation మన దేవుడైన యెహోవా సృష్టి అంతటిని చేసి సంతృప్తిచెందిన తరువాత విశ్రమించారు. అదేరీతిగా ఆయన ప్రియకుమారుడును పని అంతటిని సంపూర్తి చేసి విశ్రమించారు.ఈ ముప్పైమూడున్నర సంవత్సరాలలో ఎక్కడ కూడా మనుష్యకుమారుడు తలవాల్చుటైనను మనకు కనబడదు. ఇది ఆయన తండ్రి లక్షణము.

భూమి మీద యేసు ప్రభువు సమాప్తము చేసిన కార్యములు:

మత్తయి 26:1లో యేసు ఈ మాటలన్నియు చెప్పి చాలించిన తరువాత.......పస్కా పండుగ, సిలువ శ్రమ ప్రారంభమయ్యాయి. అనగా యేసు ప్రభువు తన శిష్యులకు చేయవలసిన బోధలను(Teachings) సమాప్తము చేశారు. ఆయన సిలువమీద పలికిన మాటలలోకూడా ఆయన శరీరధారిగా సమాప్తము చేసిన కార్యములను మనము చూడగలము. మొదటి మాట: లూక 23:34 యేసు - తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఈ మాటతో ఆయన తండ్రికి చేయవలసిన విజ్ఞాపనలను(physical mediator ship) సమాప్తము చేశారు. రెండవ మాట: లూక 23:43 అందుకాయన వానితో “నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను”. ఈ మాటతో ఆయన ప్రార్ధనల నేరవేర్పును(answering the prayers physically) సమాప్తము చేశారు. మూడవ మాట: యోహాను 19:26, 27 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి -అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను; తరువాత శిష్యుని చూచి - యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను. ఈ మాటతో ఆయన తన తల్లి భాధ్యతను (responsibility towards parents) సమాప్తము చేశారు. నాలుగవ మాట: మత్తయి 27:46 ఇంచుమించు మూడుగంటలప్పుడు యేసు - ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఐదవ మాట: యోహాను 19:28 అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు - నేను దప్పిగొనుచున్నాననెను. ఈ రెండు మాటలతో ఆయన లేఖనముల నెరవేర్పును(Fulfillment of Scriptures) సమాప్తము చేశారు. ఆరవ మాట: యోహాను 19:30 యేసు ఆ చిరక పుచ్చుకొని -సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఈ మాటతో ఆయన సమాప్తము అని తండ్రికి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. యేడవ మాట: లూక 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి - తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించు కొనుచున్నాననెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఈ మాటతో ఆయన భూమిమీద పలకవలసిన మాటలన్నిటిని (sayings) సమాప్తము చేశారు.

అంతేకాకుండా ఆయన మరణానంతరంకూడా లేఖనములను నెరవేర్చారు. యోహాను 19:33,36 - వారు యేసు నొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతి పొంది యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు....... అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనమునెరవేరునట్లు ఇవి జరిగెను.

ఈ కార్యముతో ఆయనను గూర్చి వ్రాయబడినవన్నియు సమాప్తము అయినట్లు అపో 13:29లో చూడగలము “వారు ఆయననుగూర్చి వ్రాయబడి నవన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుండి దింపి సమాధిలో పెట్టిరి.”

1. యేసు ప్రభువు భుమి మీదకు వచ్చిన ముఖ్య ఉద్దేశం:

హెబ్రీ 10:7లో దేవా, నీ చిత్తమునెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నాను. గనుక యేసు ప్రభువు తండ్రి చిత్తం నెరవేర్చుటకు వచ్చెను. ఏమిటా తండ్రి చిత్తం: ఆది 1:28 మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; ఇది దేవుడు మనకు ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం; పాపం చేసిన తరువాత మనకు వచ్చిన ఆశీర్వాదం ఆది 9:1 మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమినినింపుడి ఈ రెండు అశీర్వాదములలో తేడా ఏంటిఅంటే భూమిని లోపరచుకోనుట,అనగా భూమిపై అధికారాన్ని మనము కోల్పోయి సాతాను చేతికి అప్పగించాము. లూక 4:6లో ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడియున్నది, అదెవనికి నేను ఇయ్యకోరుదునో వానికిత్తును; కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని సాతాను ప్రభువుతో భేరమాడింది.

కనుక మనము పోగొట్టుకొనిన అధికారాన్ని తిరిగి సంపాదించుకొనుట తండ్రి చిత్తం అయియున్నది. ఈ అధికారాన్ని మన రక్షకుడైన యేసు ప్రభువు సాతనును మ్రొక్కి సంపదించలేదు గానీ దాన్ని త్రొక్కి సంపాదించారు. ఒకవేళ సుళువైన పనికదా అని సాతనుకు మ్రొక్కి ఉంటే భూమిపై అధికారం వచ్చేదేమో కానీ మరణంపై న రాదు.

హెబ్రీ 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములుగలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.

(2)తండ్రి చిత్తము నేరవేర్చుటవలన యేసు ప్రభువు పొందిన ఘనత :

ఫిలిప్పి 2: 8-11లో మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయతచూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకముందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమిక్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసు నామమునవంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును

దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హెబ్రీ 2:9లో దేవుని కృపవలన ఆయన ప్రతిమననుష్యునికొరకు మరణము అనుభవించునట్లు, దూతల కంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించినవానిగా ఆయనను చూచుచున్నాము. తండ్రి చిత్తము నెరవేర్చుటవలన ఆయన నామము, పైనామముగా అనుగ్రహించబడింది. అందుకే అందరు ‘ఇన్ జీసస్ నేమ్ వి ప్రే’ అని,’యేసు నామములో ప్రార్థిస్తున్నాము’ అని, ‘యేసు నామత్ లో జబం కేలు’ అని ‘ఈషు కే నామ్ పే ప్రార్ధన కర్ రహా హై’ .....అని రకరకాల భాషల్లో ప్రార్థిస్తున్నాము. ఇంకా ఆయన ముండ్ల కిరీటము ధరించటము వలన మహిమాప్రభావములతో కిరీటమును ధరించెను. (3)యేసు ప్రభువు వలన మనము పొందిన ఆశీర్వాదము: 1 కొరింథీ 15:55-57లో ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపుముల్లు పాపము; పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగుగాక. పండు తిని పాపాన్ని,మరణాన్ని తెచ్చుకున్న మనకు ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా పాప విమోచన కలిగింది,మరణములోనుండి జీవములోనికి దాటివేసియున్నాము. ప్రకటన 5:9. ఆ పెద్దలు - నీవు ఆ గ్రంథమును తీసికొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆ యా భాషలు మాటలాడువారలోను, ప్రతి ప్రజలలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులనుకొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు. ఈ లోక పాపములన్నిటి మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అయిన యేసు ప్రభువు వలన తిరిగి మనము భూలోకాన్ని ఏలే అధికారం పొందుకున్నాము. ఇది మనము తిరిగి పొందిన ఆశీర్వాదము,అనగా మనము పోగొట్టుకొనిన ఆశీర్వాదం. కనుక తన రక్తము ద్వార మనలను తన సొత్తుగా చేసికొనిన మన రక్షకునికి వందనములు.

(4) యేసు ప్రభువు జయించుట వలన తండ్రి పొందిన ఘనత: యోహాను 17:4లో చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. అనగా కుమారుడు తన తండ్రికి మంచి పేరు తెచ్చారు. మనము కూడా యేసు ప్రభువు వలే తండ్రి చిత్తం నెరవేర్చి ఆయనను మహిమ పరచవలసినవారమై యున్నాము. సమాప్తము అనగానే అన్ని కార్యములు సమాప్తమైనట్లేన, అట్లనరాదు ఎందుకంటే ఆయన ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టకి ఆదియునైనవాడు అను నామధేయము కలిగినవాడు. గనుక ఆయన మరణముతో ఆరంభమైన కార్యములను కుడా చూద్దాము.

ఆయన మరణముతో ఆరంభమైన కార్యములు

Blotting out of the old covenant & making and sealing of new covenant

1 కొరింధీ 11:25, 26 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని - యీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని యీ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చు పర్యంతము ఆయన మరణమును ప్రచురించుదురు. గనుక ఆయన రక్తము వలనైన క్రొత్తనిబంధన ఆరంభము అయింది.

ఆయన శరీర రక్తములు అందుకుంటున్నాము. ఇది ఆయన రాక పర్యంతము దీనిని చేస్తూ ఆయన మరణాన్ని ప్రచురిచవలసినవారమైయున్నాము . ఇప్పటివరకు మనకున్న పాపాలను ఆయన సిలువ రక్తములో కొట్టివేశారు కానీ ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అంటే మన అపరాధముల అకౌంట్ ఆరంభం. Making peace between God and man - 2 కొరింధీ 5:18 ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధాన విషయమైన పరిచర్యను మాకు అనుగ్రహించెను (Preaching started) సమాధాన సువార్త ఆరంభము అయింది Satisfaction of full justice of God - ఆది 2:17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను. యోహాను 5:24 నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసమంచువాడు నిత్యజీవము గలవాడైయున్నాడు; వాడు తీర్పులోకి రాక మరణములోనుండి జీవములోకి దాటియున్నాడు నిశ్చయముగా చచ్చెదవు అన్న తీర్పు పొందిన మనము యే న్యాయము ప్రకారము నిత్యజీవము పొందగలం రోమా 3:27 అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టివేయబడెను? క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాసన్యాయమును బట్టియే. గనుక న్యాయాధిపతి అయిన తండ్రికి సెక్షన్ ‘విశ్వాసన్యాయము’ సరిపోయింది.

విశ్వాసన్యాయము ఆరంభము అయింది

Breaking down middle wall of partition - ఎఫెసీ 2:12- 14 ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబందనుల లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు నిర్దేవులునైయుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి. అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు. ఆయన మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును, పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.

సమానత్వము ఆరంభము అయింది Way for personal access to God

ఎఫెసీ 2:18, 19 ఆయనద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు. మత్తయి 27:51 అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు రెండుగా చినిగెను;

ఇక తండ్రికి మనకు అడ్డము ఏమి లేకుండా మనమే నేరుగా అనగా పాపులమైన మన విజ్ఞాపనములను ఆయనకు సమర్పిస్తున్నాము. దేవుని యింటివారు అన్న పేరు ఆరంభము అయింది

A way for the full endowment of power and full anointing of Holy Spirit

యోహాను 7:38,39 నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టువాని కడుపులోనుండి జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. ఆత్మభిషేకము, ఆత్మ వరములు ఆరంభము అయింది.

toilax 5mg toilax 01 toilax spc
rigevidon reddit rigevidon risks rigevidon quantity