మా కర్త గట్టి దుర్గము


  • Author: N.H.Pramila Rani
  • Category: Messages
  • Reference: Sajeeva Vahini Oct - Nov 2011 Vol 2 - Issue 1

శాసనకర్త (Law Giver)

యెషయా 33:22 యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు ఆయన మనలను రక్షించును. శాసనములు -> ఆలోచనకర్తలు

కీర్తన 119:24 నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి.

శాసనము వలన -> జ్ఞానము

కీర్తన 19:7 యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.

శాసనము వలన -> బోధకులకంటె విశేషజ్ఞానము

కీర్తన 119:99 నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు.

శాసనములు -> నిత్యస్వాస్థ్యము

కీర్తన 119:111 నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్యస్వాస్థ్యమని భావించుచున్నాను.

కీర్తన 93:5 శాసనములు ఎన్నడును తప్పిపోవు

విశ్వాసమునకు కర్త (Author amd finisher of our faith)

హెబ్రీ12:1-2 విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మనయెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.

సూచకక్రియవలన ->విశ్వసముంచిరి

యోహా 2:11 గలిలైయలోని కానాలో యేసు ఈ మొదటి సూచకక్రియనుచేసి తన మహిమను బయలుపరిచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి.

సత్యమైన సాక్ష్యమును బట్టి -> విశ్వసముంచిరి

యోహా 10:41,42 అనేకులు ఆయనయొద్దకు వచ్చి - యోహాను ఏ సూచకక్రియను చేయలేదు గాని యీయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నియు సత్యమైనవనిరి. అక్కడ అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి. తేటగా బోధించినందువలన -> విశ్వసముంచిరి

అపో 14:1 ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజమందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులును హెల్లేనీయులును విశ్వసించిరి.

నిత్యజీవమునకు నిర్ణయింపబడినవారు మాత్రమే -> విశ్వసముంచిరి

అపో 13:48 అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమ పరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.

సమాధానకర్త (God of Peace)

1 థెస్స 5:23 సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక.

తలంపులకు కావలి->సమాధానము

ఫిలిప్పి 4:7 అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును

సమాధానముగా ఉంటే-> సమాధానములకు కర్తయగు దేవుడు తోడు

2కొరిం 13:11 తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై యుండుడి, ఆదరణ కలిగియుండుడి, ఏక మనస్సుగలవారై యుండుడి, సమాధానముగా ఉండుడి; ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడైయుండును.

సమాధాన కర్తయగు దేవుడు-> సాతానును చితకత్రొక్కిస్తారు

రోమ 16:20 సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితకత్రొక్కించును.

సమాధానపరిస్తే -> దేవుని కుమారులము

మత్తయి 5:9 సమాధానపరచువారు ధన్యులు; వారు దేవుని కుమారులనబడుదురు

ఓర్పునకు ఆదరణకు కర్త (God of Patience & Comfort)

రోమ 15:5-6. మీరేకభావము గలవారై యేకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము, క్రీస్తుయేసు చిత్తప్రకారము ఒకనితో నొకడు మనస్సు కలిసిన వారై యుండునట్లు ఓర్పుకును ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించుగాక.

ఓర్చుకుంటే-> ఆయనతో ఏలుతాము

2తిమో 2:12 సహించినవారమైతే ఆయనతోకూడ ఏలుదుము.

ఓర్చుకుంటే->బహుమానము

యాకోబు 5:7 సహోదరులారా, ప్రభువు ఆగమనపర్యంతము ఓపిక కలిగియుండుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు పర్యంతము, విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా?

ఓర్చుకొనిన యేసుని తలంచుకొంటే->ఓర్చుకొనగలము

హెబ్రీ 12:3 మీరు అలసటపడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తమ స్వంత హానికేచేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి.

ఉదా: (1) యాకోబు 5:11 యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. కడకు ప్రభువు అతనికి చేసినదానినిబట్టి ఆయన ఎంతో జాలియు కనికరమునుగలవాడని మీరు తెలిసికొనియున్నారు

(2) హెబ్రీ 6:15 (ఆ మాట నమ్మి) అబ్రహాము ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను.

నిరీక్షణ కర్త (God of Hope)

రోమ 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణగలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసముద్వారా సమస్తానందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక.

ఆయన ప్రత్యక్షమైనప్పుడు తేబడు కృపవిషయమై -> నిరీక్షణ

1పేతు 1:13మీ మనస్సు నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణనిరీక్షణ కలిగియుండుడి.

రక్షణకర్త (God of Salvation)

కీర్తన 18:46 యెహోవా జీవముగలవాడు నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్తయయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక.

రక్షణకర్త వలన -> పాప పరిహారణ

కీర్తన 79:9 మా రక్షణకర్తవగు దేవా, నీ నామప్రభావమునుబట్టి మాకు సహాయముచేయుము నీ నామమునుబట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము.

రక్షణకర్త-> మన అనుదిన భారము భరించును

కీర్తన 68:19 ప్రభువు స్తుతినొందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు రక్షణ-> శిరస్త్రాణము

ఎఫెసీ 6:17 మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరిచుంకొనుడి.

ఆలోచనకర్త (counselor)

యెషయా 28:29 ఆశ్చర్యమైన ఆలోచనశక్తియు అధిక బుద్ధియు అనుగ్ర హించువాడు ఆయనే

కీర్తన 33:11 యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును.

కీర్తన 92:5 యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి! నీ ఆలోచనలు అతిగంభీరములు