ఉల్లాసము తో నడచుట

  • Author: UFC
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

~ యేసు ఈ భూమ్మీద నడిచినప్పుడు తండ్రి యందు ఉన్న ఆనందముతో నడిచియుంటాడని ఆలోచించావా?

~ అవును..!! దయ్యములను వెళ్లగొట్టినప్పుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచినప్పుడు, జనములకు బోధించినపుడు ఆయన ఎంతో సంతోషముతో ఉన్నాడు.

~ ఆయన ఈ లోకమును విడిచి వెళ్ళే ముందు మనము ఆయనలో ఉండి ఆయన ఉద్దేశ్యం చొప్పున నడిచినప్పుడు మనం కూడా ఆయనకు కలిగిన ఆనందాన్ని పొందగలమని ఆయన మనకు చెప్పారు.

~ ఆయనలో ఆనందించుటయే మన జీవితాలను పరిపూర్ణం చేస్తుంది.

~ మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి శ్రమలను అనుభవించుచున్నా ఆయనయందు కలిగియున్న ఆనందమును బట్టి వాటినన్నిటినీ అధిగమించగలము.


ధ్యానించు:
యోహాను 15:11- “మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.”

ప్రార్థన:
పరలోక తండ్రి!!! నీయందు ఈ దినమంతయూ ఆనందించులాగున నన్ను పట్టుకుని నడిపించుమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.