నీ రాజు ఎవరు?

  • Author: UFC
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

~ ఈ లోకమునకు క్రీస్తు యేసు రాజుగా పుట్టిన దినమే క్రిస్మస్ పండుగ. ఈ రాజు మనందరినీ రక్షించుటకై తన మహిమను విడిచి తన్ను తాను తగ్గించుకొని నరావతరిగా ఈ లోకములో జన్మించాడు. అంతేకాదు, పునరుత్థానుడై రాజ్యమేలుటకు మరణమై తిరిగి లేచెను. ఈ రాజును తెలుసుకున్న మనము, మన హృదయములో ఆయనకు చోటిచ్చి సత్యమునకు సాక్ష్యులమవుదాం.

ధ్యానించు:
యోహాను 18:37‭-‬38- “నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని.”

ప్రార్థన:
పరలోకమందున్న తండ్రి!!! నా హృదయమునకు రాజువై ఉండి, సత్యమునకు సాక్షిగా నన్ను చేయుమని యేసు నామములో ప్రార్థించుచున్నాను పరమతండ్రి, ఆమేన్.