మొదట దేవుణ్ణి వెదకుము

  • Author: UFC
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

✓ మనందరి జీవితాల్లో దేవుడు చాలా ప్రాముఖ్యమైన స్థానానికి అర్హుడు. మన హృదయాలలో నివసింప అర్హుడు.

✓ ఈ లోకములో ఉన్నవారు మన జీవితాన్ని లోకపు విషయాలతో నింపి మిగిలిన స్థానాన్ని దేవునికి ఇవ్వమని చెప్తారు.

✓ కానీ అలా చే‌స్తే మనకు నిరాశ, ఓటమి, వేదన ఎదురవుతాయి. అదే దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చినప్పుడు దీవెన, సంతోషము, సమాధానము పొందగలుగుతాము.

✓ గనుక మనము అడిగే వాటి విషయమై ఒక పరిమితిని కలిగియుందాము. దేవుని కొఱకు జీవిద్దామని నిర్ణయించుకొన్నప్పుడు మనమేది సరైనదో అదే చేస్తాము.

✓ధ్యానించు: మత్తయి 6:33- “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి.”

ప్రార్థన:
ప్రియ పరలోకతండ్రి!!! లోకపు విషయాల్లో నేను చిక్కుకొన్నప్పుడు నాకు దారి చూపి నీయందు గురిని నిలుపుటకు సహాయము చేయమని యేసునామములో ప్రార్థించుచున్నాము పరమతండ్రి, ఆమేన్.