తండ్రి నాతో ఉన్నాడు

  • Author: UFC
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

నమ్మకంగా జీవిచాలంటే ఎన్నో త్యాగాలు చేయాలి. ఎన్నో పోగొట్టుకున్న భావాలు మనల్ని కొన్నిసార్లు ఒంటరితనంలోకి నెట్టేస్తాయి. కాని, ఒంటరితనంలో ఓర్పు, సహనం, విధేయతతో పాటు జీవిత అనుభవాలను నేర్పుతూ దేవుని ఉద్దేశాలను నెరవేర్చి విజయ మార్గంవైపు నడిపిస్తాయి. నా జీవితంలో ఎవరి ఆదరణ లేదని ఒంటరినని నిరాశతో బాధపడకుండా, సదా నన్ను ప్రేమించే క్రీస్తు నాతో ఉన్నాడని విశ్వసిస్తే ఎంత సంతోషం?

ధ్యానించు: తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను (యోహాను 16:32).

ప్రార్ధన: తండ్రీ, అనుదినం నన్ను ప్రేమిస్తూ అనుక్షణం నాతో ఉంటూ నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు. ఆమేన్