నీ కృపలో నన్ను బలపరచి సిద్ధపరచుము


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

✓వ్యక్తిగత, కుటుంబ, మానసిక, ఆర్ధిక, సామాజిక సమస్యలతో అల్లాడిపోతున్న పరిస్థితుల్లా జీవితం ఉందని భావిస్తే. భయపడవద్దు. దిగులు చెందవద్దు. నీ ప్రియ రక్షకుడు నీకిస్తున్న వాగ్దానం "నా కృప నీకు చాలును". కృప అంటే? "అర్హత లేనివాడు అర్హునిగా ఎంచబడడమే కృప."

✓ప్రభువా అని పిలువడానికి కూడా అర్హతలేని మనకు తండ్రీ అని పిలిచే యోగ్యత నిచ్చింది ఆయన కృప.

✓అవును! అవి ఎలాంటి పరిస్థితులైనాసరే. ఆయన కృప తోడుగా వుందని విశ్వసిస్తే ఎంతో సమాధానం పొందగలం.

ధ్యానం: పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు - యెషయా 54:10