దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును


  • Author: Dr G Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

ఉదయమున లేచామంటే రాత్రి పడుకునే వరకు ఎదో ఒక పనిలో ఒత్తిడి, భారం, బిజీ జీవితం. జీతం సరిపోటల్లేదు, నెలాఖరికి చాలీ చాలినంత డబ్బు, ఉద్యోగంలో కొంత ఒత్తిడి తగ్గితే బాగుండు, వ్యాపారంలో ఇంకొంచం లాభం, కనీసం మంచి ఉద్యోగం ఇలా అనుకుంటూ పొతే జీవితకాలం చెప్పుకున్నా ముగింపు లేదు కదా.

అనుదినం మన హృదయాలను పరిపాలించేది హృదయవాంఛలే. ఇవన్నీ తప్పేమీ కాదు గానీ అవి ఉండాల్సిన స్థానంలో ఉంటే చాలు. అదేవిధంగా అవి మన జీవితాలను గుప్పిట్లో పెట్టుకుంటే మన ఆత్మీయ స్థితి శూన్యమే.

ఈ సంవత్సరం గతించిపోతూ నూతన సంవత్సరం సమీపించుచున్నది గనుక ఒక తీర్మానం తీసుకుందాం; ప్రార్ధనలో, వాక్యంలో ఇంకొంత సమయం గడుపుతూ దేవునికి ప్రధమ స్థానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అట్టి తీర్మానమును ప్రభువు స్థిరపరచును గాక. ఆమేన్.

యాకోబు 4: 8 దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.