నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు

  • Author: Dr G Praveen Kumar
  • Category: Devotions
  • Reference: Sajeeva Vahini

మన చుట్టూ ఉన్నవారు మనలను అన్ని రీతులుగా విశ్లేషిస్తూఉంటారు. మన జీవితాల్లో జరిగే సంఘటలను బట్టి, చేస్తున్న పనులను బట్టి, మనమెటువంటి వరమో అని అనుదినం గమనిస్తూనే ఉంటారు. మనకేదైనా మంచి జరిగినప్పుడు ఈర్షపడుతూ, బాధ కలిగినపుడు నవ్వినవారు లేరని ఎవరు చెప్పగలరు? వీటన్నిటి నుండి విముక్తి పొందగలమా అంటే అసాధ్యం కదా!.

ఇటువంటి సందర్భాల్లో "యెహోవా షమ్మా" దేవుడు మనతో ఉన్నాడు అని ఒక్కసారి విశ్వసిస్తే, ఎటువంటి పరిస్థితులనైనా దేవుడు అనుకూలంగా మార్చేస్తాడు. అంతేకాదు, మనం పొందే విజయాలను చూసి, వీరి దేవుడు గొప్పవాడు అని పలుకతూ ఆయనను తెలుసుకుంటారు, అయన యెదుట సాగిలపడుతారు.

నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు (యెషయా 45:14). ఆమేన్.