మిమ్మునుగూర్చి మీరే జాగ్రత్తపడుడి


  • Author:
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

యేసు ప్రభువు నిజమైన దేవుడు అని నమ్మువాడు గ్రుడ్డిగా నమ్మాలి, అందులో ఏ సందేహము లేదు. కాని, యేసు ప్రభుని వెంబడించువాడు చాలా జాగ్రత్తగా వెంబడించాలి.

కీర్తనలు 53:2లో వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను.

అవును, ప్రియ చదువరీ! గ్రుడ్డిగా వెదకువారు తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. దేవుని వెదకువారికి వివేకము కావాలి. మనము అదృశ్యమైన దేవుని, కనిపించని దేవుని వెదకుచున్నాము.

అంత్యదినాలలో వచ్చేది క్రీస్తే, కాని అబద్ధం.
యేసు నామములో ప్రవచిస్తారు, కాని అబద్ధం.

అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వేరొక గ్రంథము లేక వేరొక రూపము కనుపరచరు.

పరిశుద్ధ గ్రంథమునే బోధిస్తారు, క్రీస్తునే ప్రకటిస్తారు కాని, అబద్ధం ప్రకటిస్తారు.

"అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు" (మత్తయి 7:15).

వీరు ఎక్కడ నుండి వస్తారు?

మార్కు 14:18లో నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని ఉంది. ఇస్కరియోతు యూదా క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించాడు. క్రీస్తు చేసిన అద్భుతములలో, చెప్పిన బోధలలో పాలుపంచుకున్నాడు. అంతేకాదు ఆయన శ్రమలలో, శోధనలలో కూడా ఉన్నాడు.

ఇస్కరియోతు యూదా కూడా సువార్త ప్రకటించి, స్వస్ధతలు చేసి, దయ్యములను వెళ్ళగొట్టాడు, క్రీస్తుతో కలిసి ప్రయాణం చేసి, ఆయనతో భోజనం చేసి చివరికి క్రీస్తూనే అప్పగించాడు.

అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు ఆకాశములో నుండి ఊడిపడరు. వారు సంఘములోనుండి, మన మధ్యనుండే వస్తారు.మార్కు 13:22లో ఆకాలమందు అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి "సాధ్యమైన యెడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు". మోసం విడువక ప్రయత్నం చేస్తారు.

"మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసికొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్రిల్లరు" (2 పేతురు 1:10).

మిమ్మును గూర్చి మిరే జాగ్రత్తపడుడి.