క్రీస్తుతో 40 శ్రమానుభవములు 5వ అనుభవం


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో శ్రమానుభవములు 5 వ రోజు:
Audio: https://youtu.be/humh-rL5Pxo

శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమలయందును అతిశయపడుదము. రోమా 5:3,4

క్రైస్తవ విశ్వాసంలో క్రీస్తుతో శ్రమానుభవం అనేక విషయాలు నేర్పిస్తూ క్రీస్తు మనతో ఉండి మనకు సహాయకుడిగా ఉంటాడు అని నేర్చుకుంటున్నాం. కాని ఈ వాక్యభాగంలో గమనిస్తే వినూత్నమైన ఆనుభవం దాగి ఉంది.

శ్రమను అధిగమించడానికి దేవుని ఆత్మ చేత సహాయం పొందగలమని లేదా శ్రమల నుండి దేవుని ఆత్మ నడిపింపు చేత విజయం పొందగలమని మాత్రమే కాదు గాని, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుంది అని గ్రహించి సంతోషించాలి.

రైతు, విశ్వాసంతో విత్తనం నాటి అది అభివృద్ధి అవుతుందని నమ్మకంతో వేచిచూస్తాడు. ఆ విత్తనం వృక్షమై కొమ్మలుగా విస్తరిస్తుంది. శ్రమలతో కూడిన విశ్వాస జీవితం కూడా అంతే. శోధనలవల్ల కలిగే శ్రమలను మన ఆత్మీయ జీవితంలో లోతుగా నాటగలిగితే, వాటినుండి వచ్చే ఫలితం క్రీస్తుతో శ్రమానుభవం.

ఎటువంటి శ్రమలు అనుభవిస్తున్నా, ఎటువంటి శోధనలగుండా మన జీవితం ప్రయాణిస్తున్నా బాధపడకుండా సంతోషించాలి. ఈ శ్రమ మనకు ఓర్పును నేర్పిస్తూ ఓ క్రొత్త అనుభవంలోకి నడిపిస్తుంది. ఎందుకంటే మన శ్రమలు, కష్టాలు, నిందలు, బాధల కంటే గొప్పవాడు మన యేసుక్రీస్తు. ఈ క్రీస్తు శ్రమానుభవములో ఓర్పును కలిగియుండుటకు నేర్చుకుందాం. అయితే ఈ విశేషమైన అనుభవంలో ఓర్పు చేత విశ్వాసి స్వభావం పరీక్షించబడుతుంది.

అంతరంగంలో ఉండే స్వభావం క్రియాల్లో బయలుపరచబడి పరీక్షించబడినప్పుడు... ఆ పరీక్షా ఫలితాలే ఆధ్యాత్మిక స్థితిని తెలియజేస్తుంది. ఈ అనుభవంలో ఆధ్యాత్మిక శక్తిని పొందిన మనం శ్రమలను జయిస్తూ... విశ్వాస జీవిత పరిణామాలను పెంపొందింపజేస్తాయి. ఇదే మనలో కలిగే నిశ్చయత. ఈ నిశ్చయత క్రీస్తు నాతో ఉన్నాడన్నంత మాత్రం కాదు గాని, క్రీస్తు అనుభవాల్లో నేను ఫలించగలుగుతాననే దృఢచిత్తం కలుగజేస్తుంది. అంతేకాదు, ఆయన దయా సంకల్పమైన చిత్తంలో నేను కూడా ఉన్నాననే పరిపూర్ణ నిశ్చయతను రుజువు చేస్తుంది.

అనుభవం: శోధనలవల్ల కలిగే శ్రమలను మన ఆత్మీయ జీవితంలో లోతుగా నాటగలిగితే, వాటినుండి వచ్చే ఫలితం క్రీస్తుతో శ్రమానుభవం.

Experience the Suffering with Christ - 5th Experience

Not only so, but we also rejoice in our sufferings, because we know that suffering produces perseverance; perseverance, character; and character, hope. - Romans 5 : 3,4.

While experiencing the suffering with Christ in the Christian Faith, many times… many things will teach us that Christ is with us and he is the helper. There is an innovative experience hidden in this passage. Either we can be helped by the Spirit of God to overcome afflictions? or can we be victorious by the guidance of Holy Spirit from hardships ? we must rejoice and realize that suffering produces perseverance; perseverance produces character; and character produces hope.

A farmer sows seed with faith and confidently waits for the seed to grow. As seed grows into a tree then it flourishes into branches. The same is true with the tribulations in the life of faith. If our spiritual life is deeply ingrained with hardships due to temptations, then it is the greatest experience of suffering with Jesus Christ. We should be happy without feeling sad though we are experiencing any hardships or travelling through any temptations. This suffering teaches us endurance and leads us to a new experience. Because our Jesus Christ is greater than our afflictions, hardships, reproaches, and persecutions. Let us learn to have patience in the sufferings with Christ.

But in this remarkable experience, the believer-s nature is tested by patience. When the inward nature revealed through actions which are tested, those test results indicate the spiritual state of us. those who receive spiritual power in this experience can overcome the hardships and enhance the consequences of the faithful life. This is the certainty that we have. This certainty is not only that Christ is with me, but also gives us the determination that we can be fruitful in the experiences with Christ.

Moreover, it proves the absolute certainty that I am also in His merciful will.

Experience: If our spiritual life is deeply ingrained with hardships due to temptations, then it is the greatest experience of suffering with Jesus Christ.

Audio: https://youtu.be/fQV5E4W2b7Y