క్రీస్తుతో 40 శ్రమానుభవములు 10వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

క్రీస్తుతో శ్రమానుభవములు 10 వ రోజు:
Audio: https://youtu.be/JYigwKXq2Do

 

మేము దృశ్యమైనవాటిని చూడక అదృశ్యమైనవాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంత కంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ జేయుచున్నది. 2 కొరింథీయులకు 4 :17


ఈ మాటలు చదవగలుగుతున్నావంటే క్రీస్తు కొరకు నేను ఎదో ఒకటి చేయాలనే తాపత్రయం నీలో ఉందని భావిస్తున్నాను.

క్రీస్తు కొరకైన శ్రమ, భారం కలిగియుండడం గొప్ప లక్షణం.

సమయంతోపాటు వయసు వేగంగా పరుగెడుతోంది.

రక్షించబడ్డావా? అని అడిగితే, ఇప్పుడే కాదు ఇంకా సెటిల్ అవ్వాలి అనే సమాధానం.

ప్రార్ధనా, వాక్యం వంటి అలవాట్లు పక్కన పెట్టి సామాజికమాద్యంలో కాలక్షేపాలు. ఇదే ఈ ఆధునిక కాలంలో విశ్వాసంలో వెనకడుగేసే వంకర మార్గాలు.

స్నేహితుడా, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరివంటి మన జీవితానికి ఎన్నో ఆశలు ఆశయాలు.

దేనికోసం కష్టం? దేనికోసం పోరాటం?
నిన్న సంపాదించింది ఇవాళ దాచుకుందాం అనుకుంటే కనబడకుండా పోయిందే!

ఇవాళ కాదు రేపు అనే ఆలోచన మనలను అనుదినం వెనక్కినెట్టేస్తుంది. ఈ విషయాన్ని గమనించుకున్నప్పుడు జీవితాలు మార్చుకోవాలనే ఆలోచన మొదలవుతుంది.

ఈ లోక సంబంధమైన ఆశయాలకంటే, ఇహలోక సంబంధమైన దేవుని ప్రణాళికలు మహిమోన్నతమైనవి.

ప్రార్ధన, సమర్పణ, సిధ్ధపాటు ఈ మూడు లక్షణాలు కలిగియున్నప్పుడే క్రీస్తులో ఉన్నామని ఋజువు.

* లోతైన ప్రార్ధన, దేవునితో సంభాషించే అనుభవం.
* సజీవయాగంగా సమర్పించుకున్న జీవితం, దేవుని రొమ్మున ఆనుకొని ఆయన గుండె చప్పుడు వినగలిగే అనుభవం.
* సిధ్ధపాటు కలిగిన జీవితం;మరణం శరీరమును వేరుచేసినా... ఆత్మలో క్రీస్తుతో కూడా లేపబడతామనే నిరీక్షణానుభవం.

క్రైస్తవ్యత్వం నిత్యత్వానికి పిలుపు! విశ్వాసంలో మరింత లోతైన అనుభవం మహిమలో ఆయనతో ఉంటామనే ధృడ నిశ్చయత. ఈ సంకల్పం మనలను అనుదినం బలపరుస్తూ శాశ్వతమైన మహిమ పొందాలనే ఆలోచన కలుగజేస్తుంది.

అంతేకాదు - తృణప్రాయమైన మన జీవితానికంటే, క్షణమాత్రముండు లోకపు శ్రమలకంటే, శాశ్వతమైన దేవుని మహిమ గొప్పదిగా కనబడుతుంది.

అనుభవం: అనుదినం అధికమయ్యే ఈ నిత్యమైన మహిమా భారమే క్రీస్తుతో శ్రమానుభవం.

 

Audio: https://youtu.be/RlJFLBsGk1g

 

For our light and momentary troubles are achieving for us an eternal glory that far outweighs them all. 2 Corinthians 4:17.

If you are reading these words, I think you have the will to do something for Christ.

It is a great attitude to submit yourself to accept struggles and burdens for Christ.

Our Age is rapidly accelerating over time. These days when you ask someone, "have you received salvation?", the answer sometimes is, "not now, I should settle down first”. I really feel very pity for them.

These modern days and busy world, it keeps us aside to the habits like prayer, reading the word of God, and these days we spend more time on social media. Don’t we understand that these are deviating our faith? You can decide your answer.

Dear Friend, our life is like a vapor that appears and disappears in a just; for such life, we keep a lot of aspirations to achieve. Just stop a second and ask yourself a question; For what we are struggling for? for what are we trying to achieve? sometimes we want to save a lot of money and unfortunately, it vanishes in just. We try to achieve many things and struggle for them. The problems start again and again. This is how life in this world today.

When we stop a second and try to understand or push back ourselves, then that moment changes us completely towards a different direction. Remember, God-s plans are more glorious than our desires and greater than these worldly intentions. But only one thing to understand that His plans can be executed on us only when we have an attribute of prayer, dedication, and preparation. If you are on this path do not worry, your life is in the safe hands of Christ.

Always Remember…

* Prayer is the experience of communicating with God.

* A life dedicated to God as a living sacrifice is an experience of leaning towards Him and experience the Heartbeat of Jesus Christ.

* This commitment and preparedness do not fear death. Even when death separates the body and spirit. our committed life gives us hope that the soul will also be resurrected with Christ.

My Dear Friends, Christianity is a call to eternity! A more profound experience in the faith is the firm determination to be with Him in the glory. This will strengthen us and gives us the idea of attaining eternal glory. Not only that - the glory of the eternal God seems to be greater than our miserable life and the tribulations of the world that are very momentary.

Experience: The burden of the eternal glory, which is increasing every day, is an experience of suffering with Christ.