క్రీస్తుతో 40 శ్రమానుభవములు 24వ అనుభవం

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Suffering with Christ
  • Reference: Sajeeva Vahini

ఆయన, కుమారుడైయుండియు తాను పొందిన శ్రమలవలన విధేయతను నేర్చుకొనెను. హెబ్రీయులకు 5:8

ప్రపంచంలో మానవుని మహత్తర జ్ఞానం, శక్తి, నైపుణ్యత గణనీయంగా - ఘననీయంగా వర్ణించే సందర్భం అంటూ ఉంది అంటే అది చంద్రమండలంపై మొట్టమొదటి సారిగా మానవుడు కాలు మోపిన రోజే కదా!

అంతరిక్షాన్ని చేరుకునే మానవ మేథస్సు "విజ్ఞానం" అని లోకం చెప్తుంటే, ఆయన దేవాది దేవుడైయుండి పరలోకమునుండి ఈ భూమిమీద అడుగుపెడితే అది "విధేయత" అని బైబిల్ చెప్తుంది.

క్రీస్తు పుట్టుకలో ఆయన చూపిన విధేయత... 30 సంవత్సరాలు తనను తాను సిధ్ధపరచుకొని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు సువార్త అడుగులు ముందుకు వేసాడు. ఈ విధేయత సిలువ శ్రమ వైపు నడిపించినా అడుగు వెనకకు పడలేదు; సిలువ ఎత్తుకొని ముందుకే నడిచాడు. మరణపర్యంతం ఆ విధేయత వెనుకాడలేదు... ఆ విధేయతే మరణంపై విజయం పొందింది.

విధేయతకు మాదిరిగా జీవించి మనమూ ఆయనవలే జీవించడానికి ప్రోత్సాహిస్తున్నాడు. ఎందుకంటే, సిలువలో క్రీస్తు విధేయతా ప్రతిబింబాలు మన జీవితాల్లో చూడాలనుకుంటున్నాడు కాబట్టి. ఈ విధేయత మహిమలో క్రీస్తును చేరుకోడానికే కదా!

నేనంటాను - మనలో ఉండే శక్తి సామర్ద్యలు, నైపుణ్యతలకంటే దేవునికి మనలో ఉండే విధేయత కావాలి.

శ్రమల్లో రెట్టింపయ్యే అనుభవం విశ్వాసం అయితే
ఆ విశ్వాస ఫలమే విధేయత.

విశ్వాసానికి సువాసన విధేయత అయితే
ఆ విశ్వాస విధేయతే మన నడవడి.

ఇదే మన జీవితం.

అనుభవం : విశ్వాసం విధేయతా జీవితమే సిలువలో క్రీస్తుతో శ్రమానుభవం.