దాటిపోనివ్వను

  • Author: John Hyde
  • Category: Articles
  • Reference: Sajeeva Vahini

వీధులగుండా మార్మోగుతున్నధ్వని
ప్రతినోట తారాడుతున్న మహిమల మాటలు
వస్త్రపు చెంగు తాకితే స్వస్థత
మాట సెలవిస్తే జీవము
వుమ్మికలిపిన మట్టిరాస్తే నేత్రహీనత మాయం
ఊచకాలు బలంపొందిన వయనం
పక్షవాయువు, కుష్టు
పీడించిన ఆత్మలు పరుగుల పలాయనం
ఎన్నో మరెన్నో
అన్నిటికీ కర్త నజరేయుడైన యేసు

ఈ రోజు ఇటే వస్తున్నాడు
గాడిదనెక్కి పురవీధుల్లోకి
ఆహ్వానం కర్జూరపు మట్టలతో
ఆనందహేలల హృదయాలతో
దారివెంట వస్త్రాలను పరుస్తుండగా
హోసన్న గీతాలతో మార్మోగుతున్న సమయం

ఎలా దాటిపోనివ్వను
వస్త్రాన్నే కాదు హృదయాన్ని పరుస్తాను
తను నడిచే దారిలో

లోకమునకు వెలుగైన కాంతిపుంజాన్ని
అందుకోకుండా ఎలావుండగలను!

ఎన్నటికి దప్పిగొనని జీవజలం కొరకై
హోసన్న గీతంతో ప్రతిధ్వనిస్తాను

తోడుండే ఇమ్మానుయేలును
వెంబడించకుండా ఎలావుండగలను

అందుకే...
నా కన్నుల్లో స్థిరమయ్యే
ఒక్క దృశ్యంకోసం ఎదురుచూస్తూ
దాటిపోనివ్వను ప్రతి సమయాన్ని.