క్రైస్తవుని జీవన శైలిలో - శక్తి సామర్ధ్యాలు - Christian Lifestyle - Energetic Abilities

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Christian Lifestyle Series
  • Reference: Christian Lifestyle Series in English & Telugu

క్రైస్తవుని జీవన శైలిలో - శక్తి సామర్ధ్యాలు

మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు 1 యోహాను 4:4

నేనేది సాధించలేకపోతున్నాను, ఏ పని చేసినా అందులో ఫలితం లేకుండా పోతుందనే ఆలోచన మనలను ఎప్పుడూ క్రిందకు పడేస్తుంది. ఎంతో కష్టపడి, శ్రమపడి చేసే పనుల్లో విజయం చూడలేని సందర్భాలు ఎన్నో ఉంటాయి. కొన్ని సార్లు ప్రార్ధనతో ప్రారంభించినా ఫలితం దొరకకపోగా నిరాశ ఎదురయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటారు?

ప్రార్ధన చేసినప్పుడున్న శక్తి, సమస్యను ఎదుర్కొంటున్నపుడు మనలోని అవిశ్వాసం వలన బలహీనులమవుతాము. నేను చేయగలనా లేదా, నేను చేయలేనేమో, నేను చేసేది సరైనదో కాదో వంటి ప్రశ్నలు మన మనసులో మొదలైయ్యే అనేక సందేహాలు. విశ్వాసంలో మనం బలహీనంగా ఉన్నప్పుడే మనకు అపజయాలు ఎదురవుతాయి. అయితే, దేవుడిచ్చే శక్తి సామర్ధ్యాలు మనలను బలపరుస్తూ మనలోని విశ్వాసాన్ని మెరుగుపరుస్తుందని గ్రహించాలి.

శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము మన శక్తి సామర్ధ్యాలను హరించి వేస్తే, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడని విశ్వసిస్తే దేనినైనా సాధించగల శక్తి సామర్ధ్యాలు మనలను మరింత బలవంతులను చేస్తుంది. అంతేకాదు, దేవుడిచ్చే శక్తికి భక్తి విశ్వాసాలు తోడైతే, జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది.

శక్తి కలిగిన విశ్వాసమే నిలకడ నిశ్చయత కలిగే అనుదిన జీవితానికి పునాదిగా ఉంటుంది. ప్రాణంతో ఉన్న చేప మాత్రమే నీటిలో ఎదురు ఈద గలుగుతుంది, ప్రాణంలేనిది ఆ నీటి తాకిడికి కొట్టుకుపోతుంది కదా. మన హృదయంలో నివసించగల క్రీస్తు మనలో ఉన్నాడనే సజీవమైన విశ్వాసం మనలోని సామర్ధ్యాన్ని రెట్టింపుచేస్తూ, సమస్యల తాకిడికి ఎదురెల్లి వాటిని ఛేదించగలననే సంకల్పాన్ని మనలో బలపరచి, ఏ సమస్యనైనా సుళువుగా ఎదుర్కోగలననే ఖచ్చితమైన నిశ్చయతను కలుగజేస్తుంది. ఈ అనుభవం శక్తివంతమైన క్రైస్తవుని జీవన శైలిలో ప్రత్యేకమైనది. ఆమేన్

Audio Available : https://youtu.be/ZJLPn5QRPYg

 

  1. ENERGETIC ABILITIES

He who is in you is greater than he who is in the world - 1 John 4:4.

The thoughts of inability to achieve and whatever I do results to zero, always brings us down. There are many instances where our hard work fails us. Sometimes we start with prayer, but when there is no result, there is hopelessness. What could be the Reason?

We might have power when we pray, but when we face a problem or a situation with might not have the same power and we may become weak. Many questions arise in our minds, such as whether I can do it or cannot do it, and whether I can do it right or not. These situations occur only when we are weak in faith and at the end we fail. However, we must realize that God-given strength, strengthens us and improve our faith.

When the desires of the flesh and the pride of life exhaust our energy and abilities; having faith that the one in us is greater than the one in the world; empower us with strong attaining capability. Moreover, if God-given power is accompanied by our religious beliefs, life will be much greater than expected.

Faith with power is the foundation of a determined life and stability. Only the surviving fish can sustain in water, and the lifeless will be washed away. A living faith in Christ that he lives in our heart doubles our ability to do so, reinforces the possibility that we can face problems and overcome them, and make sure that we can face any problem very easily. This experience is unique to the lifestyle of a powerful Christian. Amen.

Audio: https://youtu.be/WuG2YU25l40