క్రైస్తవుని జీవన శైలిలో - అభిషేక శక్తి - Christian Lifestyle - Power of Anointing

  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Christian Lifestyle Series
  • Reference: Christian Lifestyle Series in English & Telugu

క్రైస్తవుని జీవన శైలిలో - అభిషేక శక్తి

"దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను" అపొ 10:38

అభిషిక్తుడైన యేసుక్రీస్తు ఆపవాదిని గద్ధించాడు, అపవాది చేత పీడించబడిన వారిని విడుదల చేసాడు, అనేకవిధములైన రోగములను స్వస్థపరచాడు. యేసుక్రీస్తు పొందినటువంటి అభిషేక అనుభవాన్ని మనము కూడా పొందగలమనే నిరీక్షణ గలవారమైయున్నాము. అట్టి అభిషేక అనుభవంలో పరిశుద్ధాత్మ మనకు సమస్తమును బయలుపరచి సత్యమును బోధించేదిగా ఉంటుంది. సత్యస్వరూపియైన ఆత్మ ద్వారా సత్యమును యెరిగిన మనం సర్వసత్యము లోనికి నడిపించే గొప్ప అనుభవాన్ని పొందగలం.

అంతేకాకుండా, 2 పేతురు 1:3-4 ప్రకారం, దేవుని స్వభావమునందు మనం పాలివారమవుటకు తన అనుభవజ్ఞానమును మనలో నింపి మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములును అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడని గ్రహించాలి.

దేవుని స్వభావం పొందుకున్న మనం ఆ శక్తి సామర్ధ్యాలను వీక్షించేవారంగా కాక, ఆ శక్తిని పొంది అనుభవించేవారముగా దేవుడు మనలను ఎన్నుకున్నాడన్న సంగతి గ్రహించాలి. దేవుని శక్తి మనలో పనిచేయడానికి పరిశుద్ధాత్మ చాలా అవసరం. దేవుడు విశ్వాసిలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారా సమస్తాన్ని జరిగిస్తాడను మాట సత్యమైనది.

నేనంటాను, పరిశుద్ధాత్మతోనూ శక్తితోను దేవుడు మనలను అభిషేకించడానికే ఏర్పరచుకొని, తన స్వరక్తమిచ్చి కొన్నాడు. పరిశుద్ధ గ్రంధంలోని ప్రతి వాగ్ధానాలను మన జీవితాల్లో నెరవేర్చడానికి పరలోక శక్తి సామర్ధ్యాలను, భూలోక శక్తి సామర్ధ్యాలను మనలో అనుదినం నింపి, మన జీవితాలకు సంబంధమైన ప్రతి వాగ్ధానం నెరవేర్చబడ్డానికి తనదైన అభిషేక శక్తి సామర్ధ్యాలను పరిశుద్దాత్మ ద్వారా మనకు దయజేస్తున్నాడు.

రోజువారి జీవితంలో ఏ పనిచేస్తున్నా మన దేవుని స్వభావ సిద్ధమైన దేవునిశక్తిలో జీవించేవారముగా ఉన్నామని విశ్వసించాలి. యేసుక్రీస్తు నేర్పిన అభిషేక అనుభవాన్ని మనం కూడా అలవరచుకొని అనుదిన క్రైస్తవ జీవన శైలిలో ఇట్టి అభిషేక శక్తి సామర్ధ్యాలను పెంపొందించుకోవాలనే ఉద్దేశం కలిగియుందము. ఆమేన్.

Audio Available: https://youtu.be/xMpvQ0wBw3k

POWER OF ANOINTING

How God anointed Jesus of Nazareth with the Holy Ghost and with power - Acts 10:38.

Anointed Jesus Christ rebuked the devil, freed those who were persecuted by the Devil, and cured many ailments. I am sure that we too can have the anointing experience the same as Jesus Christ. In this anointing experience, the Holy Spirit teaches us the truth and reveals everything. We can have a great experience in the Holy Spirit that leads us into all the truth.

According to 2 Peter 1: 3-4, we must realize that in the very nature of God, He has bestowed upon us the most precious and most promising things, so that we may be filled with the knowledge of Him, filling up our experience.

Having received God's nature, we must realize that God has chosen us not as viewers of those strengths and abilities but as those who receive and experience that strength. The Holy Spirit is essential for the power of God to work in us. The truth is that God does everything through the Holy Spirit who dwells in the believer.

I believe that God elected us, bought us with his blood; and anointed us, with his strength through the Holy Spirit. To fulfill all the promises that were in the Holy Bible. He bestows upon us “His anointing strength” and the “strengths and abilities of the heaven and the strengths and abilities of the earth”.

Whatever work we do in our daily life; we must believe that we are living in God's strength. We need to adopt the anointing experience that Jesus Christ taught us and adopt such anointing strength in the lifestyle of a Christian. Amen.


https://youtu.be/d_WDgasXeKA