నా జీవితం ఎలా ఉండాలి?


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini Daily Devotions Telugu

నా జీవితం ఎలా ఉండాలి?

“నీవు ఎందుకు పనికి రాని వాడవని” తండ్రి గద్ధిస్తే, ఏమి చేయలేని పరిస్థితిలో రవి అనుదినం నిరాశ పడిపోయేవాడు. తన తండ్రి మాటలు అతని హృదయంలో లోతుగా గుచ్చుకున్నాయి. నీ స్నేహితులను చూడు వారు బాగా సెటిల్ అయ్యారు, మన బంధువుల ముందు నేను తలెత్తుకోలేక పోతున్నానని తండ్రి అన్నప్పుడల్లా కృంగిపోయేవాడు.

తన మనసులో మెదులుతున్న బాధ అనేక ప్రశ్నల వలయంలో చిక్కుకున్న రవి బాధలో ఆలోచించడం మొదలు పెట్టాడు. చదువులో ప్రతిభను పొందలేకపోతున్నాను, కనీసం ఆటల్లో అయినా సాధించగలనా అనుకుంటే నిరాశే ఎదురవుతుంది. నేను నిజంగా ఎందుకూ పనికి రానా? నా జీవితంలో నేను ఏదీ సాధించలేనా? నా జీవితం ఇక ఇంతేనా? అని ఆలోచించాడు. ఎవరి ప్రోత్సాహం లేక ఒంటరితనంలో ఏమీ తోచని స్థితిలో జీవితాన్ని అంతమొందించాలని ప్రయత్నించాడు. ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసుకున్నాడు.

అయితే, ప్రయత్నం విఫలమై చివరికి హాస్పిటల్ బెడ్ పై తన కోన ప్రాణంతో పోరాడుతూ ఉన్నప్పుడు. ఒక అద్భుతమైన సంఘనట జరిగించి. అతన్ని పరామర్శించడానికి ఒక వ్యక్తి వచ్చి యోహాను సువార్త 14వ అధ్యాయము దగ్గర తెరువబడిన బైబిలును తన చేతిలో ఉంచి వెళ్ళిపోయాడు. పక్కనే కూర్చున్న రవి తల్లి ఆ అధ్యాయాన్ని చదివి వినిపించింది. యోహాను 14:19 లో “నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.” అనే యేసు పలికిన మాట విన్నప్పుడు, తనలో జీవించాలనే పట్టుదల మొదలైంది. “నాకు ఏకైన నిరీక్షణ ఇదే” అనుకున్నాడు. ప్రార్ధించడం మొదలు పెట్టాడు “యేసయ్య, నా జీవితం ఎలా ఉండాలని ఉద్దేశించావో అలా అనుగ్రహించేవాడివి నీవే అయితే, అది నాకు దయచేయుము” అని ప్రార్ధించాడు.

నిరాశ చెందిన పరిస్థితులు, జీవితంలో నిస్పృహతో కూడిన క్షణాలు మనకు ఎదురవుతూనే ఉంటాయి. అయితే, రవి వాలే “మార్గం, సత్యం, జీవం” అయ్యున్న యేసులో మనకు నిరీక్షణ ఉందని విశ్వసించినప్పుడు, దేవుడు మనకు విలువైన, తృప్తికరమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆమెన్.

Video Link: https://youtu.be/SL_HiSof-e8