ఆదరిచేరే దారే కనరాదు
-
-
-
- ఆదరిచేరే - దారే కనరాదు
- సంధ్యవెలుగు కను మరుగైపోయే
- నా జీవితాన - చీకటులే మూగె
- 1. విద్యలేని పామరులను పిలిచాడు
- దివ్యమైన బోధలెన్నో చేశాడు
- మానవులను పట్టి - జాలరులుగ చేసి
- భూవికి మీరే సాక్షులు అన్నాడు !!ఆదరి!!
- 2. సుడిగాలులేమో వీచేను - అలలేమో పైపైకి లేచేను
- నా ఆశలన్ని అడుగంటి పోయేను
- నా జీవితమే బేజారైపోయేను !!ఆదరి!!
- ౩. వస్తానన్నాడు విభుడు - మాట తప్పడు
- ఎంత గండమైన - ప్రభువు - అండనున్నాడు
- ఆదరిచేర్చే నాధుడు - నా చెంత నుండగా
- ఎందుకు నా హృదయాన ఈ తొందర !!ఆదరి!!