Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సిలువను మోస్తు సాగుతాం - విప్లవ జ్వాలను రగిలిస్తాం


    • సిలువను మోస్తు సాగుతాం - విప్లవ జ్వాలను రగిలిస్తాం (2) 
    • యేసే మా ఊపిరని చాటుతాం - భువినే దివిగా మార్చేస్తాం (2) 
    • క్రీస్తు సైనికులం మేము- వెలుగే చిరుదివ్వెలం మేము 
    • సత్యాన్వేషకులం మేము - నీతికి దాసులము మేము 

    • 1. సత్యం కోసం పోరాడుతాం - క్రీస్తు మాటలను ప్రకటిస్తాం (2) 
    • శ్రమ ఎదురైనా సహిస్తాం - క్రీస్తుని పోలి నడుస్తాం (2) 

    • 2. ప్రజల కన్నీరు తుడుస్తాం - మరణం వచ్చిన వెనుదిరుగం (2) 
    • పరిశుద్ధతతో జీవిస్తాం - యేసు ప్రేమను చూపిస్తాం (2)