Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రోజంతా నీ పాద చెంత


    • రోజంతా నీ పాద చెంత
    • నేనుండ నా కోరిక
    • దినమెల్ల నా తోడుగా
    • నీవుంటే ఓ వేడుక

    • నిను చూసే కనులు స్తుతించే గళము
    • ప్రేమించే హృదయము స్పందించే మనసు
    • దేవా నీవే దయచేయుము
    • నిన్ను కీర్తింప నేర్పు ప్రభు (2)

    • జీవితాంతము నీ వాడిగానే
    • నేనుండ నా కోరిక
    • ప్రతి నిత్యం నీ రూపమే
    • నా మదిలో మెదలాలిక llరోజంతాll

    • నీ సైనికుడనై నే పోరాడెదను
    • నా శక్తంతయు నా యుక్తంతయు
    • నీకై వెచ్చింప సంసిద్ధుడను
    • నన్ను దీవింప పంపు ప్రభూ (2)

    • అతి త్వరలో జనులెల్లరు
    • నిన్నెరుగ నా కోరిక
    • ఒకమారు వారందరును
    • నిను పొగడ చూడాలిగా llరోజంతాll