Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దాటిపోవు వాడు కాదు - యేసు దైవము


    • దాటిపోవు వాడు కాదు - యేసు దైవము
    • ఆలకించుతాడు - నీదు ఆర్తనాదము
    • ఏది నీకు అవసరమో - తాను ఎరిగియుండెను
    • మేలు కలుగచేయుటకు - నీ ప్రక్కనే ఉండును

    • దావీదు కుమారుడా దయ చూపుమని - వెంబడించి గుడ్డివారు కేకవేయగా
    • మీ నమ్మిక చొప్పున కలుగగాకని - ప్రేమతో తాకి వారి కనులు తెరిచేను
    • దాటిపోవు వాడు కాదు - యేసు దైవము

    • సమాధులలో నుండి ఎదురుగా వచ్చి - దయ్యాలు పట్టినవారు కేకవేయగా
    • దురాత్మలను తక్షణమే వదిలిపొమ్మని - ఆజ్ఞ ఇచ్చి వారిని బాగుచేసెను
    • దాటిపోవు వాడు కాదు - యేసు దైవము

    • బాధపడే కుమార్తెను కరుణించుమని - వేదనతో కనాను స్త్రీ కేకవేయగా
    • గొప్పదైన విశ్వాసం ఆమెకుందని - మాటతోనే
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 7971 times