Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మేడున్నా మిద్దున్నా - పెద్ద గద్దె మీద నీవున్నా


    • మేడున్నా మిద్దున్నా - పెద్ద గద్దె మీద నీవున్నా..
    • నీలో యేసన్న లేకున్నా - నీకున్నదంతా సున్నా..

    • సిరివుందని తూలనాడినా - బలముందని విర్రవీగినా..
    • తీర్పునందు చిక్కెదవన్నా - మార్పునొంద త్వరపడుమన్నా..
    • మేడున్నా మిద్దున్నా - పెద్ద గద్దె మీద నీవున్నా..
    • యేసన్న లేకున్నా - నీకున్నదంతా సున్నా..

    • అందముతో అతిశయించినా - సుందరునని గర్వించినా..
    • ఈ దేహం మన్నదు నాన్నా- ఆపై నీ గతి ఏమన్నా.
    • మేడున్నా మిద్దున్నా - పెద్ద గద్దె మీద నీవున్నా..
    • యేసన్న లేకున్నా - నీకున్నదంతా సున్నా..

    • చదువులలో శిఖరమెక్కినా - పదవులలో పైకి ఎదిగినా..
    • హృదయం ప్రభుకీయకున్నా - నరకమే గతి ఇది నిజమన్నా..
    • మేడున్నా మిద్దున్నా - పెద్ద గద్దె మీద నీవున్నా..
    • యేసన్న లేకున్నా - నీకున్నదంతా సున్నా..
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 262 times