తల్లికున్నదా - తండ్రికున్నదా - నీ ప్రేమ జాలి యేసయ్యా.
-
-
-
- తల్లికున్నదా - తండ్రికున్నదా - నీ ప్రేమ జాలి యేసయ్యా..
- అన్నదమ్ములకైనా - కన్నబిడ్డలకైనా - నీ ప్రేమ లేదు యేసయ్యా..
- యేసయ్యా యేసయ్యా - మంచి యేసయ్యా..
- యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా..
- ఏ యోగ్యత లేదనుచూ నా అనువారే - ఇంటినుండి వెలివేసితిరొకనాడయ్యా..
- రోగముతో రోధిస్తూ వేదనపడుచున్ననూ - అవహేళన చేసితిరి బంధువులయ్యా..
- నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివే - నా పరమవైద్యుడ నీవయ్యా..
- యేసయ్యా యేసయ్యా - మంచి యేసయ్యా..
- యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా..
- ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి - నీ ఇంటికి చేర్చితివి ఈనాడయ్యా..
- జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా - మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి..
- నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివే - నా మంచి కాపరి నీవయ్యా..
- యేసయ్యా యేసయ్యా - మంచి యేసయ్యా..
- యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా..