Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఓ క్రైస్తవుడా - సైనికుడా - బలవంతుడా - పరిశుద్ధుడా


    • పల్లవి :ఓ క్రైస్తవుడా - సైనికుడా - బలవంతుడా - పరిశుద్ధుడా 
    •          కదలిరావోయ్ - నీవు కదలిరా 
    •          జాలరి మనుష్యుల పట్టు జాలరీ ... ఆత్మల కాయు కాపరీ 
    •          అమృతమంధించే ఆచారీ యేసుకై జీవించే పూజారి 

    •      1. సిలువే నీ స్థావరము - శ్రమలే నీ సైన్యము 
    •          సహనమే నీ ధైర్యము - సాక్ష్యమే నీ సైన్యము

    •      2. త్యాగమే నీ క్షేమము - ప్రార్థనే నీ యవ్వనము 
    •          వాక్యమే నీ బాణము - విశ్వాసమే ఉద్యమము 

    •      3. సత్యమే నీ గమ్యము - సమర్పనయే నీ శీలము 
    •          యేసే నీ కార్యక్రమము - ప్రేమే నీ పరాక్రమము 

    •      4. దేశంలో విదేశం లో - గ్రామంలో కుగ్రామంలో 
    •          అడవులలో కొండలలో - పనిఎంతో ఫలమెంతో 

    •      5. జయించి లే శరీరాన్ని - ధరించుకో శిరస్త్రాన్ని 
    •          బంధించు విషపు సర్పాన్ని - బోధించు యేసు పథకాన్ని 

    •      6. సిద్ధాంతపు గట్టు దుమికిరా - సాకులనే మెట్టులు దిగిరా 
    •         దీనుడా కాదు ధన్యుడా - విదేయుడా అజేయుడా 

    •     7. వాగ్దానపు భూమి స్వతంత్రించుకో - అధ్వాన్నపు అడవి
    •         దాటి ముందుకు పో 
    •         నీ ఇల్లే పెనూయేలు - నీ పేరే ఇశ్రాయేలు 

    •     8. సంఘమే నీ రంగ స్థలం - సహవాసమే నీ స్థానము 
    •         ఏసే  నీ నాయకుడు - శుద్దాత్ముడే దర్శకుడు 
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 5372 times