Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నింగిలోని చందురుడా - మంద కాచే ఇందురుడా


    • నింగిలోని చందురుడా - మంద కాచే ఇందురుడా - 2 
    • నిందలేని సుందరుడా - గంధమొలికే చందనుడా - 2
    • ఓ... వెన్నెలంటి చల్లని రాజా - వెన్నలాంటి మనసు నీదయ్యా - 2

    • 1. ఎర్రటి ఎండ కాల్చేస్తున్నా - గాయాలు నిన్ను బాధిస్తున్నా 
    • దాహంతో నోరు ఎండిపోతున్నా - నాలుక అంకిట అంటిపోతున్నా
    • ప్రేమతో పెంచిన - మమతలు పంచినా - నీ శ్రమ చూడలేక గుండెపగిలిన
    • తల్లిని శిష్యునికప్పగించి - నీ బాధ్యతను నెరవేర్చినావా ? - 2
    • ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత ప్రేమామూర్తి నీవయ్యా - 2

    • 2. అందాల మోముపై ఉమ్మివేయగా - నీదు గడ్డము పట్టి పీకగా
    • యూదులరాజని అపహసించగా - సిలువ దిగిరమ్మని పరిహసించగా
    • అంతా సహించి - మౌనం వహించి - బాధించువారిపై ప్రేమ చూపించి
    • ఏమిచేస్తున్నారో ఎరుగరు - క్షమించుమని ప్రార్ధించినావా - 2
    • ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత సహనం చూపినావయ్యా - 2

    • 3. లేతమొక్కలాంటి నీ దేహముపై - కొరడాలెన్నో నాట్యముచేయగా
    • మేలే చేసినా కరుణను పంచినా - కాళ్లూ, చేతులలో శీలలుకొట్టగా
    • అంతటి శ్రమలో - చెంతననిలిచి - చింతతో ఉన్న అతివల జూచి
    • నాకోసం ఏడ్వవలదని - పలికి వారిని ఓదార్చినావా - 2
    • ఓ... వెన్నెలంటి చల్లని రాజా - ఎంత కరుణామయుడ నీవయ్యా - 2
    • toilax 5mg bhalsbrand.site toilax spc
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 14226 times