Daily Bible Verse
"దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది. "
కీర్తనలు 63:1-2
Daily Bible Quote
"హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును" సామెతలు 26:16
Whats New
Whatsapp Share Feature Updated

New direct Whatsapp Share is available for Daily Verse, Quote and Devotion

Download PDF Bible

Download Telugu and English parallel bible as PDF for free on this link PDF Parallel Bible Download Here.

Download Telugu Audio Bible for free

You can now download the entire telugu audio bible for free on this link Telugu Audio Bible Download Here

Telugu Cross Reference Bible

Telugu Bible update now with Cross Reference

Telugu Audio Bible

Telugu Audio Bible is updated for all the scriptures.. Read & Listen. Now!! its Free..

Explore
Celebrating the Blessed and Glorious 10 Years of Sajeeva Vahini since 2009. Its been a decade now for Telugu Bible Online!. Thank you for your prayers and support to reach millions across the globe.
Anniversary Update: Read Telugu Bible with Chain and Cross References Online!. Click Here!. Introducing Daily Inspirations along with Daily Devotions on Home Page.
Share on Whatsapp Daily Inspiration

నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది (ఫిలిప్పీ 4:18).

నా వద్ద ఉన్న తోటపని పుస్తకం ఒక అధ్యాయంలో 'నీడలో పెరిగే పూలు' గురించి ఉంది. తోటలో ఎప్పుడూ సూర్యరశ్మి పడని భాగాలను ఎలా ఉపయోగించాలి అనే విషయం గురించి అందులో వ్రాసి ఉంది. కొన్నికొన్ని పూజాతులు ఇలాటి చీకటికీ, మారుమూల ప్రాంతాలకీ భయపడవట. నిజానికి అలాటి చోట్లనే అవి బాగా పుష్పిస్తాయట.

ఆత్మీయ ప్రపంచంలో కూడా ఇలాటివే ఉంటాయి. ఇహలోకపు పరిస్థితులు విషమించినప్పుడే అవి పుష్పిస్తాయి. అవి దిగులుమబ్బు కమ్మి మసకేసినప్పుడే విరబూస్తాయి. అపొస్తలుడైన పౌలు అనుభవాలు కొన్ని మనకు అర్థం కావాలంటే ఇదే మార్గం.

పౌలు రోమ్ లో ఖైదీగా ఉన్నాడు. అతని జీవితాశయం వమ్మయిపోయింది. అయితే ఇప్పుడే కమ్ముకుంటున్న ఈ మసక చీకట్లోనే ఆత్మ పుష్పాలు రంగులు విరజిమ్ముతూ తలలెత్తుతున్నాయి. జీవితంలో ఆ పూలు పూయడాన్ని పౌలు చూసి ఉంటాడు కాని ఇంత ఆకర్షణీయంగా కళ్లు జిగేలుమనిపించే రంగులతో విరబూయడం ఎన్నడూ చూడలేదు. ఇంతకు ముందెన్నడూ లేనన్ని వాగ్దాన సంపదలు పౌలును ఆహ్వానిస్తున్నాయి.

ఈ సంపదల్లో క్రీస్తు కృప, ఆయన ప్రేమ, ఆయన ఇచ్చే శాంతి, ఆనందం ఇలాంటివి ఉన్నాయి. అయితే వాటి నిజస్వరూపం వాటిలో దాగియున్న మహిమ, మసక చీకటి కమ్మినప్పుడే బయటకు ప్రకాశిస్తాయి. చీకటి లోయలే దేవుని మహిమ వెల్లడయ్యే అరుణోదయాలౌతాయి. ఈ ఆత్మీయ సిరులను పౌలు క్రమంగా సంపూర్ణంగా గుర్తించడం మొదలుపెట్టాడు.

ఒంటరితనం బాధలు కమ్ముకున్నప్పుడే శక్తిని, నిరీక్షణను వస్త్రాల్లాగా ధరించుకొన్న స్త్రీ పురుషులెంతమందో మనకు తెలుసు. అలాటి వాళ్ళను మీ ఇష్టం వచ్చిన చోట బంధించవచ్చు. కాని వాళ్ళ సంపదలెప్పుడూ వాళ్ళతోనే ఉంటాయి. వాటిని వారినుండి వేరు చెయ్యలేము. వారికున్న సమస్తాన్నీ నాశనం చెయ్యవచ్చు. అయితే వారి ఎదుట ఎడారి ప్రదేశం, ఒంటరితనం ఉత్సాహంతో గంతులు వేస్తాయి. అరణ్య ప్రాంతాలు గులాబీల్లా వికసించి ఆనందిస్తాయి.

ప్రతి పుష్పమూ అది సూర్యకాంతిలో అటూ ఇటూ ఊగేటప్పుడు దాని నీడ ఎక్కడో ఒక చోట పడుతూనే ఉంటుంది. ప్రతి పువ్వుకీ నీడ ఉంటుంది.

వెలుగు ఉన్న చోటెల్లా నీడ కూడా ఉంటుంది.

Share on Whatsapp Daily Devotion - సహోదరులు ఐక్యత కలిగి యుండుట ఎంత మేలు
 • ఒకరోజు ఒక అడవిలో నాలుగు ఎద్దులు ఒక చోట గడ్డి మేస్తూ వున్నాయి.........
 • కొంతసేపటికి అక్కడికి ఒక సింహం వచ్చింది. వాటిని చూసి వాటిపై కన్నేసింది..
 • అయితే అవి ఎంత సేపైనా ఒక్కటిగా ఒకచోటనే మేస్తూ వున్నాయి..
 • ఏమి చేయలేక సింహం ఆలోచిస్తుండగా అటు వైపు ఒక జిత్తులమారి నక్క వచ్చింది..
 • సింహానికి ఒక మంచి ఆలోచన వచ్చి నక్కను పిలచి నక్కకు దాని పధకాన్నివివరించింది.
 • నక్క దానికి సరేనని పధకాన్ని అమలు చేసేందుకు వాటికి దగ్గరగా వెళ్ళింది.
 • అది వెళ్లి.. ముందుగా ఆ గుంపులోని దాని రాకను గమనిస్తున్న ఒక ఎద్దును దగ్గరగా రమ్మని పిలిచింది.
 • అది నక్క దగ్గరకు వెళ్ళింది.. వెళ్ళాక దాని చెవిలో నక్క ఏమీ లేదు అని చెప్పింది.
 • అర్ధం కాక అది మరల అడిగేప్పటికి మరలా చెవిలో ఏమీ లేదు అంది.
 • సరేనని అది వెళ్ళిపోయి మిగతావాటితో చేరి, మేస్తూ వుంది. అయితే ఆ గుంపులో మిగతావి ధీనిని నక్క చెవిలో ఏం చెప్పిందని ప్రశ్నించాయి..
 • ఏమీ లేదని చెప్పింది అనగానే వాటికి అర్ధం కాక మరలా అడిగాయి .....అలానే చెప్పింది అంది..
 • అయితే వీటికి బాగా కోపం వచ్చి నువ్వు అబద్దం చెప్తున్నావ్..
 • మీరిద్దరూ మా మీదనే ఏదో చెప్పుకున్నారు... ఏమి చెప్పిందో చెప్పు అంటూ గొడవకు దిగాయి.
 • ఇది వాటికి చెప్పి చెప్పి, ఇక వాదించలేక దూరంగా వెళ్లి పోయి వేరొక చోట గడ్డి మేయసాగింది.
 • దీని కోసమే ఎదురుచూస్తున్న సింహం దానిని గమనించి వెంటాడి వెంటాడి చంపి తినేసింది..
 • చివరిలో మిగిలిన మాంసాన్ని నక్క వచ్చి ఆరగించింది.
 • ఇలా అవి రెండూ రోజుకొక ఎత్తుని వేసి దున్నలను వేరు చేసి అన్నిటినీ తినేశాయి..
 • Moral:
 • ఫ్రెండ్స్.....
 • ఇది చిన్న పిల్లల నీతి కదే అయినప్పటికీ.... దీని నుండి మనం తెలుసుకోవాల్సింది చాలా వుంది...
 • ఆ ఎద్దులు ఎపుడైతే ఒకటిగా ఒక చోటనే వున్నాయో శత్రువైన సింహానికి వాటిని వేటాడడానికి శక్తి చాలలేదు...
 • అందుకే ఏమీ చేయలేకపోయింది..అయితే ఎపుడైతే నక్క ఒక్కొక్కదాని దాని కుయుక్తితో మోసం చేసి మబ్యపరచి
 • వాటిలో వాటికే తగాదాలు, విభేదాలు సృష్టించిందో అవి ఒక్కొక్కటిగా వేరై పోయి శత్రువు చేతికి చిక్కోపోయాయి
 • అలానే మన విశ్వాస సహవాస జీవితంలో క్రీస్తులో మనందరం ఐక్యత కలిగి ఎప్పుడైతే ఒక్కటిగా జీవిస్తామో
 • అపుడు గర్జించు సింహం వంటి సాతాను మనల్ని ఏమీ చేయలేదు
 • కాని అదే మనం మోసపూరితమైన లోకపు మాటల వైపు ద్రుష్టిస్తామో మనలను వాడు వంచించి పతనం చేస్తాడు.
 • మనం చాలా జాగ్రత్తగా వుండాలి, మన శత్రువైన సాతాను ఎవరిని మ్రింగుదునా అని ఘర్జించు సింహం వలె చూస్తున్నాడు,
 • పొరపాటున ఏ విషయం లో నైన చిక్కామా ?.. అంతే ఈడ్చుకుని తీసుకెళ్ళిపోతాడు లోకంలోకి..
 • అన్ని వేళలా అన్ని చోట్లా అన్ని విషయాల్లో చాలా ఆచి తూచి నడవాలి..
 • అన్నిటి కంటే ముందు మనం ఐక్యతను విడువకూడదు.
 • సహోదరులు ఐక్యత కలిగి యుండుట ఎంత మేలు.. ఎంత మనోహరమూ...