Daily Bible Verse
"మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెల విచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింప జేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను. "
యెషయా 57:15
Daily Bible Quote
"పరాక్రమశాలికంటె దీర్ఘశాంతముగలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొనువానికంటె తన మనస్సును స్వాధీన పరచుకొనువాడు శ్రేష్ఠుడు" సామెతలు 16:32
Whats New
Whatsapp Share Feature Updated

New direct Whatsapp Share is available for Daily Verse, Quote and Devotion

Download PDF Bible

Download Telugu and English parallel bible as PDF for free on this link PDF Parallel Bible Download Here.

Download Telugu Audio Bible for free

You can now download the entire telugu audio bible for free on this link Telugu Audio Bible Download Here

Telugu Cross Reference Bible

Telugu Bible update now with Cross Reference

Telugu Audio Bible

Telugu Audio Bible is updated for all the scriptures.. Read & Listen. Now!! its Free..

Explore
Celebrating the Blessed and Glorious 10 Years of Sajeeva Vahini since 2009. Its been a decade now for Telugu Bible Online!. Thank you for your prayers and support to reach millions across the globe.
Anniversary Update: Read Telugu Bible with Chain and Cross References Online!. Click Here!. Introducing Daily Inspirations along with Daily Devotions on Home Page.
Share on Whatsapp Daily Inspiration

తనయెడల యథార్దహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది (2 దిన 16:9).

తనమీద మనసంతా నిలుపుకుని, తన మాటల్ని నమ్మకంతో అనుసరించే స్త్రీ పురుషుల కోసం దేవుడు వెదుకుతున్నాడు. ఆత్మల ద్వారా గొప్ప పనులు చెయ్యాలని ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఆయన తహతహలాడుతున్నాడు. శతాబ్దాల గడియారం ఇక చివరి గంట కొట్టబోతున్నది.

నిజంగా నిష్టగల హృదయం సహాయంతో దేవుడు ఎన్నెన్ని పనులు చేయించగలడో ఇంకా ప్రపంచం చూడలేదు. ప్రపంచమే కాదు, దేవుడికే ఇంకా ఈ ఛాన్సు రాలేదు. ఇంతకు ముందు జీవించి గతించిపోయిన వాళ్ళందరికంటే ఇంకా సంపూర్ణంగా తన పట్ల భయభక్తులు గలిగి ఉండేవారు ఎవరైనా కనిపిస్తారేమోనని దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు. తనను తాను పూర్తిగా తగ్గించుకొని క్రీస్తుకే పూర్ణాధికారం ఇచ్చేవారి కోసం, దేవుని ఉద్దేశాలను సంపూర్తిగా పుణికి పుచ్చుకునేవారి కోసం, ఆయన విధేయతను, ఆయన విశ్వసనీయతను, ఆయన ప్రేమను, శక్తిని ఆసరాగా చేసుకొని, తన ద్వారా ఏ ఆటంకమూ లేకుండా సాహస కార్యాలు చెయ్యడానికి సహకరించే వ్యక్తుల కోసం ఆయన వెదకుతున్నాడు.

మహిమ తనకు కూడా చెందాలని పేచీ పెట్టని వ్యక్తితో దేవుడు చేయించలేనిది ఏమీలేదు.

తన 90వ పుట్టిన రోజున సువార్తికుల, పాస్టర్ల సమావేశంలో జార్జి ముల్లర్ తన గురించి ఈ విధంగా చెప్పుకున్నాడు - "నేను నవంబరు 1825లో మారుమనస్సు పొందాను. కాని నాలుగు సంవత్సరాల తరువాత మాత్రమే అంటే జూలై 1829లో నా హృదయాన్ని ప్రభువుకు పూర్తిగా సమర్పించే స్థితికి వచ్చాను. డబ్బు గురించిన ఆశ, పరువు, ప్రతిష్టల గురించి తాపత్రయం పోయింది. ఇహలోక విలాసాల మీద మోజు పోయింది. దేవుడు, కేవలం దేవుడే నాకు సమస్తం అయ్యాడు. నాకు కావలసినదంతా ఆయనలోనే దొరికింది. మరింకేదీ నేను కోరలేదు. దేవుని కృపవల్ల ఆ తృప్తి అలాగే ఇప్పటి దాకా ఉండిపోయింది. నన్ను పరమానందభరితుడిగా ఉంచింది. దేవునికి సంబంధించిన విషయాల గురించే పట్టించుకోవడానికి నాకు సహాయం చేసింది. " నా ప్రియ సహోదరులారా, మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నాను. దేవునికి మీ హృదయాలు పూర్తిగా అప్పజెప్పారా? లేక ఆ విషయమూ, ఈ విషయమూ దేవునితో నిమిత్తం లేకుండా మీ మనసులో ఇంకా ఉన్నాయా? నేను అంతకు ముందు కొంతమట్టుకు బైబిలు చదివేవాడిని గాని ఇతర పుస్తకాలు ఇంకా ఇష్టంగా చదివేవాణ్ణి. కాని తరువాతి కాలంలో ఆయన తన గురించి తాను చెప్పుకున్న వాక్యం నాకు చెప్పలేంత ఆశీర్వాదాన్నిచ్చింది. నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. దేవుడు ఎంత ప్రేమామయుడో వర్ణించతరం కాదు. మీరు కూడా మీ అంతరంగాలలో దేవుడు ఎంత ప్రేమామయుడో రుచి చూసేదాకా సంతృప్తిపడి ఊరుకో కూడదు.

నన్ను అసాధారణమైన క్రైస్తవునిగా చెయ్యమని ఈరోజే దేవుణ్ణి ప్రార్థిస్తాను.

Share on Whatsapp Daily Devotion - ఓ అనామకురాలు

ఊజు దేశస్తుడైన యోబు యథార్ధవంతుడు, న్యాయవంతుడు దైవభక్తిగలవాడు. చెడుతనమును విసర్జించినవాడైయుండి భూమి మీద అతనివంటి వాడు లేడని దేవునితో మెప్పుపొందిన వ్యక్తి. ఇతని సతీమణి పేరు గ్రంథం లో ఎక్కడ కూడా వ్రాయబడలేదు కేవలం యోబు భార్య గానే పిలువబడింది. వీరికి ఏడుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలున్నారు. ఏడువేల గొర్రెలు, మూడువేల ఒంటెలు, అయిదువందల జతల ఎడ్లు (అనగా వెయ్యి ఎడ్లు ) అయిదువందల ఆడ గాడిదలూ యింకా అనేకమంది దాసదాసీజనం కలిగి తూర్పు దేశంలో అందరికంటె ఘనంగా ఎంచబడినాడు.

యోబు దేవుని అధికంగా ప్రేమించాడు. అతని ఆధ్యాత్మిక జీవితాన్నిబట్టి అతని కుటుంబ సభ్యులు ఇంత ఇక్యమత్యంగా జీవించగలిగారు. యోబు యొక్క సత్ప్రవర్తనవల్లనే సమస్తమునూ పొందగలుగుచున్నాడని ఇరుగు పోరుగునున్నవారు గ్రహించారు. తన భర్త కుటుంబ భోగభాగ్యాలకు యోబు భార్య ఎంతగానో మురిసిపోతువుండేది.

ఈ కుటుంబ సంపద, ఐక్యత సాతానుకు నచ్చలేదు. చెరుపు చేయడమే వాని నిత్యకృత్యం. దేవుని నుండి ఉత్తర్వులు పొందిన సాతాను దెబ్బపై దెబ్బ కొడుతూ యోబు సంపదను ఆపై అతని సంతతిని నాశనపరచింది. ఇల్లు, భార్య, నలుగురు పనివారు మాత్రమే అతనికి మిగిలియుండిన, ఆస్తిపాస్తులు. సర్వాన్ని కోల్పోయినా దేవుని మాత్రం విడువలేదు. దైవధ్యానం మరువలేదు. ప్రాణం తప్ప సమస్తాన్ని తన స్వాధీనంలోకి తీసుకున్న సాతాను యోబు భక్తుణ్ణి ఓ భయంకరమైన చర్మవ్యాధి తో మొత్తింది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులు, బొబ్బలు కలిగాయి. పట్టుపరుపులపై కూర్చునే అతను పెంటకుప్పలలో కూర్చుండే పరిస్థితి ఏర్పడింది. ఇది కడు దయనీయ స్థితి అందుకే కొందరు క్రైస్తవులు తమకు కష్టాలు కలిగినప్పుడు యోబు భక్తుని గుర్తుచేసుకుంటారు. దేవునియందు భక్తి విశ్వాసములులేని యోబు దుస్థితిని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇంకా నీవు యథార్ధతను విడిచి పెట్టావా అని గద్దించి అడిగింది. దేవుని దూషించి మరణము కమ్మని ఉచిత సలహాలెన్నో ఇచ్చింది. కష్ట సమయంలో తోడునీడగా ఉండవలసిన అర్థాంగి, వాడి అయిన మాటలతో అతని కించపరచింది.

అయినా యోబు చలించలేదు. దేవునిపై అతనికున్న భక్తి అచంచలమైనది. అవిశ్వాసి అయిన అతని భార్య జరిగిన నష్టాలను భరించలేకపోయింది. స్త్రీ సహజ గుణాలయిన ప్రేమ, కరుణ, క్షమాగుణాలను మంటగలిపింది. అందుకే పౌలు భక్తుడు తన గ్రంథములో ఇలా సెలవిచ్చాడు “క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగసంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గ్రుడ్డి తనము కలుగజేసింది” ( IIకోరింతీ 4:4) చీకటివెంట వెలుగులా దేవుడు యోబును తిరిగి దీవించాడు. యథావిధిగా ఏడుగురు కుమారులను, కుమార్తెలను అనుగ్రహించాడు. మునుపటికంటే రెట్టింపు పశుసంపదను ఇచ్చి దీవించాడు. తాత్కాలికంగా సాతాను పెట్టే బాధలు పడడాన్ని తట్టుకోలేని యోబు భార్య తన భర్తను తూలనాడింది దైవ దూషణ చేయడానికికూడా వెనుకాడలేదు. దేవుడు కొన్నిసార్లు తన బిడ్డలమీదికి బాధలు, కష్టాలు పంపినా అవి కేవలము బాధకోసము మాత్రమే కాక మంచి ఫలాలను ఫలించాలనే ఆయన ఉద్దేశమైయున్నది. కాని యోబు భార్య ఈ సత్యాన్ని గ్రహించాలేకపోయింది. మనము బాధలు పరంపరగా వచినప్పుడు ఓర్చుకోలేని స్థితిలో దైవదూషణ చేస్తూఉంటాము. అది మంచిది కాదని ప్రతివారు గ్రహించాలి.

methotrexat grapefruit methotrexat 30 mg methotrexat 7 5