Our Mission:
మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము. II కొరింథీ 3:18

For more information 8898 318 318
Daily Bible Verse
"నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవముల లోను నేను సంతోషించుచున్నాను. "
2 కోరింథీయులకు 12:10
Daily Bible Quote
"నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ," సామెతలు 30:18
Whats New
Whatsapp Share Feature Updated

New direct Whatsapp Share is available for Daily Verse, Quote and Devotion

Download PDF Bible

Download Telugu and English parallel bible as PDF for free on this link PDF Parallel Bible Download Here.

Download Telugu Audio Bible for free

You can now download the entire telugu audio bible for free on this link Telugu Audio Bible Download Here

Telugu Cross Reference Bible

Telugu Bible update now with Cross Reference

Telugu Audio Bible

Telugu Audio Bible is updated for all the scriptures.. Read & Listen. Now!! its Free..

Explore
Sajeeva Vahini Whatsapp Subscription
Share on Whatsapp Daily Inspiration

యెహోవా సెలవిచ్చునదేమనగా - గాలియే గాని వర్షమే గాని రాకపోయినను, మీరును మీ మందలును మీ పశువులును త్రాగుటకు ఈ లోయ నీళ్ళతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే, ఆయన మోయాబీయులను మీచేతికి అప్పగించును (2రాజులు 3:17-18).

మానవపరంగా ఇది అసాధ్యమే. అయితే దేవునికి అసాధ్యమైనదేదీ లేదు.

చడీ చప్పుడు లేకుండా, కనిపించని వైపునుంచి అసాధ్యమనుకున్న మార్గంలో ఆ రాత్రిలో నీళ్ళు వరదలా వచ్చేసాయి. తెల్లవారినప్పుడు స్వచ్ఛమైన నీళ్ళతో ఆ లోయంతా నిండింది. ఎర్రటి ఆ ఎదోము కొండలు సూర్యకాంతిలో ప్రతిబింబించినాయి. మన అపనమ్మకం ఎప్పుడూ ఏదో ఒక సూచకక్రియ కనబడాలని చూస్తుంటుంది. మతం అంటే అదేదో అలజడి కలిగించే తతంగంలా ఉండాలని చాలామంది అభిప్రాయం. మతపరంగా ఏవేవో మహాత్కార్యాలు జరుగుతూ ఉంటేనే అది సరైన మతం అనుకుంటారు కొందరు. కాని విశ్వాసంలో ఘనవిజయం ఏమిటంటే ఊరకుండి ఆయన దేవుడని తెలుసుకోగలగడమే.

విశ్వాస విజయమేమిటంటే దాటరాని ఒక ఎర్రసముద్రం ఒడ్డున నిలబడి "ఊరక నిలబడి ప్రభువు ఇవ్వబోయే రక్షణను చూడు" అంటున్న దేవుని మాటల్ని వినడమే. "ముదుకి సాగిపో'' అనే మాట వినబడగానే మరేవిధమైన చప్పుడూ, సూచనా లేకపోయినా, మన పాదాలు తడిసినా మొదటి అడుగు సముద్రంలోకి వెయ్యడమే. నడిచిపోతూ ఉంటే సముద్రం రెండుగా చీలి అగాధ జలాల్లోగుండా దారి ఏర్పడుతుంది.

మీరు ఇంతకుముందు ఏదైనా దైవసంబంధమైన మహాత్కార్యాన్నో, స్వస్థతనో కన్నులారా చూసి ఉన్నట్టయితే మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరచినది ఆ నిశ్శబ్దమే. ఏ హడావుడీ లేకుండా మౌనంగా మామూలుగా ఆ వింత జరిగిపోయిన తీరేనని నిస్సందేహంగా చెప్పగలను. అక్కడ ఆడంబరంగాని కళ్ళు మిరుమిట్లు గొలిపే సన్నివేశాలు గాని లేవు. మన సర్వశక్తుడైన దేవుని సన్నిధిలో శూన్యమైపోయిన హృదయంతో నిలబడి ఇదంతా చెయ్యడం ఆయనకి ఎంత తేలికైన పనో, ఎవరి సహాయమూ లేకుండా ఎంత సునాయాసంగా చెయ్యగలిగాడో తలుచుకున్నాము.

విశ్వాసం ప్రశ్నించదు, లోబడుతుంది, అంతే. సైనికులంతా కలిసి గుంటలు త్రవ్వారు. నీటిని మాత్రం పైకి తెచ్చేది మానవాతీతమైన శక్తి. ఇది విశ్వాసాన్ని పురిగొల్పే పాఠం.

ఆత్మీయమైన ఆశీర్వాదం కోసం వెదుకులాడుతున్నావా? గుంటలు త్రవ్వండి. దేవుడు వాటిని నింపుతాడు. మనం ఊహించని స్థలాల్లో ఊహించని రీతుల్లో ఈ అద్భుతాలు జరుగుతాయి.

కనిపించేదాన్నిబట్టి కాక విశ్వాసాన్నిబట్టే పనులు చేసే స్థితి రావాలి. వర్షంగాని, గాలి గానీ లేకపోయినా దేవుడు గుంటల్లో నీళ్ళు నింపుతాడని ఎదురు చూడగలగాలి.

Share on Whatsapp Daily Devotion - యేసు శుక్రవారమున సిలువవేయబడినారా?

యేసయ్య ఏ రోజున సిలువవేశారు అనేది బైబిలు స్పష్టముగా ప్రస్తావించుటలేదు. అతి ఎక్కువగా ప్రాతినిధ్యం వహించిన రెండు దృక్పధాలు. ఒకటి శుక్రవారమని మరొకటి బుధవారమని. మరికొంతమంది ఈ రెండింటిని శుక్ర, బుధవారమును సమ్మేళనము చేసి మరొకరు గురువారమని కూడా ఆలోచించటం జరుగుతుంది.

మత్తయి 12:40 యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో వుండును అని యేసు చెప్పెను. శుక్రవారము సిలువవేయబడ్డాడు అని వాదించేవారు ఆయన మూడు దినములు సమాధిలో నుండటం సబబని, సాధ్యమని నమ్ముతారు. మొదటి శతాబ్ధపు యూదామనస్సునకు ఒక దినములోని భాగమును కూడా పూర్తి దినంగా లెక్కిస్తారు. యేసు సమాధిలో శుక్రవారమున కొంతభాగము, పూర్తి శనివారము, ఆదివారమున కొంతభాగము నున్నారు. కాబాట్టి మూడు దినాలు సమాధిలోనున్నట్లు గుర్తించవచ్చు. యేసుక్రీస్తు శుక్రవారమే సిలువవేయబడ్డాడు అన్న వాదనకు ప్రాముఖ్యమైన ఆధారమే మార్కు 15:42 విశ్రాంతిదినమునకు పూర్వదినము. అది సాధారణమైనటువంటి విశ్రాంతిదినము సబ్బాతు అయినయెడల శనివారమై యుండాలి. అప్పుడు సిలువవేయటం అనేది శుక్రవారమే జరిగియుండాలి. శుక్రవారమే అని విచారించేవారు మత్తయి 16:21 మరియు లూకా 9:22 భోధిస్తున్నట్లుగా యేసు తాను మూడవదినమున తిరిగిలేస్తాననాడు. కాబట్టి మూడు పూర్తి పగలు, రాత్రులు సమాధిలో నుండాల్సిన అవసరంలేదు. అయితే మరికొన్ని అనువాదములు మూడవదినమున అని ఈ వచనాలకు వాడినప్పటికి అందరు సబబు అని అంగీకరించరు. మరియు మార్కు 8:31 లో క్రీస్తు మూడు దినాల తర్వాత లేపబడును అని వున్నది.

గురువారము అని వాదించేటటువంటివారు క్రీస్తు సమాధి చేయబడటానికి ఆదివారము తెల్లవారు ఝామున మధ్యన అనేక సంఘటనలు వున్నాయి(కొంతమంది 20 అని లెక్కపెడతారు). కాబట్టి అది శుక్రవారము కాకపోవచ్చని అంటారు. మరొక సమస్య ఏమనగా శుక్రవారమునకు, ఆదివారమునకు మధ్యన పూర్తి దినము శనివారము అనగా యూదుల సబ్బాతు అవ్వటం. కాబట్టి వేరు ఒకటిగాని, రెండుగాని పూర్తిదినాలుండినయెడల ఈ సమస్తాన్ని తుడిచి పెట్టొచ్చు. గురువారం అని వాదించేవారు ఈ హేతువును చూపిస్తారు.- ఒక స్నేహితుడ్ని శుక్రవారం సాయత్రంనుండి చూడనట్లయితే ఆ వ్యక్తిని గురువారం ఉదయం చూచినట్లయితే గత మూడు రోజులుగా నిన్ను చూడటంలేదు అని అనడం సబబే. కాని అది కేవలం 60 గంటలు మాత్రమే (2.5దినాలు). ఒకవేళ గురువారం సిలువవేయబడినట్లయితే మూడు రోజులు అనటానికి ఈ ఉదాహరణ వుపయోగిస్తారు.

బుధవారం అని అభిప్రాయపడేవాళ్ళు ఆ వారంలో రెండు సబ్బాతులున్నాయని పేర్కోంటారు. మొదటి సబ్బాతు తర్వాత (సిలువ వేసిన సాయంత్రంనుండి ఆరంభమైంది[మార్కు 15:42; లూకా 23:52-54]), స్త్రీలు సుగంధ ద్రవ్యములు కొన్నారు. - వారు సబ్బాతు తర్వాత ఆ పనిచేసారని గుర్తించుకోవాలి (మార్కు 16:1). బుధవారమని అభిప్రాయపడేవారు ఈ సబ్బాతుని పస్కాదినము అని అంటారు(లేవికాండం 16:29-31, 23:24-32, 39 ప్రకారము అతి పవిత్రమైనటువంటి దినము వారములో ఏడవదినం అవ్వాల్సిన అవసరంలేదు). ఆ వారంలో రెండో సబ్బాతు ఏడవదినమున వచ్చింది. లూకా 23:56 లో పేర్కోన్నట్లు స్త్రీలు మొదటి సబ్బాతు తర్వాత సుగంధద్రవ్యములు కొన్నారు. అవి సిధ్దంచేసిన తర్వాత సబ్బాతు దినమున విశ్రమించారు. సబ్బాతు తర్వాత సుగంధద్రవ్యములుకొని, సబ్బాతు తర్వాత అది సిద్డపరచటం అనేది రెండు సబ్బాతులు లేకపోతే సాధ్యమయ్యేది కాదు అనేదే వాదన. రెండు సబ్బాతులున్నావని అనే దృక్పధములో క్రీస్తు గురువారం సిలువవేయబడినట్లయితే (అనగా పవిత్రమైన సబ్బాతు దినమున (పస్కా) గురువారం సాయంత్రం ఆరంభమయ్యి శుక్రవారం సాయత్రంతో అంతమయి ఉండేది. శుక్రవారం సాయంత్రం వారాంతర సబ్బాతు ఆరంభమవుతుంది. మొదటి సబ్బాతు తర్వాత(పస్కా) స్త్రీలును ద్రవ్యములుకొనినట్లయితే అదే శనివారం సబ్బాతుని అయితే అ సబ్బాతు దినాన్ని వారు ఉల్లఘించారు.

కాబట్టి బుధవారమే సిలువవేయబడ్డాడు అనే వివరణ యిచ్చేవారు ఒకేఒక ఉల్లఘించని బైబిలు వచనము స్త్రీలును సుగంధ ద్రవ్యములు తీసుకు రావటం మత్తయి 12:40 ని యధాతధంగా తీసుకోవటం. ఆ సబ్బాతు అతి పవిత్రమైన దినము అనగా గురువారము మరియు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు కొనటానికి శుక్రవారము వెళ్ళి తిరిగి వచ్చి అదేదినాన్న సిద్దపరచి శనివారం అనగా యధావిధంగావుండే సబ్బాతు దినాన్ని విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత ఆదివారం సుగంధ ద్రవ్యాలు సమాధి దగ్గరకు తీసుకు వచ్చారు. యేసయ్యా బుధవారం సూర్యస్తసమయంలో సమాధి చేయబడ్డారు. అనగా యూదాకాలమాన ప్రకారం గురువారం ఆరంభమైంది. యూదాకాలమానాన్ని తీసుకున్నట్లయితే మూడు పగలు మూడు రాత్రులు, గురువారం రాత్రి (మొదటి రాత్రి), గురువారం పగలు (మొదటి పగలు), శుక్రవారం రాత్రి(రెండవ రాత్రి) శుక్రవారం పగలు (రెండవ పగలు), మరియు శనివారం రాత్రి (మూడవ రాత్రి) శనివారం పగలు (మూడవ పగలు) అని గుర్తించగలం. ఆయన ఎప్పుడు తిరిగి లేచాడో తెలియదు కాని ఆదివారం సూర్యోదయానికి ముందు అని మాత్రం ఖచ్చితముగా చెప్పగలం ( యోహాను 20:1 ఇంకా చీకటి ఉండగనే మగ్ధలేనే మరియ వచ్చెను).కాబట్టి శనివారం సూర్యాస్తసమయం తర్వాత యూదుల వారానికి తొలి దినాన్నా ఆయన లేచియుండాలి.

లూకా 24:13 బుధవారం అని వాదించేవారు ఒక విషయములో సమస్యను ఎదుర్కొంటారు. అదేమనగా ఎమ్మాయి గ్రామము గుండా అయనతో నడచినటువంటి శిష్యులు ఆయన పునరుత్ధానమైన అదేదిన్నాన్న జరిగియుండాలి. యేసయ్యను గుర్తుపట్టనటువంటి శిష్యులు యేసయ్య సిలువ గురుంచి చెప్పారు (లూకా 24:21). ఆ సంధర్భములో ( లూకా 24:21)ఇదిగాక ఈసంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను. అయితే బుధవారం నుండి ఆదివారంవరకు నాలుగు దినములు. దీనికి ఇవ్వగలిగేటటువంటి ఒక భాష్యం ఏదనగా బహుశావారు బుధవారం సాయత్రం క్రీస్తు సమాధి చేయబడ్డాడని అంటే యూదుల ప్రకారము గురువారము అంటే గురువారంనుండి ఆదివారంవారానికి మూడు దినాలు.

ఈ మహా ప్రణాళికలో క్రీస్తు ఏ దినమున సిలువ వేయబడ్డాడు అనేది అంతా ప్రాముఖ్యముకాదు. ఒకవేళ అదే ప్రాముఖ్యమైనట్లయితే దేవుని వాక్యములో వారము, దినము బహుస్పష్టముగా వివరించబడియుండేది. ఆయన మరణించి భౌతికంగా మృతులలో నుండి తిరిగి లేచాడనేది అతి ప్రాముఖ్యము.దీనితో సమానమైనటువంటి ప్రాధాన్యతకలిగింది. ఆ ప్రక్రియ కారణము- పాపుల శిక్షను ఆయన మరణముద్వారా తనమీద వేసుకున్నాడు, యోహాను 3:16 మరియు 3:36 ప్రకారము ఎవరైతే ఆయనయందు విశ్వాసముంచుతారో వారు నిత్య జీవము కలిగియుంటారు. బుధవారమా, గురువారమా లేక శుక్రవారమా ఆయన మరణించిన దీనికి సమానమైనటువంటి ప్రాధాన్యత వుంది.