Daily Bible Verse
"మీరు యెహోవాకు యాజకులనబడుదురు వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు వారి ప్రభావమును పొంది అతిశయింతురు "
యెషయా 61:6
Daily Bible Quote
"నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును" సామెతలు 16:18
Whats New
Whatsapp Share Feature Updated

New direct Whatsapp Share is available for Daily Verse, Quote and Devotion

Download PDF Bible

Download Telugu and English parallel bible as PDF for free on this link PDF Parallel Bible Download Here.

Download Telugu Audio Bible for free

You can now download the entire telugu audio bible for free on this link Telugu Audio Bible Download Here

Telugu Cross Reference Bible

Telugu Bible update now with Cross Reference

Telugu Audio Bible

Telugu Audio Bible is updated for all the scriptures.. Read & Listen. Now!! its Free..

Explore
Celebrating the Blessed and Glorious 10 Years of Sajeeva Vahini since 2009. Its been a decade now for Telugu Bible Online!. Thank you for your prayers and support to reach millions across the globe.
Anniversary Update: Read Telugu Bible with Chain and Cross References Online!. Click Here!. Introducing Daily Inspirations along with Daily Devotions on Home Page.
Share on Whatsapp Daily Inspiration

నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున . . . నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను . . . నీవు నా మాట వినినందున (ఆది 22:16, 18).

ఆ రోజునుండి ఈ రోజుదాకా మనుషులు ఒక విషయాన్ని పదేపదే చూస్తూ నేర్చుకుంటూ వస్తున్నారు. అదేమిటంటే, దేవుని ఆజ్ఞ మేరకు తమకు అత్యంత ప్రీతిపాత్రమైన ఒక వస్తువును ఆయనకు సమర్పించినట్టయితే అదే వస్తువు వాళ్ళకి వెయ్యి రెట్లు తిరిగి లభిస్తుంది. అబ్రాహాము దేవుని పిలుపు విని తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చేశాడు. దీనితో 'ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడౌతాడు. తన వంశం విస్తరిస్తుంది' అన్న ఆశలన్నీ సమూలంగా తుడిచిపెట్టుకు పోయినై. కానీ ఆ పిల్లవాడు తిరిగి తనకు దక్కాడు. కుటుంబం నక్షత్రాల్లాగా, ఇసుక రేణువుల్లాగా విస్తరించింది. కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ కుటుంబంలోనుంచే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.

తన పిల్లలు చేసే నిజమైన త్యాగాలను దేవుడు స్వీకరించే తీరు ఇదే. మనం అన్నీ ఆయనకిచ్చేసి పేదరికాన్ని కొనితెచ్చుకుంటాము -ఆయన మనకు సంపదలు పంపిస్తాడు. మనకు చేతకాదనుకుని ఓ గొప్ప సేవాభారాన్ని మనం త్యజిస్తాం - అందుకాయన మనం కలలో కూడా ఊహించని మరింత గొప్ప సేవా బాధ్యతను మనపరం చేస్తాడు. మనకున్న ఆశలన్నీ వదిలేసుకుని రాగద్వేషాలకు అతీతులమౌతాం. ప్రతిగా ఆయన అపురూపమైన ఆనందాలు నిండిన సమృద్ధి జీవితాన్ని అనుగ్రహిస్తాడు. అవన్నీ కాక మన కిరీటంగా క్రీస్తు మనతో ఎప్పుడూ ఉన్నాడు. అబ్రాహాము చేసినట్టు ఆ సంపూర్ణమైన త్యాగం మనం చెయ్యకపోతే క్రీస్తులో మనకు దొరికే సమృద్ధి జీవితాన్ని ఎన్నటికీ రుచి చూడలేం. క్రీస్తు జీవితచరిత్రకు ఇహలోకపరంగా మూలపురుషుడైన అబ్రాహాము దీన్నంతటినీ తన ఒక్కగానొక్క కుమారుణ్ణి వదులుకోవడం ద్వారా ప్రారంభించాడు. పరలోకపు తండ్రి కూడా ఇదే విధంగా తనకున్న ఏకైక కుమారుణ్ణి త్యాగం చేశాడు కదా. ఈ విధంగా కాక మరేవిధంగానూ మనం ఆ కుటుంబానికి వారసులం కాలేం. మనకు అతి ప్రియమైనదాన్ని అవసరమైతే దేవునికి ఇచ్చివేయడం ద్వారానే తప్ప ఆ కుటుంబంలో సభ్యులుగా మనకు అన్ని సౌకర్యాలూ, హక్కులూ సమకూరవు.

దేవుడు మననుండి ఏదన్నా అడిగాడంటే సాధారణంగా అది మనకు చాలా బాధాకరంగా ఉండేదై ఉంటుంది. అయితే తిరిగి మనలో జీవం నిండాలంటే, పరలోకానికి ఆరోహణమయ్యే కొండకు చేరాలంటే మనం తప్పనిసరిగా గెత్సెమనే తోట, సిలువ, సమాధి మార్గాల్లోగుండా ప్రయాణించాల్సి ఉంది.

ఓ మానవ హృదయమా, అబ్రాహాము అనుభవం ఆయనకొక్కడికే పరిమితం అనుకోకు. అలా మరెన్నడూ ఎక్కడా జరగదని అనుకోకు. ఎంత కష్టమైనా, నిష్టూరమైనా దేవునికి లోబడడానికి సిద్దపడిన ఆత్మలన్నిటితో ఆయన వ్యవహరించే పద్ధతికి ఇది ఒక మచ్చుతునక మాత్రమే. నువ్వు ఓపికతో సహించి కనిపెట్టిన తరువాత వాగ్దాన ఫలం నీకు దక్కుతుంది. త్యాగానికి బదులుగా లోకాతీతమైన దీవెనలు దొరుకుతాయి. దేవుని ఆశీర్వాదాల నదులు కట్టలు తెంచుకొని కృపతో, సకల సంపదలతో నిన్ను నిలువునా ముంచెత్తుతాయి. దారి కనిపించని పొగమంచు మూసినప్పటికీ ధైర్యంగా దేవుని పక్షాన ముందడుగు వేసే వారికోసం దేవుడు చెయ్యని సహాయం అంటూ ఏమీ లేదు. అలా అడుగు వేసేవాళ్ళు తమ పాదం బండమీద పడిందని తెలుసుకుంటారు.

Share on Whatsapp Daily Devotion - నిజమైన ద్రాక్షావలి

యోహాను సువార్త 15:1.” నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.2. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. 3. నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీరిప్పుడు పవిత్రులైయున్నారు. 4. నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. 5. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. 6. ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పార వేతురు, అవి కాలిపోవును. 7. నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 8. మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు.”

యేసు క్రీస్తు ప్రభువు సిలువకు అప్పగింపబడక ముందు, మేడ గదిలో తన శిష్యులను ఓదారుస్తూ తాను ఎట్టి శ్రమ అనుభవింపబోవునో ముందుగానే వారికి బయలుపరుస్తూ మరియు క్రీస్తు మరణ సమయమున వారికి కూడా ఎట్టి శ్రమలు సంభవించునో తెలియజేసెను. ఎట్టివి సంభవించినా క్రీస్తునందు నిలిచియుండుమని, విశ్వాసమును కాపాడుకొనుటలో జాగరూకులై యుండుమని, సువార్త నిమిత్తం లోకమునకు తన శిష్యులుగా బయలు పరచుకొనుమని ఆజ్ఞాపించాడు. ఇట్టి విషయాలను వివరించుటకు ద్రాక్షావల్లికిని మరియు తీగలకును పోల్చి చెప్పెను. ఆ దినాలలో యూదయ దేశమంతటా అనేక ద్రాక్షాతోటలు గలిగిన వ్యవసాయం ప్రాముఖ్యమైనది. సత్యమైన సంగతిని ఆసక్తికరంగా విషదీకరించుటకు తన్నుతాను ఈ విధంగా పోల్చుకున్నాడు. మరియు పాత నిబంధన గ్రంథం కీర్తనలు 80:8 లో గమనిస్తే ఇశ్రాయేలు ద్రాక్షావల్లి తో పోల్చబడింది. నేను ద్రాక్షావల్లిని మీరు తీగెలు అని సంబోధించటములో క్రీస్తు తనను గూర్చి మరియు తన సంఘమును గూర్చి తెలియజేస్తున్నాడు. ఆయన మరియు అయన ప్రజలు ఒకే చెట్టుకు లేదా మొక్కకు మరియు ఒకే జీవమునకు చెందినవారమని అర్ధం. అనగా సంఘము శరీరమైతే క్రీస్తు ఆ శరీరమునకు శిరస్సు. క్రీస్తు ద్రాక్షావల్లి, దానికి ఆనుకొనియున్న తీగెలు తన ప్రజలు, తన సంఘం. నిజమైన ద్రాక్షావల్లి అని ఏ ఇశ్రాయేలునైతే కీర్తనలు 80:8 లో కీర్తనాకారుడు పోల్చిచెప్పాడో అది నిజమైన ద్రాక్షావల్లిగా ఉండనందున దానిని నిజమైన సంఘముగా జేయుటకు క్రీస్తు నిజమైన ద్రాక్షావల్లిగా జేయుటకు ఈలోకానికి అవతరించాడు. ఎందుకనగా క్రీస్తు ద్వారానే సమస్త జీవం, శక్తి మరియు తన ప్రజలకు రక్షణ. ద్రాక్షాతోటలో ద్రాక్షావల్లి ముఖ్యమైనది. అయితే ఈ ద్రాక్షావల్లి స్థిరంగా మొక్కకు నిలబడాలి అంటే అందు తీగల సహాయం ఉండాల్సిందే. ద్రాక్షాగెల కలిగిన మొక్కకు తీగలు ద్రాక్షావల్లిని ఆధారము చేసుకొని యుండకపోతే ఏమి ప్రయోజనం, వాటిని వ్యవసాయకుడు పెరికివేస్తాడు. ఎప్పుడైతే ఆ తీగలు ఆధారం చేసుకొని ఉంటాయో అప్పుడే ద్రాక్షావల్లి స్థిరంగా ఉంటుంది. ఇదేవిధంగా, ఆత్మీయంగా, పరిశుధ్ధంగా ఆయన యందు ఆధారపడతారో వారికే జీవము మరియు అట్టి రక్షణ లేని యెడల పెరికివేయబడుదురు. క్రీస్తుకు వేరుగా ఉండి ఏమియు చేయలేము. ఆయనయందు నిలిచియున్న వారమైతే శ్రమ వచ్చినా, సమస్య ఎదురైనా, ఉపద్రవము పొంచియున్నా తన కృప మనలను విడిచిపోదు. ఈ ఐక్యత కేవలం విశ్వాసము ద్వారానే కలుగుతుంది.

రెండవదిగా, మన రక్షణ కొరకు మరియు ప్రతీవిధమైన ఆశీర్వాదముల కొరకు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు కారకుడై యున్నాడు. ఆయన దేవుని కుమారుడై యుండి మనకు మధ్యవర్తిగా ఉండి, పాప శరీరమందు జన్మించి ద్రాక్షావల్లితో పోల్చబడుతున్నాడు. ఈ విధంగా ప్రతి తీగ భారం ఆ వల్లి భరిస్తుంది అదే విధంగా అయన మన ప్రతీ పాపమును భరించాడు. అంతే కాకుండా తన మరణ పునరుద్ధానం ద్వారా మన పాపములవలన ఆయన మరణించి మనలను మరల బ్రదికింప జేసి ఆ నిజమైన ద్రాక్షావల్లియైన యేసు క్రీస్తు ప్రభువుతో చిగురింప చేసి నిత్యజీవమనుగ్రహించాడు. ఇట్టి మహా అద్భుతమైన మహిమను క్రీస్తు ద్వారా మనకనుగ్రహించెను.అంతేకాకుండా ఈ అధ్యాయంలో ఒక ముఖ్యమైన సంగతి దాగి ఉంది. యేసు క్రీస్తు ప్రభువు చిగురించ బడుటకు కారకుడై యున్నాడు ఎట్లనగా తీగలైన మనము ఫలించాలి అంటే ఆయనలో మనము ఇమిడి యుండాలి, ఆయనలో మనము నిలిచి యుంటేనే, ఆయన మనలో ఉంటాడు. అంతేకదా! క్రీస్తులేకుండా మనము ఏమీ చేయలేము. మంచి ఫలము ఫలించాలి అంటే ఆయనలో నిలిచి యుండాలి. అయనలో నిలిచి యుండకపొతే ఫలితం తుదకు పెరికివేయబడి అగ్నిలో పారవేయబడుతాము.

యేసు క్రీస్తు కోరుతున్న ఈ మంచి ఫలము ఏమనగా మొదటిది విశ్వాస ఫలము fruit of faith. ఈ ఫలము నిజమైనది, కనబడునది మరియు విశ్వాసము ద్వారా పనిచేయునది. అంతేకాకుండా యేసు క్రీస్తని, ఆయన ప్రభువని, సంఘము ముందు, బహిరంగముగా ఒప్పుకొనుటకు మరియు నమ్మికలేని క్రైస్తవేతరుల ముందు అనగా క్రీస్తులేని సమాజము ముందు ఒప్పుకునే దృఢమైన నిశ్చయత కలుగజేస్తుంది. రెండవదిగా జీవ ఫలము fruit of a life, అనగా తన్నుతాను క్రీస్తునకు సమర్పించుకొని ఆయన ఆజ్ఞలకు, బోధలకు, వాక్యమునకు లోబడి మంచి జీవితం జీవించగలుగుతాడు. మూడవదిగా దేవుని గుణాలు కలిగిన ఫలం fruit of a godly character, అనగా క్రీస్తు వలే జీవించడం, శుద్ధముగా, నమ్మకముగా, ప్రేమలో, విశ్వాసనీయతలో జీవించడం. ఇట్టి ఫలాలు ద్వారా నిజ జీవితంలో పరిశుధ్ధ మార్గంలో నడువగలుగుతాము, లోకమునుండి వేరై దేవునితో సహవాసం కలిగి జీవించగలుగుతాము.

ప్రియ చదువరీ, అనుదిన జీవితంలో క్షమాపణ గుణం కలిగి మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాప పడిన యెడల పరిపూర్ణమైన క్రైస్తవునిగా జీవించగలం. ఇట్టి ఫలాలను ఆయనలో ఉన్నవారికి అనుగ్రహించే ప్రేమాస్వరూపి. ఎంత ధన్యత! నిజంగా ఇలాంటి ఫలాలు మన జీవితంలో ఉన్నాయా? ఈ ప్రశ్నకు మన సమాధానం ఏంటి? జాగ్రత్త సుమీ, వ్యవసాయకుడైన తండ్రి ఫలించని దానిని పెరికివేయుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆ గొడ్డలి వేరున పడక ముందే, పెరికి వేయబడక ముందే మనలను మనము పరీక్షించుకొని పరిశీలన చేసుకొనుటకు వెనుకాడకూడదు.జాగ్రత్తగా గమనిస్తే ఏ తీగ కూడా తమ స్వంతగా వచ్చి వల్లితో జతకాలేదు, ఆ తీగ దానిలోనుండి పెరిగితే లేదా వ్యవసాయకుడు దానికి అంటుకడితే తప్ప. అనగా క్రీస్తనే సంఘములోనుండి వచ్చినవారైనా లేదా తండ్రి ద్వారా చేర్చబడినవారైనా? ఇట్టి మనము, పాపమువలన మునుపు దూరస్తులమై యున్నప్పుడు తండ్రి మన యెడల జాలి పడి క్రీస్తులో మనలను బ్రదికించెను, తన సంఘములో అనగా స్వరక్తమిచ్చి సంపాధ్యముగా చేసుకున్నాడు. రక్షింపబడి ఇప్పుడు జీవిస్తున్న మనం ఆయనలో ఒక భాగమైయున్నామని జ్ఞాపకము చేసుకుందాము. విశ్వాసులమైన మనము దేవుని వాక్యమందు నిలిచి, ఆయనలో వేరుపారి , తనలో నిలిచియుండే శక్తిని కలిగియుందాము. అట్టి కృప మనందరికి ప్రభువు అనుగ్రహించును గాక!. ఆమేన్.

methotrexat grapefruit methotrexat 30 mg methotrexat 7 5