Daily Bible Verse
"శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయ మును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి. "
యోహాను 14:27
Daily Bible Quote
"లంచము దృష్టికి మాణిక్యమువలె నుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవ ర్తించును." సామెతలు 17:8
Whats New
Whatsapp Share Feature Updated

New direct Whatsapp Share is available for Daily Verse, Quote and Devotion

Download PDF Bible

Download Telugu and English parallel bible as PDF for free on this link PDF Parallel Bible Download Here.

Download Telugu Audio Bible for free

You can now download the entire telugu audio bible for free on this link Telugu Audio Bible Download Here

Telugu Cross Reference Bible

Telugu Bible update now with Cross Reference

Telugu Audio Bible

Telugu Audio Bible is updated for all the scriptures.. Read & Listen. Now!! its Free..

Explore
Celebrating the Blessed and Glorious 10 Years of Sajeeva Vahini since 2009. Its been a decade now for Telugu Bible Online!. Thank you for your prayers and support to reach millions across the globe.
Anniversary Update: Read Telugu Bible with Chain and Cross References Online!. Click Here!. Introducing Daily Inspirations along with Daily Devotions on Home Page.
Share on Whatsapp Daily Inspiration

తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? (యోహాను 18:11).

సముద్రపు పొంగును చల్లార్చడంకన్నా, చనిపోయిన వారిని బ్రతికించడంకన్నా ఈ మాటలు అనగలగడం, వీటి ప్రకారం చెయ్యగలగడం మరింత గొప్ప విషయం. ప్రవక్తలు, అపొస్తలులు ఆశ్చర్యకార్యాలు చాలా చేశారు. నిజమే. కానీ వాళ్ళు ఒకప్పుడు కాకపోయినా మరొకప్పుడు దేవుని చిత్తానికి లోబడి శ్రమలపాలు కావడానికి వెనుకంజ వేశారు. ఇలా చెయ్యడమే విశ్వాసానికి నిర్వచనం. క్రైస్తవులు కోరదగిన మహోత్కృష్టమైన విజయం. యవ్వనపు తొలిప్రాయంలో అడుగు పెడుతుండగా జీవితాశలన్నీ మరి తిరుగులేకుండా నిరాశలై పోవడం, దినదినం ఒకటే బరువును మోసుకుంటూ తిరగవలసి రావడం, నిత్యావసరాలకీ, తనవారిని ఆకలికి మాడకుండా ఉంచగలగడానికి కూడా ఆర్థిక స్తోమత లేని పేదరికం తలకి చుట్టుకోవడం, ఏదైనా అంగవైకల్యం సంభవించి జీవితాంతం పీడనకి, కన్నీళ్ళకు గురికావడం, ప్రియులందరూ ఒక్కొక్కరే ఎడబాటైపోయి జీవితపు విఘాతాలను ఎదుర్కొనేందుకు ఒంటరిగా నిలబడవలసి రావడం... ఇవన్నీ జరుగుతున్నా ఆ శ్రమల తుపానులో ధైర్యంగా నిలబడి మనం చెప్పగలగాలి "తండ్రి నాకనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా?" ఇదే విశ్వాస శిఖరం, ఆత్మీయ విజయాల కిరీటం. విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చెయ్యడంలో కాదు, సహనంతో శ్రమలను అనుభవించడంలోనే బయటపడుతుంది.

మన శ్రమల గురించి మన దేవునికి సానుభూతి ఉంది. ఎందుకంటే ఆయన శ్రమలను అనుభవించిన రక్షకుడు. మన శ్రమల్లో మనకు తోడు ఇంకెవరు ఉండగలరు? మనం అనుభవిస్తున్న శ్రమలు ఎలాటివో తెలిసినవాడు తప్ప?

మనల్ని మనం కొంత నష్టపరచుకొంటేనేగాని ఇతరులకు ఊరట కలిగించలేం. ఇతరులకి సానుభూతి చూపగలగడానికి మనం పడే శ్రమలే మనం చెల్లించే ధర. సహాయం చెయ్యాలని జమకట్టినవాడు ముందుగా బాధలు పడినవాడై ఉండాలి. రక్షకుడైనవాడు అంతకుముందు ఎప్పుడో ఒకప్పుడు సిలువ అనుభవం పొందినవాడై ఉండాలి. ఇతరులకు చేయూతనిచ్చే ధన్యత మనకు కావాలంటే యేసుప్రభువు తాగిన గిన్నెలోనిది మనం కూడా తాగాలి. ఆయన పొందిన బాప్తిస్మం మనం కూడా పొందాలి.

దావీదు కీర్తనల్లో ఎక్కువ ఆదరణ కలిగించే కీర్తనలన్నీ శ్రమల గానుగల్లో నుండి బయటకి కారినవే. పౌలుకి ఆ ముల్లు శరీరంలో లేకపోయినట్టయితే అతడు వ్రాసిన పత్రికల్లో అంత ఆప్యాయత ఉట్టిపడుతూ ఉండేది కాదు.

నువ్వు క్రీస్తులో ఉన్నట్టయితే ఇప్పుడు నిన్ను నలగొడుతున్న పరిస్థితులు తండ్రి చేతిలోని పరికరాలు తప్ప మరేమీ కాదు. వాటితో ఆయన నిన్ను నిత్యత్వం కోసం సిద్ధం చేస్తున్నాడు. ఆయన్ను నమ్ము. ఆ పరికరాలను తోసెయ్యకు.

కష్టాల్ని చూసి తప్పుకుపోతాం
నిజమే, నమ్మశక్యం కాదు గాని,
వెనకాల వాటినానుకునే
దీవెనలు నడిచి వస్తున్నాయి
శ్రమల బడిలో పట్టా పుచ్చుకునే వాళ్ళు చాలా కొద్దిమంది.


Share on Whatsapp Daily Devotion - వివాహ బంధం 4

క్రైస్తవ కుటుంబ వ్యవస్థలో, ముఖ్యంగా భార్యా భర్తల వివాహ బంధంలో పిల్లల పాత్ర ఏమిటి? పిల్లల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? ఈ ప్రశ్నలు ఏంతో ప్రాముఖ్యమైనవి. కుటుంబానికి కేంద్ర బిందువు ఏమిటి? కుటుంబం దేనిమీద ఆధారపడి క్రీస్తుకు నచ్చిన విధంగా నడుచుకోగలదు అని ఎవరైనా ప్రశ్నిస్తే, ఎక్కువ శాతం కుటుంబానికి కేంద్రబిందువు పిల్లలు, పిల్లల కోసమే బ్రతుకుతున్నాము, వారి సంతోషమే మా సంతోషం అని చెప్తారు. కాని లోతుగా ఆలోచిస్తే అది సరియైనది కాదు అని అర్ధం చేసుకుంటాము. వివాహ బంధంలో భార్య భర్తల మధ్య దేవుని వాక్యమునకు విధేయత, ప్రేమ, సహకారము, నమ్మకంతో కూడిన బంధమే నిజంగా క్రైస్తవ కుటుంబానికి కేంద్ర బిందువుగా వుండాలి.

కొన్ని వేల సంవత్సరాల క్రితం పాలస్తీనాలో జరిగిన ఒక కుటుంబ గాధ, బైబిలు లో వ్రాయబడింది. అది మనకు కొన్ని సూచనలు ఇస్తున్నది. ఇస్సాకు, రిబ్కాలు భార్య భర్తలు. వారికి ఇద్దరు కుమారులు ఏశావు, యాకోబు. అయితే ఆది 25:28 లో “ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను, గనుక అతని ప్రేమించెను. రిబ్కా యాకోబును ప్రేమించెను”. కీర్తనలు 127:3 లో “కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము” అని వ్రాయబడియుంది. అంటే దేవుడు ఇచ్చిన స్వాస్థ్యమును లేక బహుమానములను తల్లిదండ్రులిద్దరూ సమానంగా ప్రేమించలేక పోయారు. పిల్లలను ప్రేమించే విషయంలో వారిద్దరి మధ్య ఏక మనస్సు లేదు. కాబట్టి పిల్లలు ఆ కుటుంబానికి కేంద్ర బిందువుగా మారారు. ఏశావును మాత్రమే ఆశీర్వదించాలని ఇస్సాకు ఆశ, యాకోబును ఆ ఆశీర్వాదములకు వారసుడిని చేయాలని రిబ్కా తహ తహ. ఆ కుటుంబ వ్యవస్థను ఛిన్నా భిన్నం చేసాయి. రిబ్కా యాకోబును ఎంతగా ప్రేమించింది అంటే, భర్తను మోసం చేయడానికి కూడా వెనుకాడలేదు. ఏ రిబ్కా అయితే (ఆది 24లో) దూరమునుండి యజమానుని చూచి గౌరవించి, ఒంటె మీద నుండి దిగి ముసుకు వేసుకుందో! ఆ రిబ్కా (ఆది 27లో) కళ్ళు కనపడని, ముసలివాడైన భర్త, మనిషి రోమాలకి మేక వెంట్రుకలకు తేడా తెలియని స్థితిలో ఉన్న భర్త బలహీనతను ఆధారం చేసుకొని ఆయనను మోసం చేసింది. ఆ రోజే ఆ కుటుంబం సుఖసంతోషాలకు, ప్రేమ అనురాగాలకు, కలిసి జీవించడానికి దూరం అయింది. మనకు ఇదొక హెచ్చరిక. పిల్లల ఎదుట భార్య భర్తలు ఒకరినొకరు దూషించుకుంటూ వుంటే ఒకరోజు అదే పిల్లలద్వారా వారి ఇద్దరి మధ్య బంధం బలహీనపడుతుంది. తల్లి పక్షాన చేరి తండ్రిని తృణీకరిస్తారు, లేదంటే తండ్రి పక్షాన చేరి తల్లిని కాదంటారు.

ప్రతి గృహంలో I కోరింథీ 13:4,5 “ప్రేమ దీర్ఘకాలము సహించును. దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు. అమర్యాదగా నడువదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనస్సులో ఉంచుకొనదు” అన్న వాక్యాలు నెరవేర్చబడాలి. భార్య భర్తలు కలిసి పిల్లల పెంపకం విషయంలో తగిన శ్రద్ధ చూపించాలి. పిల్లల ద్వారా భార్య భర్తల బంధం ఇంకా బలపరచబడాలి కాని బలహీనపడరాదు. పిల్లలు లేరని, పిల్లల కోసం మరొక పెళ్లి చేసుకోవడం క్రైస్తవ వివాహ బంధానికి విరుద్ధం. అది లోకందృష్టిలో తప్పులేనిదిగా ఎంచబడవచ్చు కాని క్రైస్తవులైన మనకు కాదు.

దేవుడు మన కుటుంబాలను, మన పిల్లలను ముఖ్యంగా పవిత్ర క్రైస్తవ వివాహ బంధాలను, పటిష్ఠ పరచి ఆయన కృపలో మనలను భద్రపరచును గాక.

toilax 5mg toilax 01 toilax spc