Daily Bible Verse
"నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి; "
మత్తయి 25:35
Daily Bible Quote
"తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా? వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట సుళువు." సామెతలు 26:12
Whats New
Whatsapp Share Feature Updated

New direct Whatsapp Share is available for Daily Verse, Quote and Devotion

Download PDF Bible

Download Telugu and English parallel bible as PDF for free on this link PDF Parallel Bible Download Here.

Download Telugu Audio Bible for free

You can now download the entire telugu audio bible for free on this link Telugu Audio Bible Download Here

Telugu Cross Reference Bible

Telugu Bible update now with Cross Reference

Telugu Audio Bible

Telugu Audio Bible is updated for all the scriptures.. Read & Listen. Now!! its Free..

Explore
Celebrating the Blessed and Glorious 10 Years of Sajeeva Vahini since 2009. Its been a decade now for Telugu Bible Online!. Thank you for your prayers and support to reach millions across the globe.
Anniversary Update: Read Telugu Bible with Chain and Cross References Online!. Click Here!. Introducing Daily Inspirations along with Daily Devotions on Home Page.
Share on Whatsapp Daily Inspiration

కడమ వారిలో కొందరు పలకలమీదను, కొందరు ఓడ చెక్కల మీదను, పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరు తప్పించుకొని దరిచేరిరి (అపొ.కా. 27:44).

మానవ జీవితకథలో విశ్వాసపు వెలుగు నీడలన్నీ పౌలు చేసిన ఈ తుది ప్రయాణపు జయాపజయాల్లో ప్రతిబింబిస్తుంటాయి. ఈ అద్భుతగాథలోని విశేషం ఏమిటంటే, ఇందులో ఎదురైన ఇబ్బందులన్నిటిలో దేవుని అదృశ్య హస్తపు ఛాయలు అల్లుకుపోయి కనిపిస్తూ ఉంటాయి.

విశ్వాసపు దారి అంతా పూలబాట అని అందరూ సామాన్యంగా అనుకుంటూ ఉంటారు. దేవుడు తన జనుల జీవిత విధానాలలో జోక్యం కల్పించుకుని వారిని బాధల దశలోనుండి అద్భుతమైన రీతిలో పైకెత్తి తప్పిస్తాడనుకుంటారు. కాని వాస్తవం దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. హేబెలు దగ్గరనుండి నిన్న మొన్నటి హతసాక్షి వరకు ఆ సాక్షిసమూహ మేఘమంతటినీ పరిశీలించి చూస్తే వాళ్ళ జీవితాలు కష్టసుఖాల కావడి కుండలే.

విశ్వాసి బాధలననుభవిస్తూ కూడా ఆత్మలో కృంగిపోడు అనడానికి పౌలు అందరికంటే మంచి ఉదాహరణ. దమస్కులో అతడు ఇచ్చిన సాక్ష్యం మూలంగా అతణ్ణి బంధించేవాళ్ళు తరుముకొస్తే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పారిపోవలసి వచ్చింది. అయితే ఆ పరిశుద్దుడైన అపొస్తలుణ్ణి శత్రువులనుండి తప్పించడానికి అగ్నితో, ఉరుములతో పరలోకపు రథాల సమూహం దిగి రాలేదు. అతణ్ణి బుట్టలో పెట్టి కిటికీలోగుండా దమస్కు గోడ క్రిందికి దించి పారిపోవడానికి అక్కడి విశ్వాసులు సహాయం చెయ్యవలసి వచ్చింది. పాత బట్టలు వేసుకునే బుట్టలో కూరగాయల్లాగానో, మురికి బట్టల్లాగానో ఆ క్రీస్తు సేవకుణ్ణి బుట్టలో పెట్టి కిటికీలోగుండా దించి లజ్జాకరమైన పరిస్థితుల్లో శత్రువుల ద్వేషాన్ని తప్పించుకొనేందుకు పంపించెయ్యాల్సి వచ్చింది.

పౌలు ఒంటరిగా చీకటి కూపాల్లో నెలల తరబడి ఉన్నాడు. తాను ఆశతో ఎదురుచూసిన సమయాల గురించీ, ఉపవాసాల గురించీ, స్నేహితులు ఏకాకిని చేసి వెళ్ళిపోవడాలూ, క్రూరమైన దెబ్బలు తినడమూ వీటన్నిటి గురించీ అతడు చెప్పాడు. ఇక్కడైతే దేవుడు క్షేమంగా గమ్యానికి చేరుస్తానని ప్రమాణం చేసిన తరువాత కూడా ఆ తుపాను రేగిన సముద్రంలో కొట్టుకుపోవలసి వచ్చింది. చంపెయ్యాలని చూస్తున్న సైనికులను జాగ్రత్తగా కనిపెట్టి చూడవలసి వచ్చింది. చివరికి ఆ ఓడలోనుండి బయటపడే సమయం వచ్చినప్పుడు ఆ మహాత్ముడిని తీసుకువెళ్ళడానికి ఏ నావా అందుబాటులో లేదు. ఎగిసి పడుతున్న అలలను నిమ్మళింపజేయడానికి ఏ దేవతా ఆ నీటి మీద నడిచి రాలేదు. అద్భుత కార్యాలూ, సూచనలూ ఏమీ జరగలేదు. కాని ఒకడు తేలుతున్న కొయ్యదుంగను, మరొకడు విరిగిపోయిన చెక్క పలకనూ పట్టుకుని ఒడ్డుకి చేరవలసి వచ్చింది. ఏమీ దొరకనివాళ్ళు పళ్ళ బిగువున ఈదుకుంటూ పోవలసి వచ్చింది.

మన జీవితాలలో కూడా దేవుడు వ్యవహరించే విధానం ఇదే. దైనందిన జీవితంలో సాధారణంగా ఎదురయ్యే సమస్యలతో సతమతమయ్యే ప్రజలకి సహాయ సువార్త ఇదే. అనుదిన సమస్యలకు ఆచరణయోగ్యమైన విధానం ఇదే.

దేవుని వాగ్దానాలూ, దేవుని లీలలు మనలను దినదినమూ మనకేదురయ్యే సామాన్యమైన ఇబ్బందుల పరిధినుండి బయటికి తీసుకురావు. ఎందుకంటే ఈ ఇబ్బందుల వల్లనే మన విశ్వాసం పరిపక్వమయ్యేది. దేవుడు మన అనుదిన జీవితపు అనుభవాల అల్లికలోనే తన ప్రేమ, కృపల పసిడి దారాలను పెనవేస్తుంటాడు.

Share on Whatsapp Daily Devotion - స్తుతి యాగం

ఆజ్ఞ: కీర్తన 50:14 దేవునికి స్తుతి యాగము చేయుము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. యేసు క్రీస్తు ద్వారానే స్తుతి యాగము అర్పించగలము

హెబ్రీ 13:15 ఆయన(యేసు క్రీస్తు) ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలము అర్పించుదము.

కొలస్సి 3:17 మాటచేత గాని క్రియచేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.

అంతరంగ స్తుతి: దాని 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసికొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను.

బహిరంగ స్తుతి: కీర్తన 35:18 మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను బహు జనులలో నిన్ను నుతించెదను.

కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించవలెను:

ఆయన పరిశుద్ధనామమునుబట్టి

కీర్తన 97:12 నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధనామమునుబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.

ఆయన సమీపముగా ఉన్నందుకు

కీర్తన 75:1 దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

న్యాయమైన ఆయన విధులనుబట్టి

కీర్తన 119:62 న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రివేళ నేను మేల్కొనువాడను. మనము కలుగ చేయబడిన విధానము బట్టి

కీర్తన 139:14 నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములనుబట్టి

కీర్తన 107:8,15,21,31 ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.

పాపమునుండి విమోచించినందుకు:

రోమ 6:18 పాపమునుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి; ఇందుకు దేవునికి స్తోత్రము. మరణము పై జయము అనుగ్రహించినందుకు

1కొరిం 15:55-57 ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగుగాక.

ఆయన వరమునుగూర్చి

2కొరిం 9:15 చెప్ప శక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము.

ఆయన మహాబలమును స్వీకరించి యేలుచున్నందుకు

ప్రకటన 11:17 వర్తమానభూత కాలములలో ఉండు దేవుడైన ప్రభూవా, సర్వాధికారీ, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము.

ప్రతి విషయమునందు

1 థెస్స 5:18 ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము.

కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసిన విధానము:

స్తుతులతో

కీర్తన 69:30 కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను కృతజ్ఞతాస్తుతులతో నేనాయనను ఘనపరచెదను

ప్రార్థనలతో

ఫిలిప్పి4:6 ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఇతరులను గూర్చిన విజ్ఞాపనలతో

1తిమో 2:1 అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును రాజుల కొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను.

ఆయన సన్నిధికి రావలసిన విధానము:

కీర్తన 95:2 కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.

కీర్తన 100:4 కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి.